23.10.2022
ఆదివారమ్
ఓమ్
సాయి శ్రీ సాయి జయజయ సాయి
శ్రీ మాత్రే నమః
సాయి
బంధువులకు బాబావారి శుభాశీస్సులు
శ్రీ
సాయి దయా సాగరమ్ 43వ, భాగమ్
అధ్యాయమ్
– 41
మరాఠీ
మూలగ్రంధ రచయిత్రి --- శ్రీమతి ఉజ్వలా బోర్కర్, విలేపార్లే - ముంబాయి
ఆంగ్లానువాదమ్
--- శ్రీ ఉదయ్ అంబాదాస్ బక్షి
తెలుగు
అనువాదమ్ --- ఆత్రేయపురపు త్యాగరాజు, నిజాంపేట,
హైదరాబాద్
9440375411 & 81436267
సముద్రాలు
దాటుకుని రా బాబా!
2005
వ.సం. మా అమ్మాయికి నాటింగ్ఫ్ హాం యూనివర్సిటీలో
ఎం ఎస్ లో ప్రవేశం లబించింది. ఎం.ఎస్. పూర్తయిన
తరువాత లీడ్స్ లో ఉద్యోగం వచ్చింది. నలుగురైదుగురు
స్నేహితురాళ్ళతో కలిసి ఒక ఫ్లాట్ లో ఉంటోంది.
వాళ్ళందరూ ఆ ఫ్లాట్ లో ఎలా ఉంటున్నారో ప్రతిరోజు వారి దినచర్యలేమిటో చూద్దామని
నేను వెళ్లాను. కాన్వొకేషన్ కార్యక్రమానికి
కూడా వెళ్ళాను. భారతదేశానికి తిరిగి వచ్చాక
కూడా మా అమ్మాయితో అంతర్జాలంలో ద్వారా మాట్లాడుతూ ఉండేదానిని. అక్కడ అన్నీ సవ్యంగానే జరుగుతున్నాయి.
2008
వ. సం. లో మా అమ్మాయి స్నేహితురాళ్ళు ఫోన్ చేసారు. మా అమ్మాయి అమృతకి సుస్తీ చేయ్తడం వల్ల ఆస్పత్రిలో
చేర్చినట్లు చెప్పారు. మా అమ్మాయికి పొత్తి
కడుపులో నెప్పిగా ఉందనీ, నిలుచోలేకపోతోందని చెప్పారు. ప్రస్తుతం స్పృహలో లేదని అన్నారు. లాప్రోస్కోపీ చేసారని చెప్పడంతో నాకింక కాళ్ళు చేతులూ ఆడలేదు. వెంటనే లండన్ కి ప్రయాణమయి వెళ్ళాలని నిర్ణయించుకున్నాను. కాని మొట్టమొదటగా వీసా సమస్య. దానికి సంబంధించిన అన్ని పనులు అయిన తరువాత 28 రోజులకి
అత్యవసర పధ్ధతి మీద వీసా వచ్చింది.
వెంటనే
లండన్ కి బయలుదేరి హీత్రూ విమానాశ్రయంలో దిగాను.
అమ్మాయి స్నేహితురాళ్ళలొ ఒకామె వచ్చి నన్ను దగ్గరుండి తీసుకువెళ్ళింది. లండన్ చేరుకునేటప్పటికి నాలుగయిదు గంటలు పట్టింది నన్ను తను ఆస్పత్రికి తీసుకువెళ్ళింది. అప్పటికి రాత్రి 11 గంటలు అవడం వల్ల ఆస్పత్రి నియమాల
ప్రకారం విజిటింగ్ అవర్శ్ అయిపోయాయి అమ్మయిని చూడటానికి కుదరదని అన్నారు. ఇక చేసేదేమి
లేక తిరిగి మా అమ్మాయి ఉంటున్న ఫ్లాట్ కి వచ్చేశాము. అమ్మాయి స్నేహితురాళ్ళు భోజనం ఏర్పాట్లు చేసారు.
ఉదయం
నేను, మా అమ్మాయి స్నేహితురాలుతో కలిసి ఆస్పత్రికి వచ్చాను అది బాగా పెద్ద కార్పొరేట్ ఆస్పత్రి అని చూడగానే
తెలిసిపోతోంది. మా అమ్మాయి ఉన్న గది 21 వ అంతస్తులో
ఉంది. మా అమ్మాయిని కలుసుకోవడానికి అనుమతి
తీసుకున్నాము. . ఆస్పత్రిలో ఉన్న సదుపాయాలు చూసి చాలా అద్భుతం అనిపించింది. మేము 21 వ అంతస్తుకి చేరుకున్నాము. మా అమ్మాయి ఉన్న గదిలోకి అడుగు పెట్టాము. మా అమ్మాయికి శరీరమంతా ఏవేవో వైర్లు పెట్టబడి ఉన్నాయి. అమ్మాయి చాలా బలహీనంగా ఉంది. నన్ను పలకరించడానికి కూడా నోటివెంట మాట రానంత బలహీనంగా
ఉంది. ఆస్పత్రిలో ఉన్న అమ్మాయిని చూడటానికి
ఏకంగా భారతదేశం నుండి తల్లి వచ్చిందని తెలిసి బ్రిటీష్ వాళ్ళు చాలా ఆశ్చర్యపోయారు. ఆస్పత్రి నియమాల ప్రకారం విజిటింగ్ సమయాలు తప్ప ఇక ఉండటానికి అనుమతించరు. మా అమ్మాయి పరిస్థితిని చూసి రోజంతా నేను దగ్గరే
ఉండటానికి ఒప్పుకున్నారు.
మా
అమ్మాయికి వేళకి మందులు ఇస్తూ జాగ్రత్తగా చూసుకుంటున్నాను. ఆస్పత్రివారి నిబంధనల ప్రకారం బయటినుండి తెచ్చిన
ఆహారాన్ని అనుమతించరు. వారు పెట్టిన నిబంధనలు ఖచ్చితంగా అమలు చేయాల్సిందే. మా అమ్మాయి
కోలుకోవడం చాలా నెమ్మదిగా జరుగుతూ ఉంది. మందులు
వల్ల సరైన పోషకాహారం లేకపోవడం వల్ల నోటిలో పుళ్ళు వచ్చాయి. నేను ఇంటిలో వండిన పదార్ధాలు తెచ్చి అమ్మాయికి పెడతాను
దయచేసి అనుమతివ్వండి అని వైద్యులను బ్రతిమాలాను.
ఎలాగయితేనేమి చివరికి వాళ్ళు ఒప్పుకోవడంతో ఇంటిలో అన్నం బాగా మెత్తగా వండి నెయ్యి
వేసి, మంచి ఆహారం తీసుకువచ్చి పెట్టాను. దాని
వల్ల మా అమ్మాయి ఆరోగ్యం చాలా తొందరగానే మెరుగుపడసాగింది. అమ్మాయి ఆరోగ్యం ఇంత తొందరగా మెరుగుపడటంతో వైద్యులు
కూడా ఆశ్చర్యపోయి ఎటువంటి ఆహారం పెట్టారు అని చాలా ఉత్సుకతతో అడిగారు. నేను అమ్మాయికి ఎలాంటి ఆహారం పెడుతున్నానో వాళ్ళకి
వివరంగా చెప్పాను. కొన్ని రోజుల తరువాత ఆస్పత్రినుండి
ఇంటికి పంపించారు. లీడ్స్ లో ఉన్న ఇంటికి తిరిగి
వచ్చాము. నేను అమ్మాయి బరువు, ఆరోగ్యం మీద
బాగా దృష్టిపెట్టి జాగ్రత్తగా చూసుకోవడం వల్ల తను చక్కగానే కోలుకుంది.
(ఇంకా ఉంది)
(బాబా గారు సప్త సముద్రాలు దాటుకుని వచ్చారా? )
(సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment