18.10.2022
మంగళవారమ్
ఓమ్
సాయి శ్రీ సాయి జయజయ సాయి
శ్రీ మాత్రే నమః
సాయి
బంధువులకు బాబావారి శుభాశీస్సులు
శ్రీ
సాయి దయా సాగరమ్ 42వ, భాగమ్
అధ్యాయమ్
– 40
మరాఠీ
మూలగ్రంధ రచయిత్రి --- శ్రీమతి ఉజ్వలా బోర్కర్, విలేపార్లే - ముంబాయి
ఆంగ్లానువాదమ్
--- శ్రీ ఉదయ్ అంబాదాస్ బక్షి
(ఉదయ్ అంబాదాస్ బక్షి)
తెలుగు
అనువాదమ్ --- ఆత్రేయపురపు త్యాగరాజు, నిజాంపేట,
హైదరాబాద్
9440375411 & 81436267
బాబా
రక్షణ కవచమ్
ఈ సంఘటన
1980 వ, సం. లో జరిగింది. నా అక్కచెల్లెళ్ళలో
పెద్ద అక్క షైలా బద్లాపూర్ లో ఉండేది. ఇప్పుడు
ఆమె జీవించి లేదు. నేను ఒకసారి ఉజ్వలాతాయి
ఇంటిలో శుభకార్యానికి ముంబాయినుండి బయలుదేరి వెళ్లాను. నేను పార్లేలో ఒకరోజు ఉన్న తరువాత మరునాడు షైలాని
కలుసుకోవడానికి లోకల్ రైలులో దాదర్ కి వచ్చాను.
దాదర్ నుండి మరొక లోకల్ రైలులో కళ్యాణ్ స్టేషన్ లో దిగాను.
నాకు
చాలా అలసటగాను, నీరసంగాను ఉండటంతో కాసేపు కూర్చోవాలనిపించింది. బెంచీమీద కూర్చుని సేద తీరుదామనుకుంటే బెంచీలు ఎక్కడా
ఖాళీలు లేవు. ప్లాట్ ఫారం మధ్యలో మూడు పెద్ద
ట్రంకు పెట్టెలు ఉన్నాయి. అవి ఒకదానిమీద ఒకటి
పెట్టబడి ఉన్నాయి. ఆ పెట్టెలు మిలిటరీ కమాండర్స్
కి సంబంధించినవి. లోడ్ చేయబడిన రైఫిల్ ను మిలిటరీవాళ్ళుఆ
పెట్టెలకు ఆనించి ఉంచారు. దాని ట్రిగ్గర్ రెండు
పెట్టెల మధ్యన ఉంది. ఆ రైపిల్ నిలువుగా పెట్టబడి
ఉంది.
నేను
చాలా అలసిపోయి ఉండటం వల్ల ఎక్కడయినా కాసేపు కూర్చుందామనిపించి చూసే మిలటరీవారి పెట్టెలు
కనిపించాయి. వెంటనే నేను పెటి మీద కూర్చున్నాను. నేను కూర్చున్న పెట్టె, దాని, కిదపెట్టె రెండిటి
మధ్యలో రైఫిల్ ట్రిగ్గర్ ఇరుక్కుని ఉంది. నేను పెట్టి మీద కూర్చున్న ఒక్క సెకనులోపే ఢాం…ఢాం…ఢాం...
మూడు నాలుగు బుల్లెట్లు సరిగ్గా నాచెవి పక్కనుంచి పైకప్పు వైపు దూసుకుపోయాయి. పెద్ద శబ్దం.
ప్లాట్ ఫారం అంతా కలకలం. ఒక్కసారిగా
భయంతో అందరూ వణికిపోయారు. అందరూ నా చుట్టు
మూగారు. ఒకతను నన్ను స్టేషన్ మాస్టర్ దగ్గరకు
తీసుకువెళ్లాడు. ప్రయాణీకులందరూ మిలటరీ సోల్గర్స్
మీద గట్టిగా అరుస్తూ తిట్టసాగారు.
మిలటరీ
ఆఫీసర్లు స్టేషన్ మాస్టర్ గదిలోకి వచ్చారు
ఒక ఆఫీసరు నా వీపుమీద తట్టి ఎవరివో దీవెనలు నీమీద ఉన్నాయి. అవే నిన్ను రక్షించాయి. నువ్వు చాలా అదృష్టవంతుడివి అన్నాడు.
ఆ దీవెనలు,
రక్షణ కవచం సాయిబాబావారివని నేను గ్రహించుకున్నాను.
ఉదయ్
బక్షి
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment