17.10.2022
సోమవారమ్
ఓమ్
సాయి శ్రీ సాయి జయజయ సాయి
శ్రీ మాత్రే నమః
సాయి
బంధువులకు బాబావారి శుభాశీస్సులు
శ్రీ
సాయి దయా సాగరమ్ 41 వ, భాగమ్
అధ్యాయమ్
– 39
మరాఠీ
మూలగ్రంధ రచయిత్రి --- శ్రీమతి ఉజ్వలా బోర్కర్, విలేపార్లే - ముంబాయి
ఆంగ్లానువాదమ్
--- శ్రీ ఉదయ్ అంబాదాస్ బక్షి
తెలుగు
అనువాదమ్ --- ఆత్రేయపురపు త్యాగరాజు, నిజాంపేట,
హైదరాబాద్
9440375411 & 814362674
బాబా
పెట్టిన ముహూర్తమ్
సవంత్
వాడీ జిల్లాలో అజగావ్ చిన్న పట్టణం. ఈ పట్టణం
చిన్నదయినా ఎంతో అందంగాను, పరిశుభ్రంగాను ఉంటుంది. ఈ పట్టణంలోనే పంధ్రేవాడి అని ఒక ప్రాంతం ఉంది. ఇక్కడ ఒక పురాతన శివాలయం ఉంది. దీని ప్రక్కనే ఒక సాయిమందిరం ఉంది. ఈ సాయిమందిరానికి సంబంధించి మంచి ఆసక్తికరమయిన చరిత్ర
ఉంది.
పంధ్రేవాడీ నివాసి అయిన దివాకర్ పండరే వ్యాపార నిమిత్తం ముంబాయిలో నివాసం ఉంటున్నాడు. ఒకసారి అతనికి స్వప్నంలో బాబా దర్శనమిచ్చి అజగావ్ పట్టణంలో సాయిమందిరాన్ని నిర్మించమని ఆదేశించారు. అతను ఈ విషయాన్ని కొంతకాలం పట్టించుకోలేదు. కాని ప్రతిరోజు పూజ చేసుకునే సమయాలలో అటువంటి సూచనలు పదేపదే రావడం మొదలుపెట్టాయి. అందుచేత ముందుగా గ్రామదేవతల అనుమతి తీసుకోవాలనే నిర్ణయానికి వచ్చాడు.
ముంబాయి నుండి తన పట్టణానికి వచ్చి గ్రామసర్పంచి అయిన
లక్ష్మణ్ మురారి పరబ్ తో విషయమంతా చెప్పి చర్చలు జరిపాడు. సాంప్రదాయాన్ననుసరించి ముందుగా గ్రామదేవతకు పూజలు
చేసారు. ఆతరువాత శ్రీ సాయి ట్రస్ట్ ను ఏర్పాటు
చేసారు. ట్రస్ట్ ఏర్పాటుకు కావలసిన చట్టబద్ధమయిన
పత్రాలన్నిటిని తయారుచేసి రిజిస్ట్రేషన్ చేయించారు. మందిర నిర్మాణానికి అందరి వద్ధ చందాలు సేకరించి
వారి సహాయ సహకారాలు కోరారు. 1996 వ.సం. మే నెల 30 తారీకున మందిరంలో బాబా విగ్రహాన్ని
ప్రతిష్టించడం జరిగింది.
మందిర
నిర్మాణం, విగ్రహ ప్రతిష్టకి ముందు జరిగిన సంఘటనలు.
మొదటగా
1089 చ.గ. స్థలాన్ని ట్రస్ట్ వారు కొనుగోలు చేసారు. దివాకర్ పండరే 1089 చ.గ. స్థలాన్ని విరాళంగా ఇచ్చాడు. మొట్టమొదటగా గర్భగుడి నిర్మించారు. మరలా దివాకర్ కి బాబా స్వప్నంలో కనిపించి 1996 వ.సం.
మే నెల 30 తారీకునాడే విగ్రహప్రతిష్ట జరగాలని చెప్పారు. అప్పటికి మందిర నిర్మాణం ముందుకు కొనసాగించడానికి
ట్రస్ట్ వధ్ధ నిధులు లేవు. అందుచేత మరికొంత
చందాలు వసూలు చేసిన తరువాత మందిర నిర్మాణం
సంగతి చూద్దాములే అనుకున్నారు. కాని
బాబాగారు మే నెల 30 వ.తేదీన మాత్రమే విగ్రహప్రతిష్ట జరిపించాలని సూచనలు చేస్తూ ఉన్నారు. అప్పటికి ట్రస్టు ఖాతాలో కేవలం రెండువేల రూపాయలు
మాత్రమే ఉన్నాయి. గర్భగుడిలో విగ్రహ ప్రతిష్ట
ఏవిధంగా జరిపించాలో తెలియని పరిస్థితి. ఏమి
చేయాలి? దివాకర్ ముంబాయిలో ఉన్న తన ఇంటిని
అమ్మడానికి నిర్ణయించుకున్నాడు. ఆవిధంగా బాబా
ఆదేశించిన ప్రకారం విగ్రహప్రతిష్ట ముహూర్తం కూడా నిర్ణయించేసి ఆహ్వానపత్రికలు కూడా
అచ్చువేయించేసారు. ట్రస్ట్ ముఖ్యాధికారి దాజీ
పోఖరే, సర్పంచ్ నరహరి పండరె ఇద్దరూ ముంబాయి వెళ్ళి ఒక షో రూములో సాయిబాబా విగ్రహాన్ని
ఎంపిక చేసారు. మొట్టమొదటగా ముంబాయి విలే పార్లే
జీవన్ హోటల్ వెనుక ఉన్న సందరేశన్ తరగతి గదిలో
సమావేశమయ్యారు. ఆసమయంలో దివకర్ పండరే ముందు
ఒక కొబ్బరికాయ పడింది. ఇక మందిర పనులను కొనసాగించడానికి
అదే శుభముహూర్తమని సాయిబాబా తమ సమ్మతిని తెలిపినట్లుగా భావించారు. బాబా విగ్రహానికి పదివేల రూపాయలకు కొనడానికి షోరూమ్
వారితో ఒప్పందం కుదుర్చుకున్నారు. ట్రస్టువారు
అనుకున్న దానికంటే విగ్రహం ఖరీదు చాలా ఎక్కువే.
ఆ సమయానికి పనులన్నీ కొనసాగించడానికి ట్రస్టు అనుకున్న సొమ్మును కూడబెట్టలేకపోయింది. కాని అందరికీ సాయి మీద అచంచలమయిన గట్టి నమ్మకం ఉంది.
ఇక
బాబా నిర్ణయించిన ముహూర్తానికి 5 – 6 రోజులే మిగిలి ఉంది. ఆ సమయంలో ముంబాయిలో స్థిరపడిన అజగావ్ నివాసి దివార్కర్
అనే అతను అజగావ్ కి వచ్చాడు. అతనికి సాయిబాబా
మందిరం నిర్మాణపనులు జరుగుతున్నాయని తెలిసింది.
మందిరం నిర్మాణానికి కావలసిన మిగతా పనులన్నీ నువ్వు పూర్తిచేయి అని బాబా అతనికి
సూచించారు. ఆహ్వానపత్రికల ముద్రణ ఇంకా అవసరమయిన
పనుల నిమిత్తం అతను ట్రస్టుకి రూ.11,000/- చందాగా ఇచ్చాడు. ఆ ప్రకారంగా మందిరం పనులన్నీ జరుగుతున్నాయి. కాని ఇక్కడ విషయం ఏమిటంటే ట్రస్టు వాళ్ళు దివార్కర్
కి బాబా విగ్రహం కొనడానికి సొమ్ము సమకూడలేదనే విషయం చెప్పలేదు.
అదేరోజు
సాయంత్రం అడర్కర్ అనే ఆయన తన కారులో ముంబాయికి వెడుతూ దివార్కర్ ని కూడా రమ్మన్నారు. కారులో ప్రయణిస్త్ఝూ సాయి భజన చేసుకుంటున్నారు. దివార్కర్ ఎంతో భక్తితో సాయిభజన వింటున్నాడు. హటాత్తుగా అతనికి మందిరం పని సగంలో ఆగిపోయిందని
అనిపించింది. సాయిమందిరం ఇంకా ఎందుకు పూర్తవలేదు
అసలు సమస్య ఏమిటి చెప్పండి అని దివార్కర్, దివాకర్ ని అడిగారు. అపుడు దివాకర్
బాబ విగ్రహం కొనడానికి సొమ్ము సరిపోలేదని, అదే పెద్ద సమస్యగా ఉందన్నారు. అపుడు అడర్కర్ గారు మీరేమీ బెంగపెట్టుకోకండి, విగ్రహానికి కావలసిన సొమ్ము నేనిస్తాను.
ఇది బాబా నాకు ఇచ్చిన ఆదేశం అన్నారు.
ఈ విధంగా
ముహూర్తానికి ముందుగానే అన్ని పనులు సక్రమంగా జరిగాయి. విగ్రహం కొనడానికి కావలసిన సొమ్ము కూడా సమకూడి ఆర్ధిక
సమస్య తీరిపోవడంతో పట్టణంలోని ప్రతివారూ ఎంతో సంతోషించారు. అందరూ చందాలు వేసుకుని మందిర నిర్మాణానికి ఎంతగానో
సహాయపడ్డారు. 1996 మే, 30 వ. .తారీకున సాంప్రదాయబధ్ధంగా
పూజా కార్యక్రమాలన్నిటినీ నిర్వహించి బాబా విగ్రహాన్ని ప్రతిష్టించారు.
దివాకర్
పండరే
(సర్వం
శ్రీ సాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment