Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Wednesday, June 27, 2012

సాయి.బా.ని.స. డైరీ - 1998 (15)

Posted by tyagaraju on 7:12 AM
                                             


                               
                                  
27.06.2012 బుధవారము 
ఓం సాయి శ్రీసాయి జయజయసాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీశ్శులు

సాయి.బా.ని.. డైరీ - 1998 (15)

16.09.1998

నిన్నరాత్రి శ్రీసాయి ఒక సన్యాసి రూపములో దర్శనముఇచ్చి అన్నమాటలు.

1) వెలుతురు లేని చోట మొక్కలను పెంచడానికి నీవు కరెంటు దీపాలు వెలిగించి మొక్కలను పెంచుతున్నావే,
అలాగే నీజీవితములోని చీకటిని తొలగించటానికి సద్గురువును నమ్ముకో
భగవంతుని శక్తి సద్గురువులో యున్నదిసద్గురువు భగవంతునికి ప్రతిరూపము అని గుర్తించు.

2) గురుశిష్యుల బంధము తండ్రి కొడుకుల బంధము తండ్రి కొడుకులు శారీరకముగా ఒక్కరేఅలాగే గురుశిష్యులు మానసికముగా ఒక్కరే. అలాగే గురు శిష్యులు మానసికముగా ఒక్కరే. గురు శిష్యులు శరీరాలు వేరు కాని వారిలోని ఆత్మలు మాత్రము ఒక్కటే.

3) నీ గురువు గురించి ఎవరైన చులకనగా మాట్లాడిన  నీకు కోపము రావడము సహజముకాని తర్వాతనీవు వారితో ప్రేమగా మాట్లాడి నీగురు తత్వము వారికి బోధించు.

18.09.1998

నిన్నరాత్రి శ్రీసాయి ఒక స్త్రీ రూపములో దర్శనం ఇచ్చి అన్నమాటలు.

1) కొందరు జీవితములో కంగారు జంతువులాగ తల్లి చాటున పెరిగి పెద్దవారు అగుతారుమరికొందరు పెంగ్విన్ పక్షులలాగ పుట్టుకతోనే తల్లిప్రక్కన తమ కాళ్ళపై నడుస్తు పెద్దవారు అగుతారుమరికొందరు తల్లి తాబేలు పిల్ల తాబేలులాగ ఒకరిని యింకొకరు చూసుకోపోయిన పెద్దవారు అగుతారుఎవరు ఏవిధముగా పెరిగి పెద్ద్దవారు అయిన తల్లిగర్భమునుండి బయటకు వచ్చి తల్లి ఆశీర్వచనాలతో పెరిగి పెద్దవారు కావలసినదే అని గ్రహించాలి.   
 
2) ఈజన్మలో నీవు నీపిల్లలను ప్రేమతో పెంచి పెద్దవారిని చేయకపోతే, వారు మరు జన్మలో మరల నీకు పిల్లలుగా పుట్టి నీనుండి ఋణానుబంధమును పూర్తిగా స్వీకరించుతారుఅందుచేత ఈజన్మలో నీపిల్లల పట్ల నీబాధ్యతను సరిగా నిర్వర్తించి మరు జన్మలో ప్రశాంత జీవితాన్ని అనుభవించు.

05.10.1998

నిన్నరాత్రి శ్రీసాయి ఒక అజ్ఞాత వ్యక్తి రూపములో దర్శనము ఇచ్చి అన్నమాటలు.

1) తల్లి తన పిల్లల కష్ఠ సుఖాలను ముందుగానే అర్ధము చేసుకొని వారి మంచి భవిష్యత్ కోసము వర్తమానములో తన ప్రయత్నాలు ప్రారింభించుతుందిఅలాగే   సమర్ధ సద్గురువు తన భక్తుల బంగారు భవష్యత్ కోసము వారికి ముందుగానే సలహాలు సూచనలు ఇచ్చి ఆదుకొంటారు

2) కొందరు తమ జీవితములో ముందుగా సుఖపడతారుజీవిత ఆఖరు దశలో కష్ఠ్డపడతారుమరికొందరు ముందుగా కష్ఠ్డపడతారు, తరువాత జీవితం  ఆఖరి దశలో సుఖపడతారునేను నాభక్తుల కష్ఠసుఖాలలో సాక్షి భూతుడినివారు కష్ఠ్డపడుతున్నపుడు వారు ష్ఠాలను అధిగమించడానికి వారికి శక్తిని ప్రసాదించే ఓమంచి మిత్రుడిని నేను. 

3) నీశత్రువు నిన్ను మానసికముగాను, శారీరకముగాను హింసించి యుండవచ్చునుహింసకు ప్రతిహింస సమాధానము కాదునీవు నీశత్రువునుండి దూరముగా యుండి వానిలో పశ్చాత్తాపము కలిగేలాగ చూడు

4) శ్రీసాయి సత్ చరిత్రను నిత్యము పారాయణ  చేస్తు నిస్వార్ధముగా ఆసత్  చరిత్రలోని  సాయి తత్వాన్ని యితరులకు బోధించి నీజీవితములో ఒక మంచి పని చేసిన అనుభూతిని పొందు.  




(యింకా ఉంది)
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)

Kindly Bookmark and Share it:

0 comments:

Post a Comment

 

Shirdi Sai Real Leelas

Bhjans Of Sai

Sai Prayer Club

My Blog List