08.12.2025 సోమవారమ్
ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి బందువులకు బాబావారి శుభాశీస్సులు
శ్రీ సాయిబాబా వారి పవిత్రమయిన ఊదీ - 2 వ భాగమ్
ఊదీ - వైద్యమ్
మరాఠీలో ప్రచురింపబడిన దానిని ఆంగ్లానువాదం షమ్షాద్ మీర్జా
తెలుగు అనువాదంః ఆత్రేయపురపు త్యాగరాజు
నిజాంపేట, హైదరాబాద్
ఫోన్. 9440375411 , 8143626744
యదార్ధ సంఘటనల ఆధారంగా జరిగిన ఆధ్యాత్మిక గాధ
సంవత్సరాలు గడిచిపోయాయి. బాబా మాకిచ్చిన ఊదీని సాధారణంగా మేమెప్పుడూ ఉపయోగించలేదు. మేము ఆ ఊదీని ఎంతో జాగ్రత్తగా భద్రపరచుకున్నాము.
1925 వ.సం.లో రచయిత యొక్క భార్య కాలం చేసింది. ఆమె అలమారంతా పూర్తిగా ఊదీతో నిండి ఉంది. ఆ ఊదీ నమ్మకానికి, వైద్యానికి, ప్రేమకి ప్రతిరూపంగా ఆయన భార్య ఇచ్చిన ఒక వీలునామా.
తరువాతి కాలంలో రచయిత షిరిడి సంస్థానానికి కోశాధికారిగా నియమింపబడ్డారు. నలు మూలలనుండి భక్తులు విరాళాలు పంపిస్తూ ఉండేవారు. బాబావారి మాటలను గుర్తు చేసుకుంటూ విరాళాలు పంపినవారందరికీ రశీదుతోపాటుగా బాబా తన స్వహస్తాలతో పంపుతున్న బహుమానమ్ (బాబా స్వయంగా పంపుతున్నది కాకపోయినా) అని మూడు చిటికెల ఊదీని పంపిద్దామనే నిర్ణయానికి వచ్చారు.
పూనానుంచి ఒక ఉత్తరం వచ్చింది. అందులో అసాధారణమయిన వాక్యాలున్నాయి. “మీ చేతుల ద్వారా ఈ ఊదీ జీవించు గాక”.
ఆ ఉత్తరంలోని వాక్యాలు చదవగానే రచయితకు కాస్త బాధ కలిగింది. ఆ వ్యక్తి కాస్త వ్యంగంగా రాసినట్టున్నాడు. కాని ఆయన ఆ ఉత్తరం వ్రాసినాయన మీద ఎటువంటి ద్వేషం పెట్టుకోలేదు. ఆ వ్యక్తి పూలయొక్క సువాసనను అర్ధం చేసుకోలేని అజ్ఞాని అని మనసులోనే నవ్వుకున్నాడు. ప్రేమ నిండిన హృదయంతో రచయిత ఊదీని పంపిస్తూనే ఉన్నాడు.
చివరికి ఊదీ అయిపోవచ్చింది. అందుచేత రచయిత ఇక ఈ సేవకు ముగింపు పలుకుదామని నిర్ణయించుకున్నారు. కాని అప్పుడే ఒక అధ్భుతమయిన సమయం ఆసన్నమయింది. కీర్తిశేషులయిన ధబోల్కర్ గారి కుమారుడు గొప్ప భక్తుడు. రెండు పెట్టెలనిండా ఊదీని పంపించారు. ఆ పెట్టెల మీద “శ్రీ సాయిబాబా వారి దివ్య హస్తాల మీదుగ ఇవ్వబడుతున్న ఊదీ” అని వ్రాసి ఉంది. రచయితకి చాలా ఆశ్చర్యం వేసింది. ఆ ఊదీ మరొక అయిదు సంవత్సరాల దాకా వస్తుంది. ఆ విధంగా జరగడమంటే బాబా భౌతికంగా లేకపోయినా ఇప్పటికీ తన కార్యాన్ని కొంసాగిస్తూనే ఉన్నారనే దానికి సాక్ష్యం.
శరీరానికి అతీతంగా---
శ్రీ సాయిబాబా తమ భౌతిక దేహాన్ని వీడిన తరువాత ధుని 24 గంటలపాటు మాత్రమే అణగారింది. అప్పటినుండి ఆధుని ఇప్పటికీ జ్వలిస్తూనే ఉంది. ఆ ధుని ఆ విధంగా ప్రజ్వరిల్లుతూ ఉండటం ఆయన ఇప్పటికీ అదృశ్యంగా శాశ్వతంగా ఉన్నరన్నదానికి గుర్తు.
సంస్థానం వారి ద్వారా నేటికీ ఊదీ వస్తున్నప్పటికీ దాని ప్రభావం ఏమాత్రం తగ్గలేదు. అది కేవలం బూడిద కాదు -- అది బాబాగారు సజీవంగా మనకు ప్రసాదిస్తున్న ఆశీర్వాదాలు.
వారసత్వపు అనుగ్రహమ్ ---
రచయిత హృదయపూర్వకంగా వినమ్రమయిన పదాలతో ముగిస్తున్నారు.
“ఎవరయితే బాబావారి అనుగ్రహాన్ని, ఆయన ఊదీ ద్వారా అనుభూతి చెంది ఉన్నారో, వారికి ఆ బంధం ఎప్పటికీ కొనసాగుతూనే ఉంటుంది.” అనిశ్చితమయిన ఈ ప్రపంచంలో వారు ఎటువంటి భయం లేకుండా ఎలా జీవించాలో నేర్చుకొంటారు. వారి హృదయాలలో బాబా వారి దివ్య చరణాలను ప్రతిష్టించుకొని ఉందురు గాక. బాబా తన బిడ్డలను ఎప్పటికీ వదలరు.”
బాబా ప్రేమను నమ్మకంతో పొందాలనుకునే వారందరికీ బాబా ఊదీ వ్యాధులను నయం చేస్తూ, రక్షిస్తూ, అనుగ్రహిస్తూ ఉండు గాక.”
ఆర్ . ఎ. తర్ఖడ్
ఎడిటర్ శ్రీ సాయిలీల
బాంద్రా 09.01.1932
(శ్రీ సాయిలీల పుష్యమాసం - మాఘ - శక సం.1853 సం.8 సంచికలు 11 - 12 లో ప్రచురుంపబడిన యదార్ధ సంఘటనలు)
(సమాప్తమ్)
(తరువాత సంచికలో సాయి భక్తి - అనుభవాలు, రెండు రోజులు ఆగాలి)
(సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు)








0 comments:
Post a Comment