Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Sunday, February 8, 2026

శ్రీ సాయిమహరాజ్ ప్రసాదించిన అధ్భుత అనుభవాలు… 5 వ.భాగమ్

Posted by tyagaraju on 7:23 PM


09.02.2026 సోమవారమ్,  షిరిడీ నుండి

ఓం సాయి శ్రీ సాయి జయయయ సాయి

సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

శ్రీ సాయిలీల ద్వైమాస పత్రిక నవంబరు, డిసెంబరు, 2025 సంచికలో ప్రచురింపబడిన బాబా లీలలు. (సెప్టెంబరు, అక్టోబరు, 2025 సంచికలో ప్రచురింపబడినవాటికి కొనసాగింపు)

శ్రీ సాయి మహరాజ్ ప్రసాదించిన అధ్బుత అనుభవాలు

శ్రీ సాయిబాబా వారి పవిత్రమయిన ఊదీ యదార్ధ సంఘటనల ఆధారంగా జరిగిన ఆధ్యాత్మిక గాధ.

శ్రీ సాయిమహరాజ్ ప్రసాదించిన అధ్భుత అనుభవాలు 5 .భాగమ్

మరాఠీ నుండి ఆంగ్లానువాదం..  షంషాద్ మీర్జా

తెలుగు అనువాదం .. ఆత్రేయపురపు త్యాగరాజు,

నిజాంపేట, హైదరాబాద్,

ఫోన్ --  9440375411 & 81436267

 మెయిల్.. tyagaraju.a@gmail.com

నమ్మకం వల్లనే ప్రసవవేదననుండి ఉపశమనం

నా స్నేహితుడు శ్రీ వామన్ భికాజీ ప్రధాన్ భార్యకు ఏడవనెల.  అకస్మాత్తుగా ఆమెకు పురుటి నొప్పులు ప్రారంభమయ్యాయి.  ఆ నెప్పులు చాలా భరింపరానిగా ఉండటంతో నా స్నేహితుడు ఆరోజు ఆఫీసుకు సెలవు పెట్టేశాడు.  ఆ మరుసటి రోజు మా ఇంటికి వచ్చి తన భార్య విషయం గురించి ఎంతో బాధ పడుతూ చెప్పాడు.

వాడి బాధను గమనించి నేను వాడికి శ్రీ సద్గురు సాయిబాబా వారి చిన్న ఊదీ పాకెట్ ఇచ్చాను  దీనికి మించిన ఔషధం లేదు, ఇంకెటువంటి ప్రయత్నాలు చేయనక్కరలేదని ధైర్యం చెప్పాను.

ఆ రోజు ఆఫీసునుండి సాయంత్రం ఇంటికి వెళ్ళాక తన భార్యకి నేనిచ్చిన ఊదీని ప్రసాదంగా ఇచ్చాడు.  ఆమె ఆ ఊదీని ఎంతో భక్తితో స్వీకరించింది.

అరగంటలోనే అధ్భుతం జరిగింది.  నొప్పులు పూర్తిగా తగ్గిపోయాయి.  నొప్పులు తగ్గిపోవడమే కాదు, అతని భార్యకి ప్రశాంతత లభించి తన శరీరంలోకి ఒక విధమయిన దైవికశక్తి ప్రవేశించినట్లయి మనస్థైర్యం కలిగింది.

ఆ మరుసటిరోజు వామన్ ఆఫీసుకు వచ్చినపుడు నా దగ్గరకు వచ్చి, “నువ్వు నాకిచ్చిన ఊదీలో ఏముంది?” అని అడిగాడు.  అతని స్వరంలో ఏదో తెలుసుకోవాలన్న ఆసక్తి ప్రస్ఫుటంగా కనపడింది.

నేను నవ్వుతూనే సమాధానమిచ్చాను…."అది శ్రీ సాయిబాబావారి ఊదీ తప్ప మరేమీ కాదు.”

అప్పటివరకూ వామన్  భికాజీ ఎప్పుడూ షిరిడీ వెళ్ళి ఉండలేదు.  బాబాని చూసిందీ లేదు.  కాని, ఈ అనుభవం అతనిలో ఎంతో మార్పు తీసుకువచ్చింది.

వెంటనే అతను తన కుటుంబాన్నంతటినీ బాబా దర్శనానికి షిరిడీకి తీసుకు వెళ్ళాడు.  ఆ రోజునుండి అతను తన జీవితాంతం సాయిభక్తునిగా మారి తన మనసునీ, సేవనూ శ్రీ సాయిబాబాకు అంకితం చేసుకున్నాడు.

నిశ్చయంగా చెప్పేది ఏమిటంటే,  సాయిలీల అనంతమ్

శ్రీ సాయిలీల సం.8 - సంచిక - 3

(ఊదీ లీలలు ఇంకా ఉన్నాయి)

(సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు)


Kindly Bookmark and Share it:

0 comments:

Post a Comment

 

Shirdi Sai Real Leelas

Bhjans Of Sai

Sai Prayer Club

My Blog List