27.05.2011 శుక్రవారము
ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి
మొదటిసారి షిరిడీయాత్ర : అనుభవాల మాలికఈ రోజు మనము మొదటి సారి షిరిడీ సాయినాథుని దర్శనం చేసుకున్న సాయి భక్తులు, విశాఖపట్నము వాస్తవ్యులు శ్రీ నౌడురు రామకృష్ణమూర్తిగారి అనుభవాలను తెలుసుకుందాము. వారి అనుభవాన్ని వారు చెప్పిన మాటలలోనే. శ్రీ నౌడూరు రామకృష్ణగారు మా తోడల్లుడుగారు కూడాను. శ్రీ రామ కృష్ణగారు వారు వారి అబ్బాయి పనిమీద ముంబాయి వెళ్ళి అక్కడినించి షిరిడీ వెళ్ళడం జరిగింది. యిక అక్కడ షిరిడీలో అనుభవాల పరంపరని తెలుసుకుందాము.
మేము ముంబాయినించి ఈ సంవత్సరం మే నెల 11 తారీకున బుథవారము బయలుదేరి
గురువారమునాడు ఉదయం 5.30 కి షిరిడీ చేరుకున్నాము.
ఉదయం 7.30 కి సాయి దర్శనం అయింది చాలా సెపు అక్కడె వున్నాను ఒక దండ కొసం
బాబాను చూస్తూ వెనక్కి నడుస్తున్నా వెంటనె ఒక ఆయన దండ తెచ్చి నాకు
ఇచ్చారు . నేను చాలా సంతోషించాను. .30 నిమిషాలు అక్కడే వున్నాను. 8.30 కి బయటకి వచ్చాను. తరువాత 10.30 కి దర్శనం కోసం వెళ్ళాను అక్కడ ఒక చిన్న కుఱ్ఱవాడు వచ్చి చిన్న వస్త్రం, కొబ్బరికాయ, అరటిపళ్ళు ఇచ్చి బాబా వారికి యివ్వమన్నాడు. నేను వాటిని ఇచ్చి ఆ వస్త్రం ఇవ్వమని అడిగాను. కాని పూజారి గారు ఇవ్వలేదు. కాని తరువాత పూజారిగారె సెక్యూరిటీగార్డ్ ద్వారా వెళ్ళిపోతున్న నాకు ఇప్పించారు. నాకు చాలా అనందం వేసింది.
12.30 హారతికి అక్కడే హారతి పాడాను. నా జేబులో హారతి పుస్తకం వుంది.
తరువాత 5.30 కి దర్శనం అయింది బాబావారి దర్శనం రెండు సార్లు చేసుకున్నాను. మూడవసారి కూడా దర్శనానికి వెళ్ళాను. అక్కడ సమాథి మీద ఒక పువ్వుల పువ్వుల వస్త్రం పెద్దది ఒకటి ఉంది. నా మనసులో ఆ వస్త్రం కావాలనుకున్నాను. కాసేపు అయిన తరువాత ఒకావిడ వచ్చి సమాథికి మళ్ళీ దణ్ణం పెట్టు అన్నారు. నేను దణ్ణం పెట్టుకున్నాక పూజారిగారు దణ్ణం పెట్టుకోవడం అయింది కదా, యింకా యేమి కావాలి అన్నారు. నాకు ఆ వస్త్రం కావాలి అని బయటకే అనేశాను. మొదట ఇవ్వను అన్నారు. కాని సమాథి మీద ఉన్న ఒక మీటరు పొడవు ఉన్న చిన్న వస్త్రం ఇచ్చారు. నాకు చాలా అనందం వేసింది.
రాత్రి 9.30 కి మరలా దర్శనం అయింది ఒకే రోజు 4 దర్శనాలు అయ్యాయి ద్వారాకమాయి చావడి ధుని వేపచెట్టు దర్శానాలు అయ్యాయి . శుక్రవారం ఉదయం 7.30 కి వెళ్ళాను. ఒక పెద్ద వస్త్రం సమాథి మీదవుంది అది నాకు కావాలని వుంది నాకు మనసులో . మరలా వస్త్రం లభించింది. అలా మూడు వస్త్రాలు బాబా దయ వలన నాకు లభించాయి. నా ఆనందం చెప్పనలవి కాదు. ఒకటిన్నర రోజులో నాకు ఎనిమిది దర్శనాలు అయ్యాయి.
బాబా వారి దర్శనం అయ్యాక బయట అందరకూ లైనులో ఊదీ ఇస్తున్నారు. ఒకరికి ఒక ఊదీ పాకెట్ మాత్రమే ఇస్తున్నారు. నాకూ ఒకటి ఇచ్చారు. నేను మరొకటి కావాలని అడిగాను. వెంటనే నాకు మరొకటి ఇచ్చారు. నా వెనకున్న ఆయన కూడా తనకీ మరొకటి కావాలని అడిగాడు. ఊదీ ఇచ్చే అతను రెండు ఇవ్వరు అన్నాడు. ఆయన నన్ను ఉద్దేశించి, నా ముందున్న ఆయనకు ఇచ్చారుగా అన్నాడు. అప్పుడు ఊదీ ఇచ్చే అతను ఆయన అదృష్టం అది అన్నాడు. అలా బాబా వారు నాకు మరొక ఊదీ ని కూడా ప్రసాదంగా ఇచ్చినందుకు నాకు చాలా ఆశ్చర్యం వేసింది.
మరునాడు శుక్రవారము నాడు ఉదయం పల్లకీ సేవ జరుగుతోంది. బాబా ని పల్లకీలో ఊరేగిస్తున్నారు. నేను యెదురుగా నించుని నేను కూడా పల్లకి మోస్తానని సంజ్ణ చేశాను. పల్లకీ మోసే ఒకాయన నన్ను పిలిచి దా తీసుకో అని పల్లకీని మోసే అవకాశాన్నిచ్చారు. కాసేపు పల్లకీ మోసే భాగ్యం కూడా కలిగింది నాకు.
నేను నాసిక్ వెడదామని శుక్రవారం రాత్రి అనుకున్నాను. అక్కడ వసతి గురించి ఒక అలోచనవచ్చింది ఎలాగా అనుకున్నా లాకర్ లో సామాను ఉంచి బయలుదేరుదాం అనుకున్నా గది ఖాళీచేసాము కూడా. వెంటనే ఈరాత్రి ఇక్కడే వుండు అని బాబా సందేశం నాకు ఇచ్చినట్లు గా వచ్చింది. అక్కడ రాత్రి ఇబ్బంది పడతారు అని. ఆగిపోయాము. మరొకసారి రాత్రి బాబాదర్శనం అయింది. శనివారం ఉదయం మరొక దర్సనం అయింది. శనివారం ఉదయ నాసిక్ 10.30. కి వెళ్ళి పంచవటి ముక్తిధాం గోదావరి స్నానం త్రయంబకేశ్వర దర్శనం అయ్యాయి. ఘ్రుణేశ్వరం లో నేను ఈశ్వరుని కి పాలతో అభిషేకం చేశాను.
9 గురువారముల వ్రత మహాత్మ్యం శ్రీ రామ కృష్ణగారి థర్మ పత్ని శ్రీమతి శారద గారు కూడా గొప్ప బాబా భక్తురాలు. ఆవిడ ఒక కోరిక కోసం 9 గురువారములూ వ్రతం చేసి, అది తీరితే మరొకసారి వ్రతం చేస్తానని అనుకున్నారు. కోరిక తీరిన తరువాత మరలా, 9 గురువారముల వ్రతము ప్రారంభించి నిన్నటికి, అనగా 26.05.2011 కి 9 గురువారములు నిర్విఘ్నంగా పూర్తి అయ్యాయి. బాబా కి నైవేద్యం పెట్టడానికి యింటిలో పులిహోర కలుపుతున్నారు. యింతలో ఒక ముసలాయన వచ్చి డబ్బులివ్వు అనగా, యెవరో వచ్చారని చూద్దామని శారద గారు బయటకు వచ్చారు. అప్పుడా ముసలాయన ఈమెతో, " ఊఊ డబ్బులివ్వూ, రెండు రూపాయలు, రెండు రూపాయలు అంటూ చేతివేళ్ళు రెండు చూపిస్తూ డబ్బులివ్వమని అన్నారు. ఈమె లోపలకు వెళ్ళి పరసులో చూడగా సరిగా రెండు రూపాయల నాణెం ఉందిట. ఆ రెండు రూపాయలను ఆ వచ్చిన ఆయనకి ఇచ్చి, కొంచెం ప్రసాదం ఇద్దామనే ఉద్దేశ్యంతో ఉండు అని లోపలకి వెళ్ళారు. ఆయనకి కాని బయటకి వచ్చి చూసేటప్పటికి ఆ ముసలతను కనపడలేదు. ఆ మనిషిని యింతకుముందుకూడా చూడలేదుట. అలా వ్రతం పూర్తవగానే బాబావారు దక్షిణ కూడా అడిగి మరీ తీసుకున్నారు.
మనలో శ్రథ్థ భక్తి విశ్వాసం ఉంటే బాబా తప్పకుండా వచ్చి తీరతారని ఆ అనుభవం ద్వారా మనకి తెలుస్తోంది.
సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు
0 comments:
Post a Comment