Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Saturday, November 30, 2019

శ్రీ సాయి సత్ చరిత్రకు అందని రహస్యాలు – 7 వ.భాగమ్

0 comments Posted by tyagaraju on 10:03 PM
  Image result for images of shirdisaibaba old photos
                    Image result for images of rose garden

01.12.2019  ఆదివారమ్
ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
శ్రీ సాయి సత్ చరిత్రకు అందని రహస్యాలు – 7 .భాగమ్

శ్రీ సాయి సత్ చరిత్ర 7 అధ్యాయములో శ్రీసాయికి సన్మానములు అన్నచో అయిష్టములు అని స్పష్టముగా చెప్పబడినది.  కాని ఈనాడు అనేకమంది సాయితత్త్వప్రచారకులు సాయి పేరిట పీఠాధిపతులుతమ జీవితాలలో అనేకసార్లు సాయిభక్తులతో సన్మానము చేయించుకొని తమ కీర్తి కండూతిని తీర్చుకొనుచున్నారు.  ఈ విషయమై నేను సాయిబానిసగారిని అడిగినపుడు ఆయన ఇచ్చిన సమాధానము.

Friday, November 29, 2019

కళ్ళు తెరచి చూసిన బాబా

2 comments Posted by tyagaraju on 10:12 PM
     Image result for images of shirdi sai baba
        Image result for images of rose hd

30.11.2019  శనివారమ్
ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

ఈ రోజు భువనేశ్వర్ నుండి శ్రీమతి మాధవి గారు పంపించిన మరొక లీలను ప్రచురిస్తున్నాను

కళ్ళు తెరచి చూసిన బాబా

" ఓం సాయి రాం" సాయి బంధువులు అందరికి.  ఇప్పుడు నేను రాయబోయే లీల నా జీవితం లొనే జరిగింది.  బాబా నాకు ఇచ్చిన అద్భుతమైన అనుభవం.  నవగురువార వ్రతం చేసేరోజుల్లో జరిగింది.  ఆ రోజుల్లో  తెలీకుండానే నాకు సంబల్పూర్ కి  బదిలీ అయింది.  నన్ను ఆఫీస్ నుంచి రిలీవ్ కూడా చేసారు.  ఏమి కారణం లేదు. నాకు చాలా బాధ వేసింది. అప్పుడే మా వారు సిల్చేర్ అనే ఊరు నుంచి భువనేశ్వర్ కి బదిలీయి వచ్చారు. మేము ఇద్దరమూ నాలుగు సంవత్సరాలు వేరుగా ఉన్నాము. మళ్ళీ వెంటనే నన్ను వేరే ఊరికి బదిలీ చేశారు.  ప్రభుత్వ ఉద్యోగం చేసేవాళ్లకు ఈ కష్టాలు తప్పవు.  ఇంక తప్పదు అని నేను సంబల్పూర్ వెళ్లి జాయిన్ అయ్యాను. ఒక గురువారం రోజు నవగురువార వ్రతం చేస్తున్నాను. మనసంతా బాధగా ఉంది." బాబాతో మనసులో అంటున్నాను  బాబా.."నువ్వు నన్ను చూడు,నేను నిన్ను చూస్తాను" అనే నీ మాట నిజం కాదు. ఎందుకు భక్తులకు ఈ వాగ్దానాలు చేస్తావు? ఏమన్నా అంటే,నీ కర్మఫలం అంటావు, ఎందుకు బాబా? అని ఏదో,ఏదో..మనసులో అనుకుంటున్నాను.  ఇంకో పక్కన బాబా పూజ కూడా చేస్తున్నాను.  ఇంతలో విచిత్రం గా నేను పూజ చేసి బాబా విగ్రహం లో బాబా కళ్ళు తెరిచారు.  ఆ ఫోటో కింద జత చేస్తున్నాను. 

అసలు నా శరీరం గగుర్పొడిచింది. నన్ను నమ్మండి.  బాబా నిజంగానే మనల్ని చూస్తున్నాడు.  మన బాధలు వింటున్నారు.  సమయం వచ్చినప్పుడు సమాధానం ఇస్తారు. బాబా చెప్పిన ఏ ఒక్కమాట పొల్లు పోదు. జరిగితీరుతుంది. కావలసినది శ్రద్ధ,సబూరి.  మనము.. ఇవ్వవలసినది ఆయన అడిగిన దక్షిణ మనము. బాబా తన మాటకు కట్టుబడి వున్నడని నాకు అప్పుడు అర్థం అయింది.
" సర్వం సాయి నాధార్పణమస్తు"
(సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు)


Wednesday, November 27, 2019

శ్రీ సాయి సత్ చరిత్రకు అందని రహస్యాలు – 6 వ.భాగమ్

0 comments Posted by tyagaraju on 11:10 PM
        Image result for images of shirdisaibaba old photos
                          Image result for images of rose flower old
28.11.2019  ఆదివారమ్
ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
శ్రీ సాయి సత్ చరిత్రకు అందని రహస్యాలు – 6 .భాగమ్

శ్రీ సాయిబానిసగారు నిజజీవితంలో 1993 లో షిరిడీ యాత్ర చేసారు.  షిరిడీలో చావడిలో శ్రీశివనేశన్ స్వామీజీ గారిని దర్శించుకొన్నారు
         Image result for images of sivanesan svamiji
ఆయన చావడిలో భజన చేస్తున్న సమయంలో ఆయన శిష్యురాలు ఒక నల్ల జాతి స్త్రీపేరు క్రిస్టియాన సాయిబానిసగారితో మాట్లాడుతు తనకు ఆకలిగా ఉన్నది అని తనకు ప్రక్కనేఉన్న హోటల్ లో పూరీకూర కొనిపెట్టమని కోరింది.  

నేనే నీ చెంతకు వస్తాను

0 comments Posted by tyagaraju on 7:35 AM
      Image result for images of shirdi wale sai baba      
 Image result for images of  pink rose hd

27.11.2019  బుధవారమ్
ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయిబంధువులకు బాబావారి శుభాశీస్సులు
ఈ రోజు భువనేశ్వర్ నుండి శ్రీమతి మాధవి గారు పంపించిన మరొక అధ్భుతమయిన బాబా చమత్కారాన్ని తెలుసుకుందాము.  మనసులో  బాబాను చూడాలి, చూడాలి అనే తపన ఉండాలే గాని బాబా స్పందించకుండా ఉండగలరా?  ఆయన ఏదో విధంగా, మనం ఊహించని రీతిలో దర్శనమిస్తారనే విషయం ఇప్పుడు మీరు చదవబోతున్న లీల ద్వారా గ్రహించగలరు.

 

Shirdi Sai Real Leelas

Bhjans Of Sai

Sai Prayer Club

My Blog List