09.11.2014 ఆదివారము
ఓం సాయి శ్రీసాయి జయజయసాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
గృహస్థులకు సాయి సందేశాలు - 4వ.భాగం
ఆంగ్ల మూలం : సాయి బా ని స శ్రీరావాడ గోపాలరావు
తెలుగు అనువాదం : ఆత్రేయపురపు త్యాగరాజు - 9440375411
హైదరాబాద్
ఈ రోజు సాయి బా ని స శ్రీరావాడ గోపాలరావు గారు చెబుతున్న గృహస్థులకు సాయి సందేశాలను వినండి.
ముందుగా సాయిప్రేరణ 2వ.వాక్యం
ఒక్కసారి నాకొరకు ఒక్క పైసా ఖర్చుపెట్టి చూడు, నీ ఇంట్లో లక్ష్మీదేవి కొలువుండేలా చేస్తాను.
శ్రీసాయి సత్ చరిత్రలో భర్తయొక్క బాధ్యతలు కూడా వివరింపబడ్డాయి. ముఖ్యంగా భర్త భార్యపై అధికంగా వ్యామోహాన్ని పెంచుకోరాదు. ఈవిషయం మనకు శ్రీసాయి సత్ చరిత్ర 27వ.అధ్యాయంలో కనపడుతుంది. ఖాపర్దే బార్ ఎట్ లా. అమరావతిలో ప్రముఖ లాయరు, మరియు ఢిల్లీ బార్ కౌన్సిల్ మెంబరు, మంచి వక్త, ధనవంతుడు. కాని అతనికి భార్యా వ్యామోహం ఎక్కువ.



