Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Saturday, March 5, 2016

శ్రీ సాయి లీలామృత ధార ముక్కు పుడక

0 comments Posted by tyagaraju on 6:05 AM
        Image result for images of sri sainadha
    Image result for images of white rose hd

05.03.2016 శనివారమ్
ఓమ్ సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
కొన్ని సంవత్సరాల క్రితం సాయిలీలా మాసపత్రిక పాత సంచికలలోనుండి కొన్ని బాబా లీలలను ప్రచురించాను.  తరవాత కొన్నాళ్ళకు అంతర్జాలంలో నాకు దొరకలేదు.  అనుకోకుండా నిన్న దొరికాయి.  సాయిబానిస గారి శ్రీసాయి పుష్పగిరిని కూడా కొన సాగిస్తూ, మధ్య మధ్యలో ఈ లీలలను కూడా ప్రచురిస్తూ ఉంటాను.  ఇంకా ఖపర్డే గారి డైరీలోని కొన్ని విశేషాలను కూడా ప్రచురింపవలసి ఉంది.  వాటిని కూడా వీలు వెంబడి ప్రచురిస్తూ ఉంటాను. ఈ రోజునుండి ప్రచురింపబోయే ఈ లీలలకు శ్రీ సాయి లీలామృత ధార అని నామకరణం చేసి, వీటిలో సాయిలీల మాసపత్రికలో ప్రచురించినవాటిని మీ కందిస్తాను.
ఓమ్ సాయిరామ్.
శ్రీసాయి లీలా మాసపత్రిక మే 1975 సంచికనుండి గ్రహింపబడినది.

శ్రీ సాయి లీలామృత ధార
ముక్కు పుడక
బాబా తన భక్తులను పిచ్చుక కాలికి దారం కట్టి లాగినట్లుగా తన వద్దకు లాగుకొంటారు.  బాబా భక్తులు కానివారెవ్వరూ ఆయన వద్దకు చేరలేరు.  బాబా దృష్టిలో ఎవరయితే పడతారో అపుడే ఆయన అనుగ్రహం వారి మీద ప్రసరిస్తుంది. 
పురందరదాసు దక్షిణభారత దేశంలో ప్రప్రధమ సంగీత విధాంసులు, వాగ్గేయకారుడు కర్ణాటక సంగీత పితామహుడిగా స్థానం సంపాదించుకుంటే త్యాగరాజు కర్ణాటక సంగీతంలో త్యాగ బ్రహ్మగా పేరుగాంచాడు.
                   Image result for images of purandaradasa
                     Image result for images of jasmine flower

పురందరదాసు అసలు పేరు శ్రీనివాస నాయకర్.  ఇతను బంగారం, వజ్రాల వ్యాపారంలో ఎంతో ధనం సంపాదించిన కోటీశ్వరుడు.  కాని పరమ పిసినారిగా కూడా పేరు గడించాడు.  తన జీవితాన్ని వ్యాపారానికే అంకితం చేసి కనీసం ఒక్క క్షణమయినా భగవంతుని తలచేవాడు కాదు.  

Thursday, March 3, 2016

శ్రీ సాయి పుష్పగిరి – ఆధ్యాత్మికం (1 వ.భాగం)

0 comments Posted by tyagaraju on 6:57 AM
                                                 











Image result for images of yellow roses

03.03.2016 గురువారమ్
ఓమ్ సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
ఈ రోజు నుండి సాయిబానిస గారి డైరీల నుండి నేను సేకరించిన సాయి సందేశాలను ప్రచురిస్తున్నాను. ఈ సందేశాలన్నీ ఆధ్యాత్మికతకు సంబంధించినవి.  విచిత్రమేమిటంటే 1999 వ.సంవత్సరములోనే బాబా గారు ఆయనకి తను ఇచ్చిన సందేశాలను ఇంటర్ నెట్ ద్వారా సాయిభక్తులకు పంచి పెట్టమని ఆదేశించారు.  5 వ. సంఖ్య సందేశాన్ని గమనించండి.

Tuesday, March 1, 2016

శ్రీ షిరిడీసాయి వైభవమ్ – నన్ను నమ్ముకున్నవారిని నవ్వులపాలు కానివ్వను

0 comments Posted by tyagaraju on 7:51 AM
   Image result for images of shirdi saibaba talking
  Image result for images of beautiful roses

01.03.2016 మంగళవారమ్
ఓమ్ సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

సర్వాంతర్యామి మన సద్గురు సాయిబాబా.  ఆయనకు తన భక్తులే కాదు అశేష ప్రజానీకం ఏమి చేస్తున్నారో అన్నీ గ్రహించగలరు.  తన భక్తుల మనసులో ఏముందో అనుకున్న క్షణంలోనే వారికి తెలిసిపోతుంది.  కారణం మనందరి హృదాయలను పాలించేది ఆయనే కదా.  ఈ రోజు “ది గ్లోరీ ఆఫ్ షిరిడీ సాయిబాబా” మార్చ్, 2016 వ సంచికలోని ఈ లీల చూడండి.

శ్రీ షిరిడీసాయి వైభవమ్ – 
నన్ను నమ్ముకున్నవారిని నవ్వులపాలు కానివ్వను
Image result for images of moreshwar pradhan
మోరేశ్వర్ ప్రధాన్, ఆయన భార్య ఛోటాబాయి ఇద్దరూ బాబా భక్తులు.  నిజం చెప్పలంటే వారి కుటుంబమంతా బాబాని పూజిస్తూ ఆయననే తమ సద్గురువుగా భావిస్తూ ఉండేవారు.  ఒకసారి వారి పెద్ద కుమారుడికి టైఫాయిడ్ జ్వరం వచ్చింది.  జ్వరం తీవ్రంగా పెరిగిపోతూండటంతో అతని శరీరం పాలిపోయి బలహీనపడిపోయాడు.  అతని స్థితిని చూసి, పినతల్లి పిల్లవానికి జ్వరం తగ్గితే షిరిడీకి వచ్చి బాబా దర్శనం చేసుకుంటామని మొక్కుకుంది.  

Monday, February 29, 2016

సాయి లీల - రాబోయే ఆపదను నివారించిన బాబా

0 comments Posted by tyagaraju on 7:18 AM
      Image result for images of shirdi sai baba
     Image result for images of rose hd
సాయి లీల - రాబోయే ఆపదను నివారించిన బాబా 
29.02.2016 సోమవారమ్
ఓమ్ సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
ఈ రోజు సాయి లీల పత్రిక నవంబరు – డిసెంబరు 2003 సంవత్సరమ్ సంచికలోని మరొక సాయి లీల.

శ్రీ ఎల్.డీ. సోమరాజు, 233, ఆస్టిన్, బెంగళూరు వారికి బాబా తనకు తానుగా ప్రకటితమగుట.

నేను ఆర్మీలో పనిచేసి పదవీ విరమణ చేశాను.  1940వ.సంవత్సరంనుండీ  నేను బాబాని పూజిస్తూ ఉన్నాను.  నాకు పదిమంది సంతానం. వారిలో ముగ్గురు కవలలు.  వారంతా క్షేమంగా ఆనందంగా ఉన్నారు.

 

Shirdi Sai Real Leelas

Bhjans Of Sai

Sai Prayer Club

My Blog List