Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com
Showing posts with label -. Show all posts
Showing posts with label -. Show all posts

Tuesday, March 20, 2018

శ్రీస్వామీజీ భక్తులతో జరిపిన అనుగ్రహ భాషణమ్ - 13 వ.భాగమ్

0 comments Posted by tyagaraju on 8:50 AM

       Image result for images of shirdi sai baba hd

                   Image result for images of rose hd

20.03.2018  మంగళవారమ్
ఓమ్ సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
శ్రీస్వామీజీ భక్తులతో జరిపిన అనుగ్రహ భాషణమ్ - 13 వ.భాగమ్ 
తెలుగు అనువాదమ్ : ఆత్రేయపురపు త్యాగరాజు

10.11.1971  ఈ రోజు ఒక భక్తుడు స్వామీజీ తో  “స్వామీజీ, ఈ రోజు నాకు 55 సంవత్సరాలు వచ్చాయి.  ఈ సందర్భంగా నేను 55 సార్లు విష్ణుసహస్రనామ పారాయణ చేద్దామనుకుంటున్నాను” అన్నాడు.
                   Image result for images of vishnu bhagwan

దానికి సమాధానంగా స్వామీజీ “విష్ణుసహస్రనామ పారాయణ ఇన్ని సార్లు చేయాలి అనే నియమం ఏమీ లేదు.  వాస్తవంగ చెప్పాలంటే భక్తి భావం కలగగానే ఎన్నిమార్లు పారాయణ చేసాడో చేసినవానికే తెలియదు.  ఇపుడు నీకు 55 సంవత్సరాలు వచ్చాయని చెబుతున్నావు.  55 సం.ఎవరికి వచ్చాయి?  శరీరానికా లేక ఆత్మకా?  వయస్సు వచ్చింది శరీరానికే.  మనలో ఉన్న ఆత్మకి వయస్సనేది రాదు.  ఆ దృష్టితో చూస్తే ఎవరయినా తమకు వయస్సు గుర్తుకు వచ్చి పుట్టినరోజును జరుపుకుందామనే ఆలోచన వచ్చిందంటే అటువంటి ఆలోచన ఎందుకూ పనికిరానిది.  మనము భౌతికంగా అటువంటి ఆలోచనా పరిధులను దాటి భగవంతుని యొక్క తత్త్వములోకి ప్రవేశించాలి.  పెద్దవారు పుట్టినరోజులు జరుపుకోవడం నాకు మాత్రం యిష్టం లేదు.  పిల్లలు మాత్రమే జరుపుకోవాలి. 
 

Shirdi Sai Real Leelas

Bhjans Of Sai

Sai Prayer Club

My Blog List

  • - 22.06.2026 సోమవారమ్ ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ సాయి సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు శ్రీ సాయి లీల ద్వైమాస పత్రిక మార్చ్, ఏప్రిల్, 2026, సంచికలో ప్ర...
    3 months ago