02.04.2026
గురువారమ్
ఓం సాయి
శ్రీ సాయి జయయయ సాయి
సాయి
బంధువులకు బాబావారి శుభాశీస్సులు
తెలుగు
నూతన సంవత్సర శుభా కాంక్షలు
శ్రీ
సాయిలీల ద్వైమాస పత్రిక జనవరి, ఫిబ్రవరి, 2026 సంచికలో ప్రచురింపబడిన బాబా లీలలు.
(నవంబరు, డిసెంబరు, 2025 సంచికలో ప్రచురింపబడినవాటికి కొనసాగింపు)
శ్రీ
సాయి మహరాజ్ ప్రసాదించిన అధ్బుత అనుభవాలు
శ్రీ
సాయిబాబా వారి పవిత్రమయిన ఊదీ యదార్ధ సంఘటనల ఆధారంగా జరిగిన ఆధ్యాత్మిక గాధ.
శ్రీ
సాయిమహరాజ్ ప్రసాదించిన అధ్భుత అనుభవాలు… 10 వ.భాగమ్
మరాఠీ
నుండి ఆంగ్లానువాదం.. షంషాద్ మీర్జా
తెలుగు
అనువాదం .. ఆత్రేయపురపు త్యాగరాజు,
నిజాంపేట,
హైదరాబాద్,
ఫోన్
-- 9440375411 & 81436267
ఈ మెయిల్..
tyagaraju.a@gmail.com
శ్రీ
సాయిబాబా వారి పవిత్రమయిన ఊదీ – మాహాత్మ్యమ్
భావూ సాహెబ్ సన్నిహితులకి, బాబా భక్తులకి ఒక విషయం
బాగా అర్ధమయింది. అదేమిటంటే వ్యాధి నయమయిందంటే
దానికి కారణం గురువు మీద ఉన్న ప్రగాఢమయిన భక్తి ఒక్కటే వ్యాధిని నయం చేయడం కాదు, గురువుయొక్క
అనుగ్రహం వారికి రక్షణగా ఉంటూ అనుకోని ఆపదలనుండి కాపాడుతూ ఉంటుందని.




