Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Tuesday, May 12, 2020

మేరే సాయి

0 comments Posted by tyagaraju on 7:01 AM
       Sai Amrut Shirdi Sai Baba Wall Poster/Wall Paper/Wall Sticker ...
            Yellow Rose Flower Wallpapers - Wallpaper Cave

12.05.2020  మంగళవారమ్
ఓమ్ సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

మేరే సాయి (సీరియల్ 1 వ.భాగమ్)

ఈ రోజు మేరే సాయి హిందీ సీరియల్ మొదటి భాగాన్ని బ్లాగులో ఉంచుతున్నాను.  వీక్షించండి.   బాబాకు బాయిజా మాయికి ఉన్న్ తల్లికొడుకుల అనురాగం తెలియచేయడానికి మాత్రమే ఈ వీడియో మీకోసం...




సందేహాలు - సమాధానాలు 8 (3) కు సాయిభక్తుల స్పందన
శ్రీ యఱ్ఱాప్రగడ ప్రసాద్,  రాజమహేంద్రవరమ్

అందరూ భోజనం చేసినదానికి ఒక భక్తురాలి ప్రశ్నకు నాకు తోచిన చిన్న  భావం.


అసలు నీకు ఆకలి ఎవరు ఇచ్చారు? అసలు ఆకలికి వండుకుని తినమని సరుకు ఎవరిచ్చారు? నాలుకకి రుచి ఎవరు ఇచ్చారు?  పదార్దానికి మాధుర్యాన్ని ఎవరు ఇచ్చారు..అసలు ఆయన ఇచ్చింది ఆయనకు పెట్టకుండా తింటామా? బాబా  నువ్విచ్చిందే నీకు నివేదిస్తున్న అభాగ్యుడిని..అందుకని నీవు మిగిల్చినదే నాకు పరమాన్నం, నాకు బిక్ష అనకుండా తింటామా? లేదు అలానే అనుకుంటున్నాము.... అంటారా ఆయనకు నివేదించిందే మనము తింటున్నాము. ఆయన మనకు ప్రసాదముగా ఇచ్చింది పోను... ఆయనకు పరోక్షంగా పెట్టిందే  మన ప్రసాదంగా అయినా పిమ్మట ఆయనకు  ప్రత్యక్షంగా పెడుతున్నాము..*ఇవన్నీ భావనలో తెలుస్తాయి తప్ప అక్షరాలలో తెలియవు*  *ఇవి వింటే తెలియవు.*  *పైన లా తింటే తెలుస్తుంది*

అది అంతే.     *చెబితే తెలియదు*    "అనుభవించాలి అంతే*



యర్రాప్రగడ ప్రసాద్, రాజమండ్రి




ముందు ఆయనకు సమర్పణం చేస్తున్నాం  తరువాత దానిని మనము ప్రసాదంగా స్వీకరిస్తున్నాం  ఆ తరువాత యోగులకు పెడుతున్నాము..  అంటే మొదట బాబాకి చేరిపోయింది.  అక్కడ నుండి మనకు...ఆ తరువాత మళ్ళీ యోగుల రూపంలో ఆయనకు.. లోతుగా ఆలోచిస్తే 3 రూపాల్లో నూ ఆయనే తింటున్నాడు.

ఇంకా లోతు విశ్లేషిస్తే...   *యోగులకు నువ్వు పెట్టె అవకాశం వచ్చింది* అంటే
నువ్వు బాబా దృష్టిలో *యోగ్యుడివి* అయినట్టేగా




యర్రాప్రగడ ప్రసాద్, రాజమండ్రి

                            మేరే సాయి




(సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు)

Sunday, May 10, 2020

భక్త శబరి…???భక్తి పరీక్షా??? (మరొకసారి)

1 comments Posted by tyagaraju on 7:00 AM
      🌸💚🌸SAIBABA SAYS.🌸💚🌸 👉👉👉I - Want - Peace I is Ego, Want is ...
            ✅[105+] Roses Beautiful HD Photos (1080p) (750x1000) (2020)

10.05.2020  ఆదివారమ్
ఓమ్ సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
నిన్నటితో బాబాగారి అయిందిండ్ల భిక్ష గురించిన వివరణ పూర్తయింది. నిన్న ప్రచురించినదానికి రాజమహేంద్రవరం నుంచి శ్రీ యెఱ్ఱాప్రగడ ప్రసాద్ గారు చాలా అధ్భుతమయిన వివరణ పంపించారు.  దానిని కూడా రేపు ప్రచురిస్తాను.

 కొంతమందికి కొన్ని సందేహాలు కలిగాయి.  మనం భుజించిన తరవాత భిక్ష వేస్తే అది మన ఎంగిలి పెట్టినట్టవుతుంది కదా అని.  కాని మన బాబా విషయంలో అధ్బుతాలు జరుగుతాయి.  2016 లో చెన్నైలో శ్రీమతి కృష్ణవేణి గారికి బాబా చూపించిన లీలను ఈ సందర్భంగా మరలా ప్రచురిస్తున్నాను.  చాలా అధ్బుతమయిన లీల.
'మేరే సాయి" మొదటిభాగం రేపు పోస్ట్ చేస్తాను.  

18.03,2016 శుక్రవారం 
ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి
 సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు 

భక్త శబరి???భక్తి పరీక్షా???

చెన్నై నుండి శ్రీమతి కృష్ణవేణిగారు 15తీరీకున ఒక అనుభవాన్ని ఈ మెయిల్ ద్వారా పంపించారు.  చాలా అద్భుతమైన అనుభవంఇంకా విచిత్రమేమంటే  రోజు ప్రచురిస్తున్న  అధ్బుతమైన లీలకు బాబా వారు మరికొంత సమాచారం కూడా ఇమ్మని నాకు సూచించారు.  అది ఏవిధంగా ఇచ్చారన్న విషయాన్ని  లీల పూర్తయిన తరువాత వివరంగా ఇస్తున్నాను.***  అది కూడా చదవండి లీల ప్రచురించడానికి కూడా బాబావారి అనుగ్రహం ఏ విధంగా ఇచ్చారో మనం గ్రహించుకోవచ్చు.

 

Shirdi Sai Real Leelas

Bhjans Of Sai

Sai Prayer Club

My Blog List