Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Thursday, January 7, 2021

సాయిబాబా – పరిశోధనా వ్యాస గ్రంధము – 26 వ.భాగమ్

0 comments Posted by tyagaraju on 7:49 AM

 




07.01.2020  గురువారమ్

ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ సాయి

సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

సాయిబాబా – పరిశోధనా వ్యాస గ్రంధము – 26 .భాగమ్

(రచయిత… శ్రీ ఆంటోనియో రిగోపౌలస్ – ఇటలీ)

తెలుగు అనువాదమ్ :  ఆత్రేయపురపు త్యాగరాజు

నిజాంపేటహైదరాబాద్

ఫొన్ : 9440375411 & 8143626744

మైల్ ఐ.డి.  tyagaraju.a@gmail.com

షిరిడీకోపర్ గావ్ – షిరిడీ

శనివారమ్ – అక్టోబరు, 19, 1985

నేను నా మార్గదర్శి (గైడ్) దుబాసీ స్వామిశేఖర రావు ఇద్దరం సాకూరీ, షిరిడీ రహదారిమీద సగం దూరం నడుచుకుంటూ వెళ్ళాము.  పైన నిర్మలంగా ఉన్న ఆకాశం.  రహదారికి ఇరుప్రక్కలా పూర్వకాలంనాటి బ్రహ్మాండమయిన వృక్షాలు.  రహదారికి కుడి ఎడమలవైపు విశాలమయిన పచ్చని పంట పొలాలు.  ప్రకృతి ఎంతో రమణీయంగా ఉంది.  ఆ రహదారిమీద మా నడక ఎంతో ఆనందంగా సాగింది. 

Tuesday, January 5, 2021

సాయిబాబా – పరిశోధనా వ్యాస గ్రంధము – 25 వ.భాగమ్

0 comments Posted by tyagaraju on 6:49 AM

 



05.01.2020  మంగళవారమ్

ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ సాయి

సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

సాయిబాబా – పరిశోధనా వ్యాస గ్రంధము – 25 .భాగమ్

(రచయిత… శ్రీ ఆంటోనియో రిగోపౌలస్ – ఇటలీ)

తెలుగు అనువాదమ్ :  ఆత్రేయపురపు త్యాగరాజు

నిజాంపేటహైదరాబాద్

ఫొన్ : 9440375411 & 8143626744

మైల్ ఐ.డి.  tyagaraju.a@gmail.com

షిరిడీకోపర్ గావ్ – షిరిడీ

శనివారమ్ – అక్టోబరు, 19, 1985

బాలాజీ పిలాజీ చెప్పిన మరికొన్ని విషయాలు  …

 నా డైరీలోని సారాంశాలు

బషీర్ బాబా గురించి శివనేశన్ స్వామితో సంగ్రహంగా జరిపిన సంభాషణ.  ఆయన వయసు 59 సంవత్సరాలు.  చావడిని కనిపెట్టుకుని ఉంటూ అక్కడె నివసిస్తున్నారు.  షిరిడిలో 30 సంవత్సరాల పైగా నివసిస్తున్నారు.

శివనేశన్ స్వామి చెప్పిన వివరాలు.

ఎప్పుడో నేను క్రితంసారి బషీర్ బాబాను చూసాను.  ఆయన నాకు కనిపించి తనకు యోగానంద (మంత్రదండం) , కొన్ని శక్తులు లభించాయని చెప్పారు.  ఆతరువాత కొన్ని సంవత్సరాలుగా ఆయన షిరిడికి రాలేదు.

Monday, January 4, 2021

సాయిబాబా – పరిశోధనా వ్యాస గ్రంధము – 24 వ.భాగమ్

0 comments Posted by tyagaraju on 7:46 AM

 





04.01.2020  సోమవారమ్

ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ సాయి

సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

సాయిబాబా – పరిశోధనా వ్యాస గ్రంధము – 24 .భాగమ్

(పరిశోధనా వ్యాస రచయిత… శ్రీ ఆంటోనియో రిగోపౌలస్ – ఇటలీ)



తెలుగు అనువాదమ్ :  ఆత్రేయపురపు త్యాగరాజు

నిజాంపేటహైదరాబాద్

ఫొన్ : 9440375411 & 8143626744

మైల్ ఐ.డి.  tyagaraju.a@gmail.com

షిరిడీకోపర్ గావ్ – షిరిడీ

శనివారమ్ – అక్టోబరు, 19, 1985

బాలాజీ పిలాజీ చెప్పిన మరికొన్ని విషయాలు  …

 నా డైరీలోని సారాంశాలు


ప్రశ్న   ---   బాబా శరీరం మీద వారికేమి కనిపించింది?

జవాబు   ---   బాబా ప్రాణాలు విడిచిన తరువాత ప్రజలు ఆయనకు ఆఖరి స్నానం చేయించి శరీరాన్ని శుభ్రపరిచారు.  హిందూ భక్తులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.  ఆవిధంగా చేసిన సమయంలోనే బాబా ధరించిన లంగోటీ కనిపించింది.

ప్రశ్న  --   అంటే బాబా లంగోటీ ధరించినట్లుగా వారు గమనించారని మీ అభిప్రాయమా?

జవాబు   ---   బాబాకు స్నానం చేయించడానికి ఆయన దుస్తులన్నిటినీ తీసివేసినపుడు బాబావారు లంగోటీ ధరించినారని తెలిసింది.  ఆవిధంగా కనుగొనడం జరిగింది.  ఆ లంగోటీని అందరికీ చూపించారు.  అక్కడ ఆసమయంలో చాలామంది హమ్మదీయులు కూడా ఉన్నారు.  అపుడు వారంతా హిందూ సాంప్రదాయం కాబట్టే బాబా లంగోటీ ధరించారన్న విషయాన్ని అంగీకరించారు.  అందువల్లనే ఇన్స్ పెక్టర్ ముస్లిమ్స్ లంగోటీ ధరించరనే కారణంగా బాబా శరీరం హిందువులకే చెందుతుందని నిర్ధారించారు.

Sunday, January 3, 2021

సాయిబాబా – పరిశోధనా వ్యాస గ్రంధము – 23 వ.భాగమ్

0 comments Posted by tyagaraju on 5:18 AM

 




03.01.2020  ఆదివారమ్

ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ సాయి

సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

సాయిబాబాపరిశోధనా వ్యాస గ్రంధము – 23 .భాగమ్

(రచయితశ్రీ ఆంటోనియో రిగోపౌలస్ఇటలీ)

తెలుగు అనువాదమ్ఆత్రేయపురపు త్యాగరాజు

నిజాంపేట, హైదరాబాద్

ఫొన్ : 9440375411 & 8143626744

మైల్ ఐ.డిtyagaraju.a@gmail.com

షిరిడీ- కోపర్ గావ్షిరిడీ

శనివారమ్అక్టోబరు, 19, 1985

బాలాజీ పిలాజీ చెప్పిన మరికొన్ని విషయాలు 

గం.10.30 ని తరువాత ఆఖరికి బూటీ బహిర్భూమికి వెళ్ళారు.  ఆరోజుల్లో బయట బహిరంగ ప్రదేశాలనే లఘుశంక తీర్చుకోవడానికి ఉపయోగిస్తూ ఉండేవారు.  బూటీతో కూడా ఒక నౌకరు ఉండేవాడు.  బాబా బూటీతో “నువ్వు అక్కడికి ఒంటరిగా వెళ్ళవద్దు.  కూడా నీ సేవకుడిని తీసుకువెళ్ళు” అన్నారు.  సేవకుడు ఆయనకు అంగరక్షకుడిగా ఉండేవాడు.  బాబా అనుమతిచ్చిన తరువాత బూటి చెంబుతో నీళ్ళు తీసుకుని తన నౌకరుని వెంటబెట్టుకొని బహిర్భూమికి బయలుదేరాడు.  నౌకరు వెనుక వస్తుంటే బూటీ ముందు నడుస్తూ ఉన్నారు.  ఇంతలో బూటీ గట్టిగా ఆరిచారు.  వెంటనే నౌకరు పెరిగెత్తుకుంటూ ఆయన దగ్గరకు వెళ్ళాడు.  బూటీ ప్రక్కన పాము కుబుసం కనిపించింది.  దానిని చూడగానే ఇద్దరూ గట్టిగా అరుస్తూ అక్కడినుండి వేగంగా వెనుకకు తిరిగి వచ్చారు.

 

Shirdi Sai Real Leelas

Bhjans Of Sai

Sai Prayer Club

My Blog List