08.05.2016 ఆదివారమ్
ఓమ్
సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి
బంధువులకు బాబావారి శుభాశీస్సులు
సాయి
బానిస గారికి సాయిబాబా వారు ప్రసాదించిన మరికొన్ని ఆధ్యాత్మిక సందేశాలు
శ్రీసాయి
పుష్పగిరి – ఆధ్యాత్మిక జీవితం – 9వ.భాగమ్
03.02.2007
81. ఆకాశంలో
ఎగిరే విమానమయినా ఆఖరికి నేలమీద దిగవలసిందే. అలాగే
ఎగురుతూ పోతూ ఉంటే అది
నేల మీదకి కూలిపోతుంది. మానవుడు
కీర్తి కోసము ఎంతపైకి ఎగిరినా కిందకు రావలసిందే. అందుచేత
కీర్తి కోసం ప్రాకులాడకుండా భూమిపై
ప్రశాంత జీవితం సాగించు.



