Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Friday, June 11, 2021

షిరిడీ సాయిబాబా – గురునానక్ – 2 వ.భాగమ్

1 comments Posted by tyagaraju on 7:41 AM

 



11.06.2021  శుక్రవారమ్

ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ సాయి

సాయి  బంధువులకు బాబావారి శుభాశీస్సులు

శ్రీ సాయిలీల ద్వైమాసపత్రిక నవంబరు – డిసెంబరు, 2008 వ.సంవత్సరంలో ప్రచురింపబడిన సాయిలీల

షిరిడీ సాయిబాబా – గురునానక్ – 2 వ.భాగమ్

ఆంగ్ల మూలమ్ డా.సుబోధ్ అగర్వాల్, డెహ్రాడూన్

తెలుగు అనువాదమ్ : ఆత్రేయపురపు త్యాగరాజు

నిజాంపేట, హైదరాబాద్

ఓ బాబా! యోగులు వాస్తవంగానే ఏకభావంతో కార్యాన్ని నిర్వహిస్తారు.  గురునానక్ హిందువులు, ముస్లిమ్స్ మధ్య ఐకమత్యం ఉండాలని కోరుకొన్నారు.  నువ్వు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పెంపొందింపచేయడానికి, మతసామరస్యాన్ని నెలకొల్పడానికి అవతరించినవానిగా కీర్తింపబడ్డావు.  గురునానక్ ఎప్పుడూ ‘ ఏక్ ఓంకార్ సత్నామ్’ అని అంటూ ఉండేవారు.  అనగా దాని అర్ధం ‘భగవంతుడు ఒక్కడే -  ఆయన పేరు సత్యసంధత’.  అదేవిధంగా జీవితంలో నీయొక్క ముఖ్యమయిన ఉద్దేశ్యం శాశ్వతమయిన సత్యాన్ని ప్రజలు గ్రహించుకోవాలన్నదే.  ‘సబ్ కా మాలిక్ ఏక్’ అందరినీ పరిపాలించేది ఒకే భగవంతుడు. (భగవంతుడే అందరికీ యజమాని).

Wednesday, June 9, 2021

షిరిడీ సాయిబాబా – గురునానక్

0 comments Posted by tyagaraju on 7:39 AM

 



09.06.2021  బుధవారమ్

ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ సాయి

సాయి  బంధువులకు బాబావారి శుభాశీస్సులు

ఈ రోజు మరొక అధ్భుతమయిన బాబా లీల గురించి ప్రచురిస్తున్నాను.  ఈ లీల శ్రీ సాయిలీల ద్వైమాసపత్రిక నవంబరు – డిసెంబరు, 2008 వ.సంవత్సరంలో ప్రచురింపబడింది.

షిరిడీ సాయిబాబా – గురునానక్

శిక్కుల మతగురువయిన గురునానక్ జయంతి ఉత్సవాలు కార్తిక పౌర్ణమి (అక్టోబర్ – నవంబర్) నాడు నిర్వహిస్తూ ఉంటారు.  గురునానక్ 1469 వ.సం.లో లాహోర్ కి 45 కి.,మీ. దూరంలో ఉన్న తాల్వండీలో జన్మించారు.  ఇపుడు ఆ తాల్వండీ నానకనా సాహిబ్ గా పిలవబడుతూ ఉంది.  నానకనా సాహిబ్ లో సుందరమయిన గురుద్వారా, ఇంకా పవిత్రమయిన సరోవరం కూడా ఉంది.  గురుపౌర్ణమినాడు ఇక్కడ అత్యంత వైభవంగా ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి.  భారతదేశంనుండే కాక విదేశాలనుండి కూడా వేలాదిమంది భక్తులు ఈ ఉత్సవాలు చూడటానికి వస్తూ ఉంటారు.

 

Shirdi Sai Real Leelas

Bhjans Of Sai

Sai Prayer Club

My Blog List

  • - 22.06.2026 సోమవారమ్ ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ సాయి సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు శ్రీ సాయి లీల ద్వైమాస పత్రిక మార్చ్, ఏప్రిల్, 2026, సంచికలో ప్ర...
    3 months ago