Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Tuesday, June 7, 2022

శ్రీ సాయి దయా సాగరమ్ 13 వ, భాగమ్

0 comments Posted by tyagaraju on 7:57 AM

 



07.06.2022  మంగళవారమ్

ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ సాయి

శ్రీ మాత్రే నమః


సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

శ్రీ సాయి దయా సాగరమ్ 13 వ, భాగమ్

అధ్యాయమ్ – 9

కల్ప వృక్షమ్

కాకా సాహెబ్ దీక్షిత్ జీవితంలో 1909 వ. సంవత్సరం నవంబరు 2 వ.తేదీ సువర్ణాక్షరాలతో లిఖింపబడవలసిన రోజు.  ఆరోజున కాకా సాహెబ్ మొట్టమొదటిసారిగా సాయిబాబాను దర్శించుకున్నారు.  ఆరోజు గురుసమర్పణ్ రోజు.  ఆరోజును అందరూ ఎంతో భక్తితో జరుపుకుంటారు.  సాయి భక్తులకి డిసెంబరు 2 వ. తేదీ కూడా చాలా ముఖ్యమయినదే.  ఈ రోజునే గౌరవనీయులయిన సత్పతి గురూజి కాకాసాహెబ్ ట్రస్ట్ లో సుందరమయిన సాయిబాబా విగ్రహాన్ని ప్రతిష్ట చేసారు.  ఏ సామాన్య మానవుడికయినా ఒక దేవాలయాన్ని నిర్మించడమంటే సాధ్యపడే విషయం కాదు.  గురువు యొక్క దయ, అనుగ్రహం ఉంటేనే అది సాధ్యపడుతుంది. వైదిక శాస్త్ర  ప్రకారం మనం పూర్వ జన్మలో చేసుకున్న మంచికర్మల వల్లనే అది సాధ్యపడుతుంది.  తను పూర్వజన్మలో చేసుకున్న పుణ్యఫలం వల్లనే కాకాసాహెబ్ దీక్షిత్ కుటుంబంలో జన్మించానని ఆయన మనుమడు అనిల్ దీక్షిత్ అంటూ ఉంటారు.

Monday, June 6, 2022

శ్రీ సాయి దయా సాగరమ్ 12 వ, భాగమ్

0 comments Posted by tyagaraju on 7:09 AM

 



06.06.2022  సోమవారమ్

ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ సాయి

శ్రీ మాత్రే నమః


సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

శ్రీ సాయి దయా సాగరమ్ 12 వ, భాగమ్

అధ్యాయమ్ – 8

కలలు -  వాస్తవాలు

2003 వ.సంవత్సరంలో జరిగిన సంఘటన.  మా చెల్లెలు నీతా ఫోన్ లో మాట్లాడుతూ చెప్పిన విషయం.  తనకు వచ్చిన భయంకరమయిన స్వప్నం గురించి చెబుతూ, ఆకలలో  నేను నా స్వంత ఊరిలో బాలాజీ దేవాలయంలో ఉన్నట్లుగా కనిపించానని చెప్పింది.  ఏదో ప్రమాదం జరగబోతూ ఉందని నాకర్ధమయింది.  మరుసటి రోజునే , పూనాలోని రూబీ కో ఆపరేటివ్ బ్యాంక్ లో ఉద్యోగం చేసిన నా కజిన్ సోదరుడు అంబాదాస్ మరణించాడనే దుర్వార్త వినవలసి వచ్చింది.

 

Shirdi Sai Real Leelas

Bhjans Of Sai

Sai Prayer Club

My Blog List