Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Saturday, May 15, 2021

సర్వాంతర్యామి - ఆర్తితో అర్ధిస్తే ఆదుకుంటారు

0 comments Posted by tyagaraju on 1:43 AM

 



15.05.2021  శనివారమ్

ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ సాయి

సాయి బంధువులకు బాబా వారి శుభాశీస్సులు

ఈ రోజు మరొక అధ్భుతమయిన బాబా లీల గురించి ప్రచురిస్తున్నాను.  సాయి లీల ద్వైమాసపత్రిక మే – జూన్, 2011 వ.సంవత్సరంలో ప్రచురింపబడింది.

తెలుగు అనువాదమ్ :  ఆత్రేయపురపు త్యాగరాజు

నిజాంపేట, హైదరాబాద్

సర్వాంతర్యామి -  ఆర్తితో అర్ధిస్తే ఆదుకుంటారు

ఒకసారి నేను దసరా శలవలకి మా ఊరు షహజాన్ పూర్ (బరేలీ) కి వెడుతున్నాను.  అంతదూరం ప్రయాణం చేయడం నాజీవితంలో అదే మొదటిసారి.

నేను మధురలో దిగి బస్సులో వెళ్ళాలి.  కాని బస్ స్టాండ్ కి వెళ్ళేటప్పటికి అప్పటికే మధురనుండి బరేలీకి వెళ్ళే బస్సులన్నీ వెళ్ళిపోయాయి.  ఏమి చేయాలో తెలియక మా నాన్నగారికి ఫోన్ చేసాను.  నేను ఫోన్ చేసిన సమయానికి ఆయన ఫోన్ ని ఇంటిలోనే వదిలేసి బయటకు వెళ్లారు.  అందుచేత నా పరిస్థితి ఆయనకు తెలియదు.

 

Shirdi Sai Real Leelas

Bhjans Of Sai

Sai Prayer Club

My Blog List