20.12.2013 శుక్రవారము
ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
శ్రీసాయితొ మధురక్షణాలలో ఇంకా మరికొన్ని క్షణాలు ఉన్నాయి. ఇంకా వాటిని అనువాదం చెయ్యాలి. ఈ రోజు బాబా చేసిన ఒక అద్భుతమైన లీలను ప్రచురిస్తున్నాను. చదవండి. మనం ఆర్తితో పిలిస్తే బాబా స్పందించకుండా ఉండడు. అత్యంత అధ్బుతంగా జరుగుతాయి కొన్ని కొన్ని సంఘటనలు. మూడు రోజుల క్రితం నెల్లూర్ నుంచి సుకన్యగారు ఆంగ్లంలో ప్రచురించిన లీల నాకు మైల్ ద్వారా పంపించారు. చదివిన వెంటనే అనువాదం కూడా చేశాను. ఇది ఇంతకు ముందు సాయిలీలాస్.ఆర్గ్ లో ప్రచురించడం వల్ల వారినుంచి కూడా అనుమతి తీసుకున్నాను. వారు కూడా నిన్నే అనుమతి కూడా ఇచ్చారు. సాయిలీలాస్ బ్లాగును పరిచయం చేసిన సుకన్య గారికి అభినందనలు తెలుపుతూ, అనుమతినిచ్చిన సాయిలీలా ఆర్గ్ వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.
ముందుగా శ్రీవిష్ణుసహస్ర నామం 100వ.శ్లోకం, తాత్పర్యం.
శ్రీవిష్ణుసహస్రనామం
శ్లోకం : అనంతరూపోనంత శ్రీర్జితమన్యుర్భయాపహః |
చతురశ్రోగభీరాత్మా విదిశో వ్యాదిశోదిశః ||
తాత్పర్యం: నారాయణుని అసంఖ్యాకమైన రూపములుగా, వైభవము గలవానిగా, జీవులలోగల కోపమును జయించినవానిగా ధ్యానము చేయుము. చతురస్రమై, భయమును పోగొట్టు లోతైన ఆత్మ గలిగి, అన్ని దిశలయందు వ్యాపించి, అన్ని దిశలయందు, అంతర్దిశలయందు వ్యాపించుటయే గాక, అన్ని దిక్కులకు తానే దిక్కుగా నుండువాడు.
నా ఊదీలో నీకు నమ్మకం లేదా?
వివిధ ప్రదేశాలనుండి భక్తులు షిరిడీకి పాదయాత్ర చేస్తారు. కొంతమంది పల్లకినీ మోసుకొని వెడితే కొంతమంది నడచి వెడుతూ ఉంటారు. భారతదేశంలోని వివిధ ప్రాంతాలనుండి భక్తులు పాదరక్షలతో గాని, లేకుండాగాని షిరిడీ వరకు పాదయాత్ర చేస్తారు.



