21.01.2011 శుక్రవారం
ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి
భగవంతుడు మననించి కోరేది ఏమిటి ?
నువ్వు భగవంతుడిని ప్రేమిస్తున్నావా?
జవాబు నిశ్చయంగా అవును అనే వస్తుంది. అవును అని నువ్వు ఎలా చెప్పగలవు.
"నేను రోజూ చాలాసేపు భగవంతుడిని (లెక బాబా గారిని) పూజ చేస్తాను, గుడికి వెడతాను, భక్తి గ్రంథాలు చదువుతాను, సాయి సచ్చరిత్ర చదువుతాను, ఇలా చెప్పుకుంటే చాలా వస్తుంది. గుడికి విరాళాలు ఇస్తూ వుంటాను, వెండి కిరీటాలు, సిం హాసనాలూ అన్నీ చేయిస్తాను," చెప్పుకుంటూపోతే చాలా పెద్ద జవాబే. ఇది ఎవ్వరిని అంటే విరాళాలు ఇచ్చేవారిని విమర్శించడం కాదు. కాని, భగంతుడు, లేక బాబా కోరుకునేది ఇదేనా? ఖచ్చితంగా కాదు. అయితే నువ్వు కనక భగవంతుడిని నిజంగా ప్రేమిస్తూంటే ఆయన నీనుంచి కోరుకునేది ఏమిటి?
అనుమానం లేదు, ఆయన కోరుకునేది ప్రేమ, దయ. కాని ఎలా ఆలోచించండి.
సాయి బంధువులమయిన మనము బాబా చెప్పిన బాటలో నడవాలి, ఆయన చెప్పిన సూత్రాలను పాతించాలి. చరిత్ర పారాయణ మామూలుగా చేసి వదిలివేడం కాదు. ఆయ్న లీలలని అర్థం చేసుకోవాలి, వాటిల్ని మనసుకు పట్టించుకోవాలి. అందులొని ఆనందాన్ని అనుభవించాలి. మనలో మార్పు ఒక్కసారిగా రమ్మంటే రాదు. మెల్ల మెల్లగా మనలో మార్పు రావాలి. అది రావాలంటే బాబా చరిత్రలోని విషయాలని ఎల్లప్పుడు గుర్తుచేసుకుంటూ ఉండాలి. నీలొ బాబా ఉన్నారు, మరి నీ యెదటివానిలొ కూడా బాబా ఉన్నారుగా? అటువంటప్పుడు యెదటివారితోకూడా సౌమ్యంగా మాట్లాడే గుణం అలవరచుకోవాలి.
బాబా ఎపుడూ నీనుంచి నీ అమూల్యమైన సమయాన్ని గాని, థనాన్ని గాని, ఆశించడు. నువ్వు పెద్ద భవంతిలో ఉన్నావా, నీ దగ్గిర యెంత థనం ఉంది, ఇవన్ని ఆయనకు అక్కరలేదు. ఆయన కోరుకునేది నీనుంచి భక్తి. ఎదటివారియెడల దయ, ప్రేమ. కాని మనకు ఆశ్చర్యంగా ఉండవచ్చు. ఇది ఎలా సాథ్యమని. మనం కనక బాబా సంతానం, లేక సాయి బంధువులము అనుకుంటే ఇది సాథ్యం. మనం గుడికి విరాళాలు ఇవ్వవచ్చు, లక్షలు ఖర్చు పెట్టవచ్చు. కాని కొంత అవసరమయినవారికి కూడా ఇవ్వాలి, బీదవారికి విద్యా దానం చేయవచ్చు. వారికి దుస్తులు కొని ఇవ్వవచ్చు.మన చుట్టూ ఉన్న ప్రపంచంలో ఒక పూటే తిండితినేవారున్నారు, వారికి కాస్త పట్టెడన్నం పెట్టవచ్చు. ఒక్కరోజైన అనాథ శరనాలయానికి వెళ్ళి అక్కడి అక్కడివారికి మనకు తోచినంత సహాయం చేవచ్చు.
వృథ్థాశ్రమాలు ఉన్నాయి , అక్కడికి వెళ్ళి వారందరితో ఆప్యాయంగా పలకరించి, వారికి కావలసిన మందులు ఇవ్వవచ్చు. మనం వారికి తోచిన సహయం చేవచ్చు. ఇవన్నీకూడా బాబాకి ప్రీతిపాత్రమయినవి కాదా?
అర్హులకి మనం చేసే సాయంలో ఆనందం ఉంది. అదే భగవంతుడికి ప్రీతిపాత్రమయినది.
-------------------------------------------------------------------------------------
బాబా ఊదీ
బాబా ఊదీ అంటే సర్వరోగ నివారిణి అని మనకు తెలుసు. బాబాగారు కూడా తన భక్తులకు ఊదీని ఇచ్చెడివారు.
ఈ రోజు విక్రం గారి ఊదీ మహిమ గురించి వారి మాటలలోనే తెలుసుకుందాము.
నా పేరు విక్రం. నాకు బాబాగారంటే అనన్యమైన భక్తి. బాబాగారు ఎప్పుడూకూడా నా క్షేమం పూర్వము, ఇప్పుడూ కూడా చూస్తూఉన్నారు. నేను నా కుటుంబానికి దూరంగా అమెరికాలో ఉంటున్నాను. ముఖ్యంగా మా అమ్మగారితో కూడా. అందుచేత బాబాగారే నా తల్లి. భారతదేశంలో మా అమ్మగారు నాన్ను ఎలా చూసేవారో అల్ల బాబాగారే నాకు అన్నీ చూస్తున్నారు. నేను ప్రతివిషయంలోనూ బాబాగారిని సాయిమా అనే పిలుస్తుంటాను. బాబాగారి యొక్క ప్రేమానుభూతిని ఇప్పుడు మీకు చెపుతాను. క్రితం సంవత్సరం మేము కొంతమందిమి కలిసి 8 గంటల రోడ్డుమీద ప్రయాణం పెట్టుకున్నాము. కాని నాకు ఈదేశంలో కారు ప్రయాణమంటే భయం యెందుకంటే ఇక్కడ డ్రైవర్లు చాలా వేగంగా నడుపుతూఉంటారు.
మా ప్రయాణానికి కొన్నిగంటలు ఉందనగా నేను కూర్చుని సాయి సచ్చరిత్ర పుస్తకంలోని మొదటి అథ్యాయంలోని కొన్ని పేజీలు యాదృచ్చికంగా తిరగేసాను. దానిలో బాబాగారు తన భక్తులకి ఇచ్చే ఊదీ, ఊదీ మహిమిలగురించీ సంబంధించిన ప్రస్తావన ఉంది. పుస్తకం మూసేసి, ప్రయాణానికి ముందు నా నుదిటిమీద ఊదీ పెట్టుకుందామని అనుకున్నాను.
ప్రయాణానికి అన్నీ సద్దుకుంటూ, బీరువాలోనించి ఒక చొక్కా తీసుకున్నాను. ఆ చొక్కా మీద నాకు అంత పెద్దగా ఇష్టము లేదు, చాలా అరుదుగా వేసుకుంటూ ఉంటాను. ఈ ప్రయాణంలో ఈచొక్కా వేసుకుందామనుకున్నాను. ఈ చొక్కా ఈ ప్రయాణానికి యెందుకు తీసానో ఇప్పటి వరకు నాకే తెలియదు. చొక్కా జేబూలలో యేమన్నా ఉన్నయేమో చూద్దామని అన్ని చెక్ చేయడం మొదలుపెట్టాను. ఒక జేబులో చెయ్యి పెట్టేసరికి చేతికి యేదొ పొడిలాగ తగిలింది. ఆ పొడి యేమిటొచూద్దామని చేతిని బయటకు తీశాను. అది బూడిద రంగులో ఉన్న పొడి. జేబులో ఇంకా లోతుగా చెయ్యిపెట్టి తీసేసరికి ఆశ్చర్యంగా, అదీఒక చిన్నపాకెట్. దాని మీద "శ్రీ షిరిడి సాయి సంస్థాన్" అని పేరు ఉంది. అది ఒక ఊదీ పాకెట్. ఆ పాకెట్ కొంచెం చిరిగిఉంది, అందుచేట కొంచెం ఊదీ జేబులో అంతా ఒలికిపోయి ఉంది. నేను నమ్మలేకపోయాను,. చరిత్రలో ఊదీ గురించి చదివి ఊదీ కావాలనుకున్న 15 - 20 నిమిషములలోనే ఇది జరిగింది. నేను ఆఖరిసారిగా ఇండియా వచ్చినప్పుడు నా సోదరుడు ఈ చొక్కా నాకు బహూకరించాడు. నేను ఇండియా ఎప్పుడు వచ్చినా కూడా షిరిడీ వెడుతూంటాను. నేను షిరిడీ వెళ్ళినప్పుడు ఈ చొక్కా వేసుకుని వుంటాను.
అప్పుడు ఈ ఊదీ పాకెట్ జేబులో వేసుకుని మర్చిపోయాను. ఈ ఊదీ లభించడం నా అదృష్టం. బాబాగారు ప్రతీదీ కూడా మనకు యెప్పుడు యేదికావాలో అది లభించేటట్లు యేర్పాటు చేస్తూ ఉంటారు. ఈ ఊదీ కూడాడా ఆయన ఇలాయేర్పాటు చేసినదే. ఇల్క నేను యెటువంటి చింతా పెట్టుకోకుండాఊదీని నుదిటి మీద పెట్టుకుని ప్రయాణానికి సిథ్థమయ్యాను.
సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు