Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Sunday, September 11, 2022

శ్రీ సాయి దయా సాగరమ్ 23 వ, భాగమ్

0 comments Posted by tyagaraju on 4:55 AM

 


11.09..2022  ఆదివారమ్

ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ సాయి

శ్రీ మాత్రే నమః


సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

శ్రీ సాయి దయా సాగరమ్ 23 వ, భాగమ్

అధ్యాయమ్ – 21

మరాఠీ మూలగ్రంధ రచయిత్రి --- శ్రీమతి ఉజ్వలా బోర్కర్, విలేపార్లే - ముంబాయి

ఆంగ్లానువాదమ్ ---  శ్రీ ఉదయ్ అంబాదాస్ బక్షి

తెలుగు అనువాదమ్ ---  ఆత్రేయపురపు త్యాగరాజు, నిజాంపేట, హైదరాబాద్

9440375411  & 8143626744

బాబా మెడలో పూలదండ

ఇపుడు మీకు వాస్తవంగా జరిగిన సంఘటన గురించి వివరిస్తాను.  ఇది జరిగి చాలా కాలమయింది.  మేము ప్రతి సంవత్సరం షిరిడీకి వెళ్ళి వస్తూ ఉంటాము.  ఈ సారి నేను మా ఇద్దరి అక్కలతోను, మా అయిదుసంవత్సరాల కూతురుతోను షిరిడీలో శ్రీరామనవమి ఉత్సవాన్ని తిలకించడానికి వెళ్ళాము.  షిరిడీ బాగా రద్దీగా ఉంది.  బాబాకి అభిషేకం చేసి పూజ కూడా చేసాము.  మూడవరోజున శ్రీరామనవమి.  హాలు మధ్యలో ఒక ఊయలను కట్టారు.  ఆ ఉత్సవం చూసిన తరువాత మేము తిరుగు ప్రయాణమవుదామనుకున్నాము. 

 

Shirdi Sai Real Leelas

Bhjans Of Sai

Sai Prayer Club

My Blog List