Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Friday, December 4, 2020

సాయిబాబా – పరిశోధనా వ్యాస గ్రంధము – 8 వ.భాగమ్

0 comments Posted by tyagaraju on 7:50 AM

 



04.12.2020  శుక్రవారమ్

ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ సాయి

సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

సాయిబాబాపరిశోధనా వ్యాస గ్రంధము – 8 .భాగమ్

(రచయితశ్రీ ఆంటోనియో రిగోపౌలస్ఇటలీ)

తెలుగు అనువాదమ్ :  ఆత్రేయపురపు త్యాగరాజు

నిజాంపేట, హైదరాబాద్

ఫొన్ : 9440375411 & 8143626744

మైల్ ఐ.డి.  tyagaraju.a@gmail.com

షిరిడీసాకోరీషిరిడి -  గురువారము, అక్టోబరు, 17, 1985

ప్రశ్న   ---   బాబా మహాసమాధి చెందిన తరువాత షిరిడిలో ఏమి జరిగింది?

జవాబు   ---   తనకు ఇక మరణమాసన్నమయిందని తెలిసి, తాను తొందరలోనే దేహాన్ని వీడుతున్నానన్న విషయం బాబా కొద్దిమందికి చెప్పారు.  ఆసమయంలొ దాదాపు ఏడువేలమంది ప్రజలు షిరిడీలొ గుంపులు గుంపులుగా సమావేశమయ్యారు.  ప్రజలందరూ చాలా ఆందోళనకు గురయ్యి ఏడవసాగారు.  ఆప్రదేశమంతా చాలా గందరగోళంతో నిండిపోయింది.  ఆయన అంతిమయాత్ర ఎంతో వైభవంగా జరిగింది.  సుదీర్ఘమయిన యాత్ర జరిగింది.  ప్రజలందరూ ఎంతగానో శోకించారు.  ఆయన శరీరాన్ని బూటీవాడలో ఉంచారు.  అదే ఇప్పటి సమాధి మందిరం.  ఆప్పటినుండి ఆయన దేహం అక్కడే ఉంది.

Thursday, December 3, 2020

సాయిబాబా – పరిశోధనా వ్యాస గ్రంధము – 7 వ.భాగమ్

0 comments Posted by tyagaraju on 8:22 AM

 


03.12.2020  గురువారమ్

ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ సాయి

సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

సాయిబాబాపరిశోధనా వ్యాస గ్రంధము – 7 .భాగమ్

(రచయితశ్రీ ఆంటోనియో రిగోపౌలస్ఇటలీ)

తెలుగు అనువాదమ్ :  ఆత్రేయపురపు త్యాగరాజు

నిజాంపేట, హైదరాబాద్

ఫొన్ : 9440375411 & 8143626744

మైల్ ఐ.డి.  tyagaraju.a@gmail.com

షిరిడీసాకోరీషిరిడి -  గురువారము, అక్టోబరు, 17, 1985

ప్రశ్న   ---   ఉపాసనీ మహరాజ్ గురించి ఏమయినా చెబుతారా?

జవాబు   ---   ఉపాసనీ మహరాజ్ గారు ఎప్పుడూ ఖండోబా మందిరం వద్దనే ఉండేవారు.  ఆయన బాబాకు సన్నిహితంగా ఉండేవారు.  ఆయన బాబాను మొట్టమొదటగా కలుసుకొన్న తరువాత ఖండోబా మందిరం వద్దనే నివసించడానికి వెళ్లారు.

ప్రశ్న   ---   బాబా గారు జీవించి ఉన్న కాలంలో ఏవిధమయిన కార్యక్రమాలు జరిగేవి?

జవాబు   ---   నాకు గుర్తున్నంతవరకు బాబా గారు జీవించి ఉన్న కాలంలో రెండే ఆరతులు జరిగేవి.  ఒకటి ఉదయం 5 గంటలకు మరొకటి మధ్యాహ్న ఆరతి.  సాయంత్రం  4, 5 గంటల మధ్య కీర్తనలు పాడేవారు.

Wednesday, December 2, 2020

సాయిబాబా – పరిశోధనా వ్యాస గ్రంధము – 6 వ.భాగమ్

0 comments Posted by tyagaraju on 8:01 AM

 


02.12.2020  బుధవారమ్

ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ సాయి

సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

సాయిబాబాపరిశోధనా వ్యాస గ్రంధము – 6 .భాగమ్

(రచయితశ్రీ ఆంటోనియో రిగోపౌలస్ఇటలీ)

తెలుగు అనువాదమ్ :  ఆత్రేయపురపు త్యాగరాజు

నిజాంపేట, హైదరాబాద్

ఫొన్ : 9440375411 & 8143626744

మైల్ ఐ.డి.  tyagaraju.a@gmail.com

షిరిడీసాకోరీషిరిడి -  గురువారము, అక్టోబరు, 17, 1985

(శ్రీ ఉధ్ధవ గారితో ముఖా ముఖీ తరువాయి భాగమ్)

ప్రశ్న   ---   బాబా తన భక్తులకు శ్రధ్ధ, సబూరీలను అలవరచుకోమని పట్టుపట్టి మరీ చెబుతూ ఉండేవారటనిజమేనా?

జవాబు   ---   నిజమే – బాబా తన భక్తులను, ఇంకా ప్రజలందరినీ కూడా శ్రధ్ధ, సబూరి (నమ్మకము, సహనం) వీటిని అలవరచుకోమని బోధిస్తూ ఉండేవారు.  బాబా చాలా తరచుగా ఈ సలహా ఇస్తూ ఉండేవారు.

Tuesday, December 1, 2020

సాయిబాబా – పరిశోధనా వ్యాస గ్రంధము – 5 వ.భాగమ్

0 comments Posted by tyagaraju on 7:57 AM

 




01.12.2020  మంగళవారమ్

ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ సాయి

సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

సాయిబాబాపరిశోధనా వ్యాస గ్రంధము – 5 .భాగమ్

(రచయితశ్రీ ఆంటోనియో రిగోపౌలస్ఇటలీ)

తెలుగు అనువాదమ్ :  ఆత్రేయపురపు త్యాగరాజు

నిజాంపేట, హైదరాబాద్

ఫొన్ : 9440375411 & 8143626744

మైల్ ఐ.డి.  tyagaraju.a@gmail.com

షిరిడీసాకోరీషిరిడి -  గురువారము, అక్టోబరు, 17, 1985

షిరిడీలో ఉద్ధవరావు మాధవరావు దేశ్ పాండె గారి తండ్రిగారి ఇంటిలో జరిగిన ముఖాముఖీ సంభాషణ.. ఉదయం గం.8-30 నుండి గం. 10-00 వరకు.

ఉధ్దవరావు దేశ్ పాండే వయస్సు 79 సంవత్సరాలు. ఆయన కీశే. మాధవరావు దేశ్ పాండే (శ్యామా, మరణించిన సం. 1944) కుమారుడు.  శ్యామా సాయిబాబాకు అత్యంత సన్నిహిత భక్తుడే కాక బాబాకు తరచుగా మధ్యవర్తిగా ఉండేవాడు.

ఉద్దవరావు, ఆయన భార్య, నన్ను, నాతోకూడా వచ్చిన దుబాసీ, స్వామి శేఖరరావుని, బలదేవ్ గ్రిమె, అతని భార్య మమ్మలనందరినీ ఎంతో సాదరంగా ఆహ్వానించారు.  వారు మాకు మంచి టీ ఇచ్చారు.  ఆతరువాత నేను ఉద్ధవ్ గారిని బాబా గురించి వివరాలు తెలుసుకోవడానికి ముఖాముఖీ ప్రశ్నలు అడిగాను.

Monday, November 30, 2020

సాయిబాబా – పరిశోధనా వ్యాస గ్రంధము – 4వ.భాగమ్

0 comments Posted by tyagaraju on 7:28 AM

 



30.11.2020  సోమవారమ్

ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ సాయి

సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

సాయిబాబాపరిశోధనా వ్యాస గ్రంధము – 4.భాగమ్

(రచయితశ్రీ ఆంటోనియో రిగోపౌలస్ఇటలీ)

తెలుగు అనువాదమ్ :  ఆత్రేయపురపు త్యాగరాజు

నిజాంపేట, హైదరాబాద్

ఫొన్ : 9440375411 & 8143626744

మైల్ ఐ.డి.  tyagaraju.a@gmail.com

షిరిడీసాకోరీషిరిడిగురువారము, అక్టోబరు, 17, 1985

12 P.M. షిరిడీకి కొద్ది మైళ్ళ దురంలో ఉన్న సాకోరికి గం.11.15 ని. లకు చేరుకొన్నాము.  సాకోరి ఎంతో ప్రశాంతంగాను, పరిశుభ్రంగాను ఉంది.  షిరిడితో పోల్చుకుంటే ఆశ్చర్యకరమయిన విషయం ఒకటి గమనించవచ్చు.  షిరిడీ వచ్చేపోయే భక్తులతోను, ప్రజలందరి కోలాహలంతోను నిండి ఉండే పుణ్యక్షేత్రం.  సమాధి మందిరంలోకి భక్తులందరూ బారులుతీరు వరుక్రమంలో వెడుతూ ఉండే ప్రదేశమయితే, ఇక్కడ సాకోరిలో మాత్రం ఎంతో నిశ్శబ్దంగా ఉంది. అక్కడక్కడ కొద్దిమంది భక్తులు మాత్రమే కనిపిస్తూ ఉన్నారు. 

సాకొరిలో ప్రధానమయిన భవనం, చిన్న చిన్న మందిరాలను (దత్తాత్రేయ దేవాలయాలవంటివి) చాలా పరిశుభ్రంగా నిర్వహిస్తున్నారు.  ముఖ్యంగా ఉపాసనీ మహరాజ్ చాలా కాలం తననుతాను బంధించుకున్న పంజరం నామనసులో బలమైన ముద్ర వేసింది.

 

Shirdi Sai Real Leelas

Bhjans Of Sai

Sai Prayer Club

My Blog List