23.12.2015 బుధవారం
ఓంసాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
శ్రీ షిరిడిసాయి వైభవం - నాకు నాఫోటోకి భేదం లేదు
ఈ రోజు శ్రీషిరిడీ సాయి వైభవంలో మరొక అధ్బుతమైన వైభవం తెలుసుకుందాము.
శ్రీ సాయి సత్చరిత్ర పారాయణ చేసినవారందరికి గుర్తుండే ఉంటుంది. నాకు నా ఫోటోకి భేదం లేదని బాబా చెప్పిన విషయం. ఆయన చెప్పిన విషయం మనమందరం బాగా గుర్తుంచుకొని అవగాహన చేసుకోవాలి. కారణం చెపుతాను వినండి. సాయి భక్తులలో కొందరు కలిసి సత్సంగాలు చేసేటప్పుడూ, భజనలు చేసేటప్పుడు బాబా పటం పెట్టి చుట్టూరా కరంటు బల్బులతో (చిన్న చిన్న బల్బులు) దండలా వేస్తూ ఉంటారు. కొంచెం ఆలోచిద్దాము. బాబా తన ఫొటోకి తనకి భేదం లేదన్నప్పుడు, ఫోటొ లో ఉన్న బాబా కూడా సజీవమూర్తే కదా? మరి అటువంటప్పుడు ఆయన ఫోటో చుట్టూరా కరంటూ బల్బుల దండ వేయడం భావ్యమా? మన ఇంటికి ఎవరయినా గౌరవమయిన వ్యక్తి వచ్చినప్పుడు గౌరవ సూచకంగా ఆయన మెడలో కరంటు బల్బుల దండ వేస్తామా? మనం కూడా వేసుకోము కదా? అందుచేత బాబా ఫోటో లో ఉన్న బాబా కూడా మనెదురుగా సశరీరంతో ఉన్నట్లుగానే భావించండి. ఆయన ఫోటో ఎక్కడ ఉంటే అదే షిరిడీ. ఈ విషయం కుడా ఆయనే చెప్పారు కదా. షిరిడీలో ఎక్కడ కొన్నా అది ఆయన ప్రసాదమే. అందుచేత ద్వారకామాయిలో లభించే ప్రసాదం స్వల్పమే కావచ్చు. తోటివారికి పంచడానికి షిరిడీలో ఎక్కడ ఏ షాపులో కొన్నా అది బాబా ప్రసాదమే.
ఇక చదవండి.
శ్రీ షిరిడిసాయి వైభవం
వాసుదేవ్
సదాషివ్ జోషి, అతని స్నేహితుడు
చిదంబర్ రావ్ కే. గాడ్గే
బాబా ను దర్శించుకోవడానికి షిరిడీ
వెళ్ళారు. వారు
సాఠేవాడాలో బస చేసి అక్కడ
అక్కడ జరుగుతున్న ఆరతిలో పాల్గొన్నారు. పూర్వపు
రోజులలో ఆరతి గురుస్థాన్ లో
కూడా జరుగుతూ ఉండేది.



