17.05.2016 మంగళవారమ్
ఓమ్
సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి
బంధువులకు బాబావారి శుభాశీస్సులు
సాయి
అంకిత భక్తులను గురించిన విషయాలన్ని శ్రీ బొండాడ జనార్ధనరావు గారి ఆంగ్ల బ్లాగునుండి
సేకరింపబడినవి. నిన్నటితో పూర్తయింది కాని పొరపాటున చూసుకోకుండా ఇంకా ఉంది అని ప్రచురించాను. అందువల్ల ఆంగ్ల బ్లాగులో లేని నార్కేగారి గురించిన మరికొంత సమాచారం ‘శ్రీ
సాయిభక్త అనుభవ సంహిత’ (Devotees Experiences of Sri Sai Baba by Sri B.V.narasimhaswamy) తెలుగు అనువాద పుస్తకం
నుంచి గ్రహించి ఆఖరి భాగంగా ప్రచురిస్తున్నాను.
సాయి అంకిత భక్తులు – ప్రొఫెసర్ శ్రీ జి.జి. నార్కే (ఆఖరి భాగమ్)
జూన్ 4వ.తేదీ 1936 న నార్కే గారు చెప్పిన విషయాలు
1914
ప్రాంతంలో హార్దాకు చెందిన ఒక శ్రీమంతుడయిన వృధ్ధుడు ఒకామెతో షిరిడీ వచ్చాడు. అతను క్షయ వ్యాధితో బాధ పడుతున్నాడు. షిరిడీ చేరిన ఒక నెలకు ఆరోగ్యం కాస్త మెరుగవడంతో,
షిరిడీనే తన నివాసంగా చేసుకున్నాడు. కాని రెండవ
నెల చివర్లో అతని పరిస్థితి విషమించి మృత్యువు సమీపించినట్లు అనిపించింది. అప్పుడు బాబా దగ్గరకు వెళ్ళి సహాయం కోరేందుకు, వారింట్లో
మగ దిక్కు ఎవరూ లేనందువల్ల ఆయన ఇంట్లోని ఆడవాళ్ళు, వాళ్ళ స్నేహితురాళ్ళు బాబాను అడిగి
ఊదీ తెచ్చిపెట్టమని నన్ను అభ్యర్ధించారు.



