12.09.2013 శుక్రవారము
ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయిబంధువులకు బాబావారి శుభాశీస్సులు
సాయితో మధురక్షణాలు అనువాదం చేయడానికి కాస్త సమయం తీసుకుటున్నందువల్ల మనబ్లాగులో ప్రచురణకు కాస్త ఆలస్యమవుతోంది. అధ్భుతమైన ఈ బాబా లీలను చదివి ఆ అనుభూతిని పొందండి. బాబా వారికి అన్ని విషయాలు మనము చెప్పకుండానే గ్రహించి మనకు తెలియకుండానే నివారణ కావిస్తారు. ఒక్కొక్కసారి మన సమస్య చెప్పకున్నా వారే ఆసమస్యను పరిష్కరిస్తారు.. ఈ అద్భుతమైన లీలను చేదివేముందుగా శ్రీవిష్ణుసహస్రనామం 85వ.శ్లోకం తాత్పర్యం చదవండి.
శ్రీవిష్ణుసహస్రనామం 85వ.శ్లోకం
శ్లోకం: ఉధ్భవ స్సుందర స్సుందో రత్ననాభ స్సులోచనః |
అర్కో స్వాజసన శ్శృంగీ జయంత స్సర్వ విజ్జయీ ||
తాత్పర్యం : నేత్రములతో కాంతిని అన్నివైపులకు ప్రసరింప చేయుచున్నాడు. ఆయన ఈ సృష్టిచక్రమునకు శిఖరముగా ఆహారమును పుట్టించుచున్నాడు. తన సృష్టియందలి జీవుల జయమే తానైనవాడు. ఆయన సర్వమూ తెలిసినవాడు. మరియూ సర్వమును జయించినవాడు.
శ్రీసాయితో మధురక్షణాలు - 18
చూపు క్షీణించిన కండ్లకు దృష్టిని ప్రసాదించిన సాయి
బాబా జీవించి ఉండగా ఆయనను చూసిన భక్తులలో శ్రీవిఠల్ యశ్వంత్ దేశ్పాండే కూడా ఒక గొప్ప భక్తుడు. ఎందుచేతనో ఆయన తాతగారి (తల్లివయిపు తండ్రి) కంటిచూపు మందగించింది.