02.09.2015 బుధవారం
ఓం సాయి శ్రీసాయి జయజయసాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
ఆంగ్ల రచయిత : ఆర్థర్ ఆస్ బొర్న్
తెలుగు అనువాదం: సాయిబానిస శ్రీ రావాడ గోపాలరావు
సంకలనం: ఆత్రేయపురపు త్యాగరాజు
శ్రీసాయి రామచరిత్ర - మధుర ఘట్టములు - 3
శ్రీసాయి తన భక్తురాలి ప్రాణాలు నిలపడానికి శాయశక్తులా ప్రయత్నించి విఫలమైన సంఘటన ఉన్నది. నిగోజ్ గ్రామంలో పాటిల్ భార్య ప్రేగు వ్యాధితో బాధపడుతున్నది. ఆనాటిరాత్రి శ్రీసాయి శిరిడీలో చావడిలో నిద్రపోవటానికి శ్రీమహల్సాపతితో కలిసి బయలుదేరారు. శ్రీసాయి చావడికి చేరుకొన్న తర్వాత శ్రీమహల్సాపతితో అంటారు,




