03.08.2014 ఆదివారము
ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయిబంధువులకు బాబావారి శుభాశీస్సులు
శ్రీసాయి సత్ చరిత్ర - తత్వం - అంతరార్ధం - 7వ.భాగం
ఈ రోజు సాయి.బా.ని.స. గారు చెప్పిన తత్వాన్ని మరికాస్త తెలుసుకొందాము. వినండి.
మూలం : సాయి.బా.ని.స. శ్రీరావాడ గోపాలరావు
తెలుగు అనువాదం : ఆత్రేయపురపు త్యాగరాజు
బాబా తన భక్తులను పిచ్చుక కాలికి దారం కట్టి లాగినట్లుగా తనవద్దకు రప్పించుకుంటానని చెప్పారు. దీని అర్ధమేమిటి?
మనం ఒక పిచుకను పట్టుకొని దాని కాలికి దారం కడితే అది మన చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. అది బ్రతకడానికి దానికి తిండిపెట్టి, త్రాగడానికి నీరిచ్చి రక్షించడం మన విధి.



