Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Saturday, May 9, 2020

శ్రీ సాయి సత్ చరిత్రలో నాకు కలిగిన సందేహాలు – బాబా సమాధానాలు – 8 (3)

0 comments Posted by tyagaraju on 7:50 AM
File:Shirdi Sai Baba sitting.jpg - Wikimedia Commons
         Rose PNG | HD Rose PNG Image Free Download searchpng.com
09.05.2020 శనివారమ్
ఓమ్ సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
శ్రీ సాయి సత్ చరిత్రలో నాకు కలిగిన సందేహాలు – 
బాబా సమాధానాలు – 8 (3)
    Telugu Blog of Shirdi Sai Baba,read sai leels,devotees experiences ...
ఆత్రేయపురపు త్యాగరాజు, నిజాంపేట, హైదరాబాద్
ఫోన్.  9440375411 & 8143626744
మైల్ ఐ.డి.  tyagaraju.a@gmail.com
ఈ బ్లాగులోని సమాచారాన్ని ఎవరయినా తమ బ్లాగులోనికి గాని, ఫేస్ బుక్ పేజీలోనికి గాని కాపీ చేసి పేస్ట్ చేసుకోదలచినట్లయితే ముందుగా నాకు తెలియచేయవలసినదిగా మనవి.

సందేహాలు – బాబా సమాధానాలు – 8 (2) సాయిభక్తుల స్పందన
శ్రీమతి కృష్ణవేణి, చెన్నై – ఒక యోగి ఎలా జీవించాలో అన్నిటిని బాబా వారు తను ఆచరించి చూపారు.  భక్తుల మీద ఆయనకు ఎనలేని ప్రేమ.  అలాంటి యోగిరాజు వద్ద మనమ్ వున్నందుకు ఎంతో సంతోషించాలి.  వారు చెప్పిన బాటలో నడిచేందుకు ప్రయత్నమ్ చెయ్యాలి.
శ్రీమతి కాంతి, మణికొండ, హైదరాబాద్ – నాకు ఇందులో ఒక సందేహం, యోగి ఒక ఇంట్లో భిక్ష చేసేటప్పుడు అందరూ తిన్నాకనే భిక్ష తీసుకోవాలి అని రాసారు కానీ అలా చేస్తే ఆ ఇంట్లో వారి ఎంగిలి తిన్నట్టు కదా అది ఆ గృహస్తుకు దోషం ఏమో..ఇవాళ సాయి లీలామృతంలో బాయిజా అమ్మ బాబాకి పెట్టకుండా ఏమీ తినేవారు కాదు అని రాసారు.  దానికి దీనికి సాపత్యం ఎలా అండి… 

ఇందులో గొప్పవిషయం ఒకటి..నాలాంటివాళ్ళు జీవితంలో చదవలేని నారదీయ సూత్రాలు గురించి చక్కగా అరటిపండు వలిచినట్టు చెబుతున్నారు.  ధన్యవాదాలండి.

Friday, May 8, 2020

శ్రీ సాయి సత్ చరిత్రలో నాకు కలిగిన సందేహాలు - బాబా సమాధానాలు – 8 (2)

0 comments Posted by tyagaraju on 7:21 AM
ORIGINAL PHOTOS OF SAI-N BABA FROM SHIRDI - Vasant Londhe - Medium
       Transparent Yellow Rose Clipart - Painted Images Of Yellow Roses ...

08.05.2020  శుక్రవారమ్
శ్రీ సాయి సత్ చరిత్ర సందేహాలుబాబా సమాధానలు – 8 (1) సాయిభక్తుల స్పందన.
శ్రీమతి సుమలలిత, అట్లాంటా, (అమెరికా)..  చాలా బాగుంది.
శ్రీమతి కృష్ణవేణి, చెన్నై, ..బాబాగారు 5 ఇండ్లలో భిక్ష తీసుకునే విధానం చూస్తుంటే బ్రహ్మగారు నారదమునీంద్రులవారికి చెప్పినట్టుగా ఒక యోగి ఎలా ప్రవర్తించాలో బాబా వాటిని పాటించారని అర్ధమవుతుంది.  బాబాగారు మీకు పెట్టిన పరీక్షలో నెగ్గి మంచి విషయాన్ని సేకరించారు.  బాబా గారు చిన్న విషయం ద్వారా ఎన్నో విషయాలు తెలియచేస్తున్నారు.  ప్రతి చిన్నవిషయాన్ని కూడా అందరికీ తెలియ చేయ్యాలన్న తాపత్రయం బాబాగారి పరీక్షలో నెగ్గేలా చేసింది.  మనం నెగ్గితే సంతోషపడేది వారే కదండి.  అంతా వారి దయ.  మీద్వారా ఎన్నో విషయాలు తెలియ చేస్తున్నారు మాకందరికీ.
( సమాధానం.  బాబా గారు బోధచేసే విధానం చాలా చమత్కారంగాను, నిగూఢంగాను ఉంటాయి.  తను చెప్పినవాటిని భక్తులు తమంతతామే శోధించి, అర్ధం చేసుకొని వాస్తవాన్ని గ్రహించుకునేలా తయారుచేస్తారు బాబా... త్యాగరాజు)

శ్రీమతి కాంతి, మణికొండ, హైదరాబాద్ఈ రోజు బాబా పారాయణ చేసాను.  నా స్నేహితురాలు లలితా సహస్రం చదవమంది, కానీ లాక్ డౌన్ వల్ల పనులు అయ్యేసరికి ఆలశ్యమయింది.  శ్రధ్ధగా చెయ్యలేను,  ఒకటే నమస్కారం అన్నాను నా స్నేహితురాలితో.  ఇవాళ కరెక్ట్ గా మీ బ్లాగ్ లో మూడో అధ్యాయంలో మాటలు.."నేనే జగన్మాతను, త్రిగుణముల సామరస్యం నేనే".  అమ్మవారికి ఆయనకి భేదం లేదని బాబా చెప్పినట్టు అనిపించింది.  సర్వదేవ నమస్కారం కేశవ ప్రతి గచ్చతి అన్నట్టు మళ్ళి శ్రధ్ధగా బాబా పారాయణ చెయ్యాలి అనిపిస్తోంది ఈ సందేహాలు చదివి.

శ్రీ సాయి సత్ చరిత్రలో నాకు కలిగిన సందేహాలు -  
బాబా సమాధానాలు – 8 (2)

బ్రహ్మ నారదునితో

ఎవరిఇంటినుంచయితే భిక్షను స్వీకరించడానికి తగిన అర్హత ఉన్నదో ఆయింటిలో వంట అంతా పూర్తయి  అందరి భోజనములు పూర్తయిన తరువాత మాత్రమే భిక్షను స్వీకరించాలి. తలుపులు మూసి ఉన్న ఇంటినుండి భిక్షను స్వీకరించరాదు.  తలుపు కాస్త ఓరగా వేసిఉన్న ఇంటినుండి మాత్రమే భిక్షను స్వీకరించాలి.  యోగి ఎటువంటి వాదవివాదముల జోలికి పోరాదు.  యోగికి శిష్యులు ఎవరూ ఉండరు. 

Thursday, May 7, 2020

శ్రీ సాయి సత్ చరిత్రలో నాకు కలిగిన సందేహాలు - బాబా సమాధానాలు - 8 (1)

0 comments Posted by tyagaraju on 7:52 AM

     Sai Baba of Shirdi - Wikipedia
            Single Red Rose PNG HD | PNG Mart

07.05.2020  గురువారమ్
ఓమ్ సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
శ్రీ సాయి సత్ చరిత్రలో నాకు కలిగిన  సందేహాలు – 
బాబా సమాధానాలు – 8 కి సాయి భక్తుల స్పందన
ఆత్రేయపురపు త్యాగరాజు, నిజాంపేట, హైదరాబాద్

ఫోన్.  9440375411 & 8143626744

(ఈ బ్లాగులోని సమాచారాన్ని ఎవరయినా తమ స్వంతబ్లాగులోనికి గాని, ఫేస్ బుక్ లోనికి గాని కాపీ పేస్ట్ చేసుకునే ఉద్దేశ్యం ఉన్నట్లయితే ముందుగా నాకు తెలియపరచవలసినదిగా నా మనవి...త్యాగరాజు)

శ్రీమతి కృష్ణవేణి, చెన్నై, - చాలా మంచి ప్రశ్న అడిగారు.  బాబాగారు ఆమెకు  అందే పుణ్యఫలమ్ అందకుండా పోతుందేమో అని అలా చేసారన్న విషయం ఉధ్ధవగీత శ్లోకం ద్వారా చక్కగా మనందరికి అర్ధమయ్యేలా తెలియచేసారు.
శ్రీ పార్ధసారధి, పాలకొల్లు, - నాచేత బాబా సేవ చేయించుకుంటున్నారు అనే భావన ఆమెది.  నేను సేవ చేస్తున్నాను అనే భావన తక్కినవారిది.  చక్కగా వివరించారు.  ధన్యవాదములు.
శ్రీమతి కాంతి, మణికొండ, హైదరాబాద్, - ఉధ్ధవగీత గురించి వినటమే తప్ప చదివే అవకాశం రాదు తెలుగువారికి  ఎంతో శ్రమించి ఆ గ్రంధంలో మంచి విషయాలు తెలియజేసారు.  ఆత్మానందం కలిగించే మాటలుధన్యవాదాలు.

శ్రీ సాయి సత్ చరిత్రలో నాకు కలిగిన సందేహాలు -  
బాబా సమాధానాలు - 8 (1)

శ్రీ సాయి సత్ చరిత్ర అ.9 – భిక్షయొక్క ఆశ్యకత.

సంతానము, ధనము, కీర్తి సంపాదించుటయందాపేక్ష వదలుకొని సన్యసించువారు భిక్షాటనముచే జీవించవచ్చునని మన శాస్త్రములు ఘోషించుచున్నవి.  వారు ఇంటివద్ద వంట ప్రయత్నములు చేసికొని తినలేరు.  వారికి భోజనము పెట్టు బాధ్యత గృహస్థులపై గలదు.  
 

Shirdi Sai Real Leelas

Bhjans Of Sai

Sai Prayer Club

My Blog List