18.09.2017 సోమవారమ్
ఓమ్ సాయి శ్రీసాయిజయజయ సాయి
సాయి బంధువులకు బాబా వారి శుభాశీస్సులు
సాయి లీల జనవరి - ప్రిబ్రవరి 2004 ద్వైమాస పత్రికలో ప్రచురింపబడ్డ సాయిభక్తుల అనుభవాలను కొన్నిటిని శ్రీ సాయిసురేష్ గారు పంపించారు. ఈ రోజు వాటిని ప్రచురిస్తున్నాను. ఇందులో బాబా వారి అద్భుత లీలలను గమనించండి.
సాయి ప్రసాదించిన అధ్బుత లీలలు
శ్రీ కాశీనాథ్ లతికి పడిపోయిన మాటను మళ్ళీ బాబా ప్రసాదించిన లీల
అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజది రాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై
సాయి బంధువులారా మరియు దివ్యాత్మ స్వరూపులారా అందరికీ సాయి శుభాశీస్సులు.
నా వ్యాపారంలో నా భాగ స్వామి 5 లక్షల రూపాయలకు నన్ను
మోసం చేసాడు. కోలుకోలేని దెబ్బ తగిలినట్లయింది
నాకు. నాలోని సర్వ శక్తులూ నశించిపోయాయి. ఆ దెబ్బకి నాకు మాట కూడా పడిపోయింది. అర్ధాంతరంగా నేను మూగవాడిని అయిపోయాను.
మా నాన్నగారు నాకు అన్ని
రకాల వైద్యం చేయించారు.. కానీ ఏ మందులూ నాకు నయం చేయలేకపోయినందువల్ల,
మా నాన్నగారు
నన్ను ఏదయినా పవిత్ర పుణ్య క్షేత్రానికి వెళ్ళు ఏదేవుని అనుగ్రహంతోనయినా పడిపోయిన నీ
మాట రావచ్చు అని ఏదో ఒక ప్రదేశాన్ని ఎంచుకోమని చెప్పారు.
ఇదివరకు 1927లో నేను తిరుపతికి వెళ్ళినప్పుడు షిరిడీకి వెళ్ళాను. ఇపుడు ఎటువంటి సందేహం పెట్టుకోకుండా షిరిడీకే ప్రాముఖ్యతనిచ్చి
అక్కడికే వెడతానని చెప్పాను.
నేను 1954లో షిర్డీకి వెళ్లి మూడు నెలలు అక్కడే ఉన్నాను. ఈ సమయంలో నేను బాబాకు చాలా తీవ్రంగా ప్రార్థన చేసాను. "బాబా,
నేను ఆర్ధికంగా, శారీరకంగా చాలా బాధపడుతున్నాను. దయచేసి నాకు మాటలు వచ్చేలా చేయండి!" అని గట్టిగా ప్రార్ధించాను. బాబా నా ప్రార్థన విని నా అభ్యర్థనను మన్నించారు.
శ్రీ సాయిబాబా యొక్క దయతో నాకు మాటలు వచ్చాయి. నాకు సులభంగా మాట్లాడే శక్తి వచ్చింది. తరువాత నేను ఇంటికి తిరిగి వచ్చాను. చూసిన వారందరూ ఆశ్చర్యపోయారు.
బాబా నాయందు చూపిన కృపకు కృతజ్ఞతగా నేను 1954లో జలగావ్ లో ఒక సాయిబాబా మందిరాన్ని నిర్మించాను. అప్పటినుండి నేను నేటి వరకు ఆయనను సేవ చేస్తున్నాను.
శ్రీ కాశీనాథ్ లతి,
పోలన్ పేట్
జలగావ్,
మహారాష్ట్ర
source: సాయి లీల మ్యాగజైన్ జనవరి_ఫిబ్రవరి 2004
సర్వం సాయినాథర్పాణమస్తు
శ్రీ సాయిబాబా దయతో నాకు కొత్త జీవితాన్ని ప్రసాదించారు
అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజది రాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై
సాయి బంధువులారా మరియు దివ్యాత్మ స్వరూపులారా అందరికీ సాయి శుభాశీస్సులు
ఆరోజు 31.8.1978 గురువారం..
ఆరోజు ఉదయాన్నే నా భార్య, నేను, అనారోగ్యంతో ఉన్న మా బంధువుని చూడటానికి హరి కిసాన్ దాస్ ఆసుపత్రికి వెళ్ళాము. తరువాత మేము కొన్ని ముఖ్యమయిన కాగితాలను
సమర్పించడానికి ఆదాయ పన్ను కార్యాలయానికి వెళ్ళాము.
అక్కడ నుండి లాల్ బాగ్, పరేల్ నుండి మేము నివసిస్తున్న శాంతాక్రూజ్ కు బస్సులో వెళ్దామని బస్సుకోసం చూస్తూ ఉన్నాము. అది మధ్యాహ్న సమయం, పైగా ఆరోజు ఎండవేడి చాలా ఎక్కువగా ఉంది.
కొంతసేపటి
తరువాత ఒక డబుల్ డెక్కర్ బస్సు వచ్చింది. మొదట నా భార్య బస్సు ఎక్కింది.
వెనుకవైపు ఉన్న హ్యాండిల్ పట్టుకొని నేను కూడా బస్సు ఎక్కుతూ ఉన్నాను. అంతలో బస్సు కదిలింది, దానితో పట్టు తప్పి నేను రోడ్డు మీదకు
విసురుగా పడిపోయాను. అలా పడిపోతున్నప్పుడు నేను బాబాని తలుచుకున్నాను.
అదృష్టవశాత్తు, బాబా యొక్క దయ వలన, నేను రోడ్డు మీదకి బొక్కబోర్లా పడిపోయినప్పటికీ నా తల రోడ్డుకు గుద్దుకోలేదు. నా భార్య , ఇతర ప్రయాణీకుల అరుపులతో బస్సు ఆగింది. అప్పటికే బస్సు నేను పడిన స్థలం నుండి ఇరవై అడుగుల దూరం దాకా వెళ్లిపోయింది.
నా భార్య మరియు కొంతమంది ప్రయాణీకులు నేను చనిపోయానేమో లేక శరీర భాగాలపై పలు గాయాలు తగిలి ఉంటాయేమోనని అని అనుకుంటూ నా వైపు పరుగెత్తుకుంటూ వచ్చారు. కానీ బాబా యొక్క కృపతో, అక్కడ నేను ఎటువంటి గాయం లేకుండా బ్రతికే ఉన్నాను.
బాబా యొక్క దయ వలన ఒక్క వాహనం కూడా బస్సు వెనుక రాలేదు. ఒకవేళ బస్సు వెనుక ఏదయినా వాహనం వస్తూ
ఉండి ఉంటే నేను ఆ వాహనాల కింద పడి తీవ్రంగా నుజ్జు నుజ్జు అయిపోయే వాడిని. ఆ రోజు నాకు మరియు నా కుటుంబానికి ఒక గొప్ప రోజు. ఆరోజు శ్రీ సాయిబాబా దయతో నాకు కొత్త జీవితాన్ని ప్రసాదించారు.
శ్రీ అరవింద్ జె మెహతా
ముంబాయి
source: సాయి లీల మ్యాగజైన్ జనవరి_ఫిబ్రవరి 2004
సర్వం సాయినాథర్పాణమస్తు
నిజమయిన భక్తుల కోసం బాబా స్వయంగా వ్యక్తమవుతారు
అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజది రాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై
సాయి బంధువులారా మరియు దివ్యాత్మ స్వరూపులారా అందరికీ సాయి శుభాశీస్సులు
అహ్మదాబాద్ నివసితులైనా శ్రీ చందూలాల్ మరియు శ్రీమతి చందూలాల్ కి బాబా స్వయంగా వ్యక్తమయి అందించిన సహాయం
1953 ఫిబ్రవరి నెలలో నా భార్య శ్రీమతి. మనుబాయ్ తన స్నేహితురాళ్ళతో కలిసి తెర్కాన్ భువన్ లో ఉన్న శ్రీ సాయిబాబా మందిరానికి వెళ్ళింది. కులం, మతం, మతాచారలతో సంబంధం లేకుండా బాబా తన భక్తుల కోరికలను నెరవేరుస్తారని ఆమె స్నేహితురాళ్ళు ఆమెతో చెప్పారు.
మరుసటి గురువారంనాడు నా భార్య మా చిన్న కుమారుడు ఒక కొబ్బరికాయ తీసుకొని సాయంత్రం ఆరతి సమయంలో అదే మందిరానికి వెళ్ళారు. ఆరతి తరువాత ఆలయం పూజారి వివిధ రకాలతో కూడిన ప్రసాదాన్నిఅందరికీ పంచారు.
నా భార్యకు ప్రసాదంగా కొన్ని వేరుశనగలు లభించాయి. కానీ కొందరికి పేఢాలు ప్రసాదంగా ఇచ్చారు. నా భార్యకి కాస్త నిరాశ
కలిగింది. తరువాత ఆమె కవీశ్వర్ పోల్ నాకా మీదుగా ఇంటికి తిరిగి వస్తూ ప్రత్యేకించి కొంతమందికి మాత్రమే పేఢాలు ఇచ్చారని, దారిలో ఆలోచిస్తూ
ఉంది. అలా వస్తూ ఉండగా దారిలో ఆమెకు ఒక అపరిచిత వ్యక్తి ఎదురయి తన చేతిలో ఉన్న సంచీలోనుండి "మీ భర్త ఈ ప్రసాదం పంపించారు. ఈ ప్రసాదాన్ని మీ సంచిలో ఉంచండి!" అని అతను ఆమె సంచిలో ప్రసాదం పెట్టి వెళ్ళిపోయాడు.
ఆ సమయంలో నేను ఆఫీస్ లో ఉన్నాను. నేను ఇంటికి చేరుకోగానే, ఒక అపరిచితుని ద్వారా నేను పంపించిన ప్రసాదం గురించి చెప్పింది. నేను ఆశ్చర్యపోయాను, నాకు దాని గురించి ఏమీ తెలియదని నేను ప్రసాదం
పంపించలేదని చెప్పాను. నా భార్య కోరికను నెరవేర్చడానికి అది బాబా చేసిన లీల అని మేము గ్రహించాము. ఈ సంఘటన తర్వాత మేము సాయి భక్తులమయ్యాము.
1948 లో, నేను మా అన్నయ్య శ్రీ నవీన్ ఎం. మెహత వివాహాన్ని జరిపించాను. వివాహ ఖర్చులకోసం నేను రూ. 50,000 / - అప్పు
చేసాను. ప్రతి నెల నా జీతం నుండి కొంత అప్పు తిరిగి చెల్లిస్తూ ఉన్నాను. అతనికి ఉద్యోగం లేని కారణంగా ఎవరూ తమ కుమార్తెను అతనికిచ్చి వివాహం చేయడానికి ముందుకు రాలేదు. అందువలన మా అన్నయ్యకన్నా ముందు
నాకు వివాహం జరిగింది.
గుజరాతీ జనసత్తా వార్తాపత్రికలో క్రాస్ వర్డ్ పజిల్ పూర్తిచేసి పంపిస్తూ ఉండటం నా
భార్యకు అలవాటు. 1953 ఏప్రిల్ లో తను 6వ నెంబర్ పజిల్ ను పూర్తిచేసి పంపించింది. అప్పటికి
నేను తీసుకున్న 50 వేల రూపాయల అప్పుకి ఇక రూ. 3,333 / - మాత్రమే బాకీ చెల్లించాల్సి ఉంది. బాబా యొక్క దయ వలన నా భార్యకు ఆ పజిల్ వల్ల ఒక రూపాయి ఎక్కువ గాని, తక్కువ గాని కాకుండా సరిగ్గా రూ. 3,333 / - బహుమతి వచ్చింది. నన్ను ఋణ విముక్తుడిని
చేయడానికి శ్రీ సాయిబాబా చేసిన అద్భుతం కాదూ ఇది?
1953 భాద్రపదమాసములో మానాన్నగారిది మరియు మా మామగారిది ఇద్దరి సంవత్సరికాలు ఒకే రోజున వచ్చాయి. నేను ఆఫీస్ కి వెళ్ళవలసి ఉండటం వలన, మా అత్తగారి ఇంటికి ఆ రోజున నేను వెళ్ళలేకపోయాను.
నా పిల్లలు స్కూల్ లో ఉన్నారు. సుమారు సాయింత్రం 4 గంటలకు మా మామగారి పోలికలతో ఉన్న ఒక వ్యక్తి మా ఇంటికి వచ్చి, నా భార్యకు ఒక ఖాకీ రంగు బ్యాగ్ ఇచ్చి వెళ్లిపోయాడు.
ఆ బ్యాగ్ లో కొన్ని కూరగాయలు, ఊధి మరియు రూ. 1.25 పైసలు / - ఉన్నాయి. నేను ఇంటికి వచ్చిన తరువాత నా భార్య నాకు ఈ విషయం చెప్పింది. 1950 లో జైపూర్ లో చనిపోయిన మా మామయ్యగారు 1953 లో అహ్మదాబాద్ లో ఉన్న మా ఇంటికి ఎలా వచ్చారని నేను ఆశ్చర్యపోయాను! ఇది బాబా యొక్క అద్భుతమైన లీలా కాదు కదా? అనుకున్నాను.
1954లో నేను నా కుటుంబంతో ఒక రోజు షిర్డీలో ఉండి తిరిగి వచ్చేయాలనే ఉద్దేశ్యంతో షిర్డీ వెళ్ళాను. కానీ భారీ వర్షాల కారణంగా నేను షిర్డీలో మూడు రోజులు ఉండిపోవాల్సి వచ్చింది. నేను అహ్మదాబాద్ తిరిగి వచ్చిన తర్వాత, బాబా యొక్క సన్నిహిత భక్తుడైన సాయి శరణానంద గారిని కలుసుకోవడానికి నాకు మంచి అవకాశం లభించింది. నేను అప్పుడప్పుడు ఆయన్ని సందర్శిస్తూ త్వరలోనే ఆయనకీ ధృడమైన భక్తుడిని అయ్యాను. నా భార్య స్వామిజీకి రోజూ భిక్ష ఇచ్చేది.
తమ భక్తుల షిర్డీ రాకకై బాబాయే స్వయంగా టికెట్లు అందించిన అద్భుత లీల
అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజది రాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై
సాయి బంధువులారా మరియు దివ్యాత్మ స్వరూపులారా అందరికీ సాయి శుభాశీస్సులు
అహ్మదాబాద్ నివసితులైనా శ్రీ చందూలాల్ మరియు శ్రీమతి చందూలాల్ కి బాబా స్వయంగా అందించిన సహాయం
1958లో స్వామిజీ(సాయి శరణానంద) ముంబాయికి వెళ్ళినప్పుడు, నా భార్య దాదర్ మీదుగా షిర్డీ వెళ్ళింది. రైల్వే స్టేషన్ ప్రయాణీకులతో కిటకిటలాడుతూ ఉంది. ఆమెకు కూర్చోవడానికి ఒక్క సీటు కూడా లేని పరిస్థితి అది.
ఆ సమయంలో ఒక వృధ్ధుడు ఆమె వద్దకి వచ్చి ఒక దుప్పటిని ఇమ్మని అడిగాడు.. మొదట ఆమెకు కాస్త సందేహాస్పదంగా ఉన్నప్పటికీ ఆమె అతనికి దుప్పటి ఇచ్చింది. వృద్ధుడు అది తీసుకొని గుంపులో అదృశ్యమయ్యాడు.
కొంతసేపటి తర్వాత రైలు ప్లాట్ ఫారంకి వచ్చిన తరువాత అతను ఆమె వద్దకు వచ్చి ఫలానా బోగీ లోకి వెళ్ళమని చెప్పాడు. ఆమె ఆ బోగీ లోకి వెళ్లినప్పుడు, అక్కడ ఆమె ఇచ్చిన దుప్పటీ ఉంది.
ఆ వృద్దుడు ఆమె సామాను బోగీలో పెట్టడానికి సహాయం చేసాడు. ఆమె అతనికి డబ్బు ఇవ్వడానికి ప్లాట్ ఫారమ్ వైపు చూసినప్పుడు, అతను ఏమి అడగకుండానే వెళ్ళిపోయాడు. ఇది బాబా యొక్క అద్భుతం. బాబానే స్వయంగా ఆ రూపంలో వచ్చి ఆమెకు సహాయపడ్డారు.
1980 లోమార్చి 10 ,15వ తేదీల మధ్య ఒకరోజున సిల్కు
చొక్కా, ధోవతిని ధరించిన ఒక వ్యక్తి మధ్యాహ్నం 2 నుండి 4 గంటల మద్య వచ్చాడు. అతను నా భార్యకు ఒక ప్యాకెట్ ఇచ్చాడు. నా భార్య అతనిని కొంచెం
సేపు వేచి ఉండమని అడిగింది. కానీ అతను ఏమి చెప్పకుండానే వెళ్ళిపోయాడు.
తరవాత ఆమె ప్యాకెట్ తెరిచి చుస్తే అందులో మా కుటుంబ సభ్యుల పేర్లతో నవ జీవన్ ఎక్ష్ ప్రెస్ కి అహ్మదాబాద్ నుండి మన్మాడ్ వరకు నాలుగు ఫుల్లు, ఒక అర రైల్వే రిజర్వేషన్ టిక్కెట్లు ఉన్నాయి. నేను ఆఫీస్ నుండి వచ్చిన తరువాత, నా భార్య వాటిని నాకు ఇచ్చింది. వాటిని చూసి నేను ఆశ్చర్యపోయాను. రైల్వే స్టేషన్ కి వెళ్ళి ఆ టికెట్స్ నిజమయినవా కాదా అని అడిగిన మీదట అవి సరైనవే అని తెలిసెంది.
నాకు కచ్చితంగా తెలుసు ఆ వ్యక్తి రూపంలో వచ్చి ఆ టికెట్స్ ఇచ్చినది బాబా వారే. నేను వాటి విషయమై సాయి శరణానందజీని అడిగాను. బాబా కోరిక ప్రకారం షిరిడీకి వెళ్ళమని ఆయన నాకు సలహా ఇచ్చారు. ఆవిధంగా ఆ టిక్కెట్లపై మేము మన్మాడ్ మీదుగా షిర్డీకి వెళ్ళాము.
మళ్ళీ 1981లో, మార్చి 10, 15వ తేదీల మధ్య, మధ్యాహ్నం 2 నుండి 4 గంటల మద్య ఒక వ్యక్తి మా ఇంటిలో ఒక ప్యాకెట్ విసిరీసి వెళ్ళాడు.
మా నాన్నగారు దానిని తెరిచి చూస్తే, అందులో అహ్మదాబాద్ నుండి మన్మాడ్ కి నాలుగు ఫుల్లు, ఒక అర
రైల్వే రిజర్వేషన్ టిక్కెట్లు, వాటితో పాటు ఉదీ కూడా కనిపించాయి. బాబా కోరిక ప్రకారం మళ్ళీ మేము మన్మాడ్ మీదుగా షిర్డీ వెళ్ళాము.
1982లో మూడవ సారి మార్చి 12 వ తేదీన 2 గంటల నుండి 4 గంటల మద్య ఒక రిక్షావాలా లాంటి వ్యక్తి వచ్చి నా భార్యకు ఒక ప్యాకెట్ ఇచ్చాడు. ఆమె దానిని తెరిస్తే అందులో అహ్మదాబాద్ నుండి మన్మాడ్ వరకు మళ్ళీ నాలుగు ఫుల్లు, ఒక అర రిజర్వేషన్ టిక్కెట్లు ఉన్నాయి. ఆ టిక్కెట్లతో మేము మళ్ళి మన్మాడ్ మీదుగా షిర్డీ వెళ్ళాము.
1983 మార్చ్ 15న నా భార్య, కుమార్తె సాయి శరణానంద గారి సమాధి దర్శనానికి వెళ్లారు. ఆయన 1982 ఆగష్టు 25న సమాధి చెందారు. వారు అక్కడ పూజారికి ప్రసాదం ఇచ్చారు. అతను అక్కడ ఉన్న తెల్లటి ప్లాస్టిక్ జార్ నుండి ప్రసాదం ఇచ్చినప్పుడు,అతని చేతికి ఒక ప్యాకెట్ వచ్చింది. దానిని నా భార్యకు ఇచ్చాడు.
దానిని తెరిచి చూసినప్పుడు అహ్మదాబాద్ నుండి మన్మాడ్ వరకు నాలుగుఫుల్లు, ఒక అర
1983 ఏప్రిల్
౩౦ వ. తేదీకి రిజర్వు చేయబడిన టిక్కెట్ ఉంది.
ఈ సారి
టిక్కెట్ లో నా పేరుకు బదులుగా మా అబ్బాయి పేరు నితిన్ C. మెహతా ఉంది.
నేను గత మూడు సంవత్సరాలుగా ఈ టికెట్లను 1980,
1981, 1982 లలో ఉపయోగించి షిర్డీ సందర్శించాను. ఈసారి బాబా ప్రసాదంగా ఈ టికెట్లను దాచుకోవాలని నేను నిర్ణయించుకున్నాను.
అందువలన మేము నా సొంత ఖర్చులతో 1983, ఏప్రిల్
30న షిరిడీకి వెళ్ళాం.
మార్చ్ 15, 1983 నుండి ఈ టిక్కెట్లను నేను భద్రంగా దాచుకొన్నాను. అహ్మదాబాద్ నుండి మన్మాడ్ కి నవజీవన్ ఎక్స్ ప్రెస్ కి బాబా నాకు ఇచ్చిన టిక్కెట్ ను ఆయన ఇచ్చిన
ప్రసాదంగా నేను భద్రంగా దాచుకున్నాను. బాబా మాకు ప్రసాదించిన టిక్కెట్ ప్రకారం మాకు
S 13 లో 55 నుంచి 59 వరకు వచ్చిన సీట్ల వివరాలు.
ప్రయాణ తేదీ 30.04.1983.
Journey to commence on 30.4.1983.
Railway
Railway Name Compartment
Reservation
Fare
No. S13
Ticket No.
Ticket No. &
Seat No.
59083
3623 Nitin C.
Mehta 55
59084
3624 Manubai Mehta 56
59085
3625 Vihangini
Mehta 57
59086
3626 Chaki@Anita
Mehta 58
59087
00453 child Baba (Rachit) 59
SHRI CHANDULAL M. MEHTA
KADIA KAVEESWAR POLE,
NEAR BALA HANUMAN
HOUSE NO. 579,
AHMEDABAD,
GUJARAT.....
(ఇంకా ఉన్నాయి)
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment