19.09.2017 మంగళవారమ్
ఓమ్ సాయి శ్రీసాయిజయజయ సాయి
సాయి బంధువులకు బాబా వారి శుభాశీస్సులు
సాయి లీల జనవరి - ప్రిబ్రవరి 2004 ద్వైమాస పత్రికలో ప్రచురింపబడ్డ సాయిభక్తుల అనుభవాలను కొన్నిటిని శ్రీ సాయిసురేష్ గారు పంపించారు. ఈ రోజు వాటిని ప్రచురిస్తున్నాను. ఇందులో బాబా వారి అద్భుత లీలలను గమనించండి.
సాయి ప్రసాదించిన అధ్బుత లీలలు - 2
5.సాధారణ అలవాటును తప్పకూడదన్నదే బాబా సంకల్పం
అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజది రాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై
సాయి బంధువులారా మరియు దివ్యాత్మ స్వరూపులారా అందరికీ సాయి శుభాశీస్సులు
1962 సెప్టెంబరు నెలలో నాగపూర్ లో జరిగిన L.I.C. ఆఫీసర్స్ శిక్షణా కార్యక్రమానికి హాజరైన తరువాత నేను షిర్డీ బయలుదేరాను. నా భార్య నన్ను మన్మాడ్ లో కలుసుకుంది. అక్కడి నుండి నా భార్య, నేను షిర్డీ వెళ్లి సమాధి మందిరంలో బాబా దర్శనం చేసుకున్నాము.
సాదారణంగా మేము ప్రతి సంవత్సరం మార్చి, అక్టోబర్ నెలలో షిర్డీ సందర్శిస్తూ ఉంటాము. కానీ ఈ సారి సెప్టెంబర్ నెలలో షిర్డీ సందర్శించినందు వలన మళ్ళీ అక్టోబరులో షిర్డీ సందర్శించకూడదు అని మేము నిర్ణయించకున్నాము. ఇది మా నిర్ణయమే అయినప్పటికీ, బాబా తలంపు వేరే విధంగా ఉన్నది. మా అలవాటు ప్రకారం మేము అక్టోబరులో కూడా షిర్డీ సందర్శించాలి అన్నది బాబా అభిప్రాయం. ఇది ఎలా జరిగిందో, క్రింది సంఘటన వెల్లడిస్తుంది.
1962, అక్టోబరు నెల శరద్ పూర్ణిమ రోజు. మా అల్లుడు, అతని స్నేహితులు కొందరు శరద్ పూర్ణిమ రాత్రిని ఆస్వాదించడానికి మూడు కార్లలో పిక్నిక్ కి బయలుదేరి వెళ్ళారు. మొదట వారు జుహు బీచ్ కి వెళ్లి, తర్వాత ఖండాలా సమీపంలోని ఖోపోలి వెళ్లారు.
(జుహు)
(ఖోపోలి)
రెండు చోట్ల వారు సరదాగా గడిపి మరుసటి రోజు వేకువజామున ఖోపోలి నుండి ముంబాయికి తిరిగి బయలుదేరారు.
వారు థానేకి దగ్గరగా రాగానే వారి కారు అదుపుతప్పి ఒక కాలువలో పడిపోయింది. అదృష్టవశాత్తూ అదే సమయంలో ఒక పోలీసు వ్యాన్ అటుగా వెడుతూ కాలువలో పడిన కారు చూసారు. అంతకుముందు ఈ పోలీస్
వాన్ ని ఓవర్ టేక్ చేస్తూ వెళ్ళారు. పోలీసులు వెంటనే అవసరమైన సహాయం అందించి, గాయపడిన వారిని మొదట థానే సివిల్ ఆసుపత్రికి తీసుకువెళ్ళి, అక్కడ ప్రధమ చికిత్స అనంతరం ముంబాయిలోని హరి కిసాన్ దాస్ హాస్పిటల్ కి తీసుకువెళ్లారు.
మా అల్లుడి సోదరుడు మాకు ఉదయం 10 గంటల సమయంలో ఈ వార్తను తెలియచేసాడు. కానీ అతను పూర్తి వివరాలు చెప్పలేకపోయాడు. ఈ వార్త విన్న తర్వాత, నేను చాలా గాభరా పడ్డాను. నా భార్య నన్ను ముందు గాభరా పడకండి, "మనం మన బాబాని ప్రార్థించటం మొదలుపెడుదాం. మన అల్లుడిని కాపాడమనే మన ప్రార్థనను ఖచ్చితంగా బాబా వింటారు, బాబా ఎల్లప్పుడూ తన భక్తుల ఆనందం కోసం శ్రద్ధ
వహిస్తారు" అని చెప్పింది.
మేము హరి కిసాన్ దాస్ ఆసుపత్రి చేరి చూస్తే గొప్ప ఆశ్చర్యం! మా అల్లుడికి మరీ అంత పెద్ద గాయాలు తగలలేదు. అతను ఒక వారం లోపల కోలుకొన్నాడు. స్టీరింగ్ వ్హీల్ దగ్గర ఉన్న అతని స్నేహితుడు మాత్రం దురదృష్టవశాత్తు మరణించాడు. మిగిలిన స్నేహితులకి పెద్ద పెద్ద గాయాలు తగిలాయి. వారందరికి అంత పెద్ద గాయాలు తగిలినా మా అల్లుడు మాత్రం చిన్న గాయలతో బయటపడి త్వరగా కోలుకోవడం బాబా యొక్క కృపతో జరిగిన అద్భుతం.
ఒక వారంలోనే మా అల్లుడు కోలుకున్న తర్వాత అతని జీవితాన్ని కాపాడినందుకు బాబా వారికి మా కృతజ్ఞతలు తెలుపుకోవడానికి మేము అందరం షిర్డీకి వెళ్ళాము. అలా మేము ప్రతి సంవత్సరం అక్టోబర్ లో షిర్డీ సందర్సన చేసే మా సాధారణ అలవాటును తప్పకూడదనే బాబా సంకల్పం నెరవేరింది.
శ్రీ అరవింద్ జె మెహతా,
56, టాగూర్ రోడ్,
శాంతాక్రూజ్ (W),
ముంబాయి.
source: సాయి లీల మ్యాగజైన్ జనవరి_ఫిబ్రవరి 2004
సర్వం సాయినాథర్పాణమస్తు
బాబా దయవల్ల బాలుడి కుంటితనం నయమగుట
అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజది రాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై
సాయి బంధువులారా మరియు దివ్యాత్మ స్వరూపులారా అందరికీ సాయి శుభాశీస్సులు
1956 సంవత్సరంలో ఒక ఉపాధ్యాయిని గారి అబ్బాయి SSC పరీక్షలు వ్రాస్తున్నాడు. ఆమె
వితంతువు. ఆ అబ్బాయి ఆఖరి పరీక్ష వ్రాసిన తరువాత ఇంటికి తిరిగి వచ్చాక, తీవ్రమయిన జ్వరం వచ్చింది. మంచి వైద్యం చేయించడం వల్ల అబ్బాయి జ్వరం తగ్గింది; కానీ ఆ అబ్బాయికి కాళ్ళలో శక్తిని కోల్పోవడంతో లేచి నిలబడి లేకపోయేవాడు. ఎక్కడైనా వెళ్ళాలంటే అతడిని ఎత్తుకొని తీసుకువెళ్ళాల్సివచ్చేది.
ఎన్నో ప్రయత్నాలు చేసారు కానీ, అన్ని రకాల వైద్యాలు నిరర్ధకమయ్యాయి. అటువంటి సమయంలో శ్రీ సాయిబాబా యొక్క మహిమల గురించి విన్న ఆవిడ తన కుమారుడిని షిర్డీకి తీసుకువెళ్ళింది. ఆవిడ అబ్బాయిని ఒక కూలీ వాని భుజంపై కూర్చోబెట్టి సమాధికి ప్రదక్షిణ చేయిద్దామనుకుంది.
కాళ్ళు చచ్చుబడి నడవలేకున్న
తన అశక్తతకి ఎంతో సిగ్గుపడిపోయేవాడు. ఒక కూలీవాని
భుజాలపై బాబా సమాధికి వెళ్ళేకన్నా, వాడాలో ఉండిపోవడమే మంచిదనుకున్నాడు. అందుచేత తల్లి
ఒక్కత్తే బాబా సమాధి వద్దకు వెళ్ళి తన కుమారునికి నయం చేయమని బాబాను ప్రార్ధించుకుంది. ఆవిధంగా రెండు రోజులు సమాధి మందిరానికి వెళ్ళింది.
మూడవ రోజు షిర్డీ నుండి తిరుగు ప్రయాణం అవుతుండటంతో చివరిసారిగా ఆమె సమాధి మందిరంలో హారతికి హాజరయ్యి బాబాకి ఆఖరుసారి నమస్కారం చేసుకుంది. అదే సమయంలో వసతి గృహంలో ఉన్న బాలుడి ముందు బాబా కనిపించి "ధైర్యం వహించు!" అని చెప్పారు. తర్వాత ఆయన బాలుడికి తన చేయిని అందించి, మందిరంలోకి తీసుకోని వెళ్లారు. అక్కడ ఆ అబ్బాయిని ఒక స్తంభానికి ఆనించి నిలబెట్టారు.
ఆరతి అయిన తర్వాత ఆమె వసతి గృహానికి వెళ్లి చూస్తే గదిలో కొడుకు కనిపించలేదు. కన్నీరు నిండిన కళ్ళతో ఆమె మరోసారి సమాధి మందిరానికి వచ్చి తన కుమారునికి నయం చేయమని బాబాని ప్రార్ధించుకుంది.
ఆ తరువాత
తిరిగి వస్తుండగా ఆమె దృష్టి స్థంభం వద్ద నిలబడి ఉన్న తన కుమారుని మీద పడింది. నువ్వు ఇక్కడికి ఎలా రాగలిగావు అని ఆమె అడిగింది.
తాను అక్కడికి రావటానికి బాబా ఏవిధంగా సహాయం చేసారో ఆ అబ్బాయి వివరించాడు, కానీ తల్లి నమ్మలేక పోయింది. తరువాత ఆమె సహాయంతో అతను గది వరకు నడిచి వెళ్ళగలిగాడు. ఆమె మనస్సు ఆనందంతో ఉప్పొంగిపోయింది. బాబా చూపిన కరుణకు ఆమె మనఃస్పూర్తిగా బాబాకు కృతజ్ఞతలు చెప్పుకుంది.
తరువాత బాబా అనుగ్రహం వలన ఆ అబ్బాయి ఒక నెలలోనే పూర్తిగా కోలుకొని ఎవరి సహాయం లేకుండా నడవగలిగాడు.
source: సాయి లీల మ్యాగజైన్ జనవరి_ఫిబ్రవరి 2004
సర్వం సాయినాథర్పాణమస్తు(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment