11.11.2014 మంగళవారం
ఓం సాయి శ్రీసాయి జయజయసాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
గృహస్థులకు సాయి సందేశాలు - 6వ.ఆఖరిభాగం
ఆంగ్ల మూలం: సాయిబానిస శ్రీరావాడ గోపాలరావు
తెలుగు అనువాదం : ఆత్రేయపురపు త్యాగరాజు - 9440375411
హైదరాబాద్
ఈ రోజు సాయి బానిస గారు చెపుతున్న గృహస్థులకు సాయి సందేశాలు వినండి.
ముందుగా సాయిప్రేరణ : 4వ.వాక్యం
ఒక్కసారి నావైపు ఒక్క అడుగువేసి చూడు, నిన్ను ఎల్లప్పుడు అన్ని వేళలా కాపాడుతాను.
పిల్లలకు మంచి భవిష్యత్తు కలగాలనే ఉద్దేశ్యంతో తల్లి పూజలు, వ్రతాలు, నోములు చేస్తుంది. వాటిఫలితం ఉద్యాపన అంటే అన్నదానాలు చేసినప్పుడే లభిస్తుంది.
ఈవిషయానికి సంబంధించి శ్రీసాయి సత్ చరిత్రలోని ఒక విషయాన్ని గుర్తుకు తెచ్చుకొందాము. శ్రీ బీ.వీ.దేవ్ గారి తల్లి 25, 30 నోములు నోచుకొంది. తరువాత శ్రీవీ.బీ.దేవ్ గారు మామల్తదారు అనగా తహసీల్ దారు ఉద్యోగం చేసుకొంటూ తల్లి మాటను గౌరవించడానికి ఆమె నోచిన నోములన్నిటికీ ఉద్యాపన అనగా అన్నదానం చేసి తల్లి ప్రారంభించిన మంచి పనులను పూర్తి చేశారు.



