05.12.2019 ఆదివారమ్
ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
శ్రీ సాయి సత్ చరిత్రకు అందని రహస్యాలు – 8 వ.భాగమ్
శ్రీ సాయి సత్ చరిత్రలో కష్టానికి కూలి అనే సంఘటన గుర్తుచేసుకొందాము. బాబావారు ద్వారకామాయిలో ఒక రోజున నిచ్చెన తెచ్చిన కూలీవానికి రెండురూపాయలు కూలి ఇచ్చారు. ఈవిషయము 18 & 19 అధ్యాయములో వివరముగా హేమాద్రిపంత్ వ్రాసారు.
ఇదే విషయాన్ని శ్రీసాయిబానిసగారు 26.10.2019 నాడు తెల్లవారుజామున ధ్యానములో బాబాగారిని అడిగారు. బాబా చెప్పిన వివరాలు సాయిబానిసగారికి కన్నీరు తెప్పించింది. ఆయన చాలా బాధతో ఆవివరాలు నాకు తెలియచేసారు.



