Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Friday, June 22, 2018

శ్రీ సాయిబాబా నేటికీ సజీవంగానే ఉండి సహాయం చేస్తున్నారా? 3 వ.భాగమ్

0 comments Posted by tyagaraju on 3:41 PM
         Image result for images of shirdi sai baba
                   Image result for images of rose hd

22.06.2018 శుక్రవారమ్
ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
ఈ రోజు మాతాజీ కృష్ణాబాయి గాఅరి మరికొన్ని అనుభవాలు చదవండి...

శ్రీ సాయిబాబా నేటికీ సజీవంగానే ఉండి సహాయం చేస్తున్నారా?  3 .భాగమ్

మద్రాసు ప్రభుత్వంలోని మాజీ మంత్రి  శ్రీ ఎమ్.బి.వెంకటరత్నంగారు కూడా ఆమె పూజలు చూడటానికి వచ్చారు.  ఒకసారి ఆమె ఒక విధంగా మగతలో ఉన్నట్లుగా ఆయనని ఈ విధంగా అడిగింది.  “ఫలానా తేదీ, ఫలానా రోజున నీయింటికి అన్నం పెట్టమని ఎవరో వస్తే అతనిని తరిమేయలేదా?  ఆశ్రయం కోరివస్తే అతనికి ఆశ్రయమివ్వకుండా పంపించావా లేదా? అని ప్రశ్నించి మరలా బాబా ఆమె ద్వారా “అతను అక్కడినుండి వెళ్ళిపోతూ నిన్ను రెండురూపాయలు అడగలేదా?” అని ప్రశ్నించారు. 

Wednesday, June 20, 2018

శ్రీ సాయిబాబా నేటికీ సజీవంగానే ఉండి సహాయం చేస్తున్నారా? 2 వ.భాగమ్

0 comments Posted by tyagaraju on 6:17 PM
Image result for images of shirdi sai baba
Image result for images of rose hd


20.06.2018  బుధవారమ్
ఓమ్ సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు


కృష్ణాబాయిగారికి సాయిబాబా వారు చూపించిన అధ్భుతమయిన లీలలు తరువాయి భాగమ్ ఈ రోజు చదివి భక్తి పారవ్శ్యంలో ఆనందించండి.  ఈ అధ్భుతమయిన లీలలు సాయిలీలా.ఆర్గ్ నుండి సేకరింపబడినది.

శ్రీ సాయిబాబా నేటికీ సజీవంగానే ఉండి సహాయం చేస్తున్నారా?  2  .భాగమ్
తెలుగు అనువాదమ్ - ఆత్రేయపురపు త్యాగరాజు, అట్లాంటా (అమెరికా నుండి)
ఫోన్ నంబర్ :  1 571 594 7354

అర్ధరాత్రి 12 గంటలవేళ ఆమె గదిలో మళ్ళీ కొన్ని సంభాషణలు వినిపించాయిఆమె భర్త మేడమీదకు వెళ్ళి చూస్తే ఆమె భగవద్గీతలోని కొన్ని శ్లోకాలను చదువుతూ ఉంది.   అవి ……

భగవద్గీత        .    4  శ్లో        7          యదాయధాహి ధర్మశ్య
                      అ.   4  శ్లో          8          పరిత్రాణాయ సాధూనాం
                      అ.   5  శ్లో       22           అనన్యాశ్చింతయంతోమాం 
                      అ. 18  శ్లో      66            సర్వధర్మాన్ పరిత్యజ్య


రాఘవేంద్రస్వామి ఈ భగవద్గీత శ్లోకాలన్నిటినీ కంఠస్థం చేయమని చెప్పారు.  నాకు సంస్కృతం రాదని చెప్పింది ఆవిడ.  కాని రాఘవేంద్రస్వామి ఆమెకు ఆ నాలుగు శ్లోకాలను నేర్పి, ఇాంకా భగవద్గీతలోని కొన్ని భాగాలకు కూడా అర్ధాన్ని వివరించారు.  తులసి ఆకులు, బిల్వపత్రాలతోపాటుగా మరొక మూడు వస్తువులను తన తలగడ క్రింద రాఘవేంద్రస్వామి, బాబావారు ఉంచారని శేషరిగిరిరావుగారితో చెప్పింది.  వాటిని తీసి చూడమని చెప్పింది.  

Monday, June 18, 2018

శ్రీ సాయిబాబా నేటికీ సజీవంగానే ఉండి సహాయం చేస్తున్నారా? - 1 వ.భాగమ్

0 comments Posted by tyagaraju on 6:16 PM








   





Image result for images of rose

19.06.2018 సోమవారమ్
ఓమ్ సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

ఈ రోజు బాబా వారి మరొక అధ్బుతమయిన లీలలగురించి తెలుసుకుందాము.  మానవునికి కష్టాలు ఎదురయినపుడే భగవంతుడు గుర్తుకు వస్తాడు.  అప్పుడు ప్రతి దేవుడికి అనేక మొక్కుకు మొక్కుకుంటాడు.  అవసరం మానవుడిని భగవంతుడిని ప్రార్ధించేలా చేస్తుంది.  ఇక కష్టాలు తీరిపోగానే భగవంతుడిని మర్చిపోతాడు.  ఆవిధంగా కాకుండా నిరంతరం మనం భగవంతుడిని స్మరించుకుంటూనే ఉండాలి.  బాబా నేటికీ సజీవంగానే ఉండి సహాయపడుతున్నారా అన్న ప్రశ్నకు సమాధానమే ఈ రోజు మీరు చదవబోయేది.   సాయిలీలా.ఆర్గ్ నుండి సేకరించబడినది.

తెలుగు అనువాదమ్ :  ఆత్రేయపురపు త్యాగరాజు, అట్లాంటా (అమెరికా)
1 571 594 7354

శ్రీ సాయిబాబా నేటికీ సజీవంగానే ఉండి సహాయం చేస్తున్నారా? 1 వ.భాగమ్

దేశంలో ఎంతోమందికి ఉత్పన్నమయే పైన ఉదహరించిన ప్రశ్నకు, జిజ్ఞాసతో మరెన్నిటినో అడిగేవాటికి సంతృప్తికరమయిన సమాధానాలు సాయిబాబా తెలియచేస్తూ ఉంటారు.  ఆ ప్రశ్న సామాన్యంగా ఏదో కుతూహలంతో తెలుసుకోవడానికి వేసిన ప్రశ్న కాదు.  అవసరాన్ని బట్టి ఆ ప్రశ్న ఉదయిస్తూ ఉంటుంది.  కష్టాలనెదుర్కొనేవాళ్ళు వేలమంది ఉంటూ ఉంటారు.  అటువంటి సమయంలో తమ కష్టాలను రూపుమాపి తమను ఆదుకునేవారు ఎవరున్నారా అని నలుదిశలా దృష్టి సారిస్తూఉంటారు.  ఆదుకోవడానికి భగవంతుడు లేడా?  సాధుపుంగవులు లేరా,  ఏదయినా మంత్రం ఉందా,  న కష్టాలు తీరడానికి మరేదయినా మార్గం ఉందా  అని  ఈ విధంగా కష్టాలలో ఉన్నవారు ఆర్తితో విలపిస్తూ ఉంటారు.  అటువంటి కష్టసమయాలలో నేటికీ సజీవంగా ఉండి సహాయపడేది ఒక్క సాయిబాబాయే అనే ధృఢనిశ్చయంతో, సాయిబాబాతో అనుబంధాన్ని పెచుకున్న వ్యక్తి దగ్గరకు, లేక తన పొరుగున ఎవరయినా ఉన్నట్లయితే వారి వద్దకు గాని సాయిబాబా సహాయానికై పరుగు తీస్తాడు.  అందువల్ల ప్రజలందరికీ వారి వారి భాషలలో గాని, ఆంగ్లంలో గాని హిందీలో గాని చాలా వివరంగా బాబా ఇప్పటికీ సజీవంగానే ఉండి తన విలక్షణమయిన రీతిలో సహాయపడగల వ్యక్తి ఆయన తప్ప, మనకు తెలుసున్నవారిలో మరెవరూ లేరనే విషయాన్ని తెలియచేయవలసిన ఆవశ్యకత ఎంతయినా ఉంది.  

 

Shirdi Sai Real Leelas

Bhjans Of Sai

Sai Prayer Club

My Blog List