20.06.2018 బుధవారమ్
ఓమ్ సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
కృష్ణాబాయిగారికి సాయిబాబా వారు చూపించిన అధ్భుతమయిన లీలలు తరువాయి భాగమ్ ఈ రోజు చదివి భక్తి పారవ్శ్యంలో ఆనందించండి. ఈ అధ్భుతమయిన లీలలు సాయిలీలా.ఆర్గ్ నుండి సేకరింపబడినది.
శ్రీ సాయిబాబా నేటికీ సజీవంగానే ఉండి సహాయం చేస్తున్నారా? 2 వ.భాగమ్
తెలుగు అనువాదమ్ - ఆత్రేయపురపు త్యాగరాజు, అట్లాంటా (అమెరికా నుండి)
ఫోన్ నంబర్ : 1 571 594 7354
అర్ధరాత్రి 12 గంటలవేళ ఆమె గదిలో మళ్ళీ కొన్ని సంభాషణలు వినిపించాయి.
ఆమె భర్త మేడమీదకు వెళ్ళి చూస్తే ఆమె భగవద్గీతలోని కొన్ని శ్లోకాలను చదువుతూ ఉంది.
అవి ……
భగవద్గీత అ.
4 శ్లో 7 యదాయధాహి ధర్మశ్య
అ.
4 శ్లో 8 పరిత్రాణాయ సాధూనాం
అ.
5 శ్లో
22 అనన్యాశ్చింతయంతోమాం
అ. 18
శ్లో
66 సర్వధర్మాన్ పరిత్యజ్య
శేషగిరిరావుగారు తలగడను పైకెత్తి చూశారు. తలగడ క్రింది 1. విభూది పొట్లం, 2. ఒక పెద్ద తులసీ ఆకు, దానిలో కుంకుమ 3. మృత్తిక అనగా తులసిమొక్క ఉన్న చోటనుంచి తీసిన పవిత్రమయిన మట్టి. దీనిని మధ్వులు ఎంతో పవిత్రంగా భావిస్తారు. ఆవిడది మధ్వ శాఖ. ఆ తరువాత ఆమె భర్త తన గదిలోకి వెళ్ళి తన తలగడ క్రింద చూడగా అక్కడ రెండు గంధపు ముద్దలు కనిపించాయి. ఆయన మామగారికి కూడా అదే విధంగా కనిపించాయి. అవి ఎంతో సువాసనలు వెదజల్లుతూ ఉన్నాయి. సామాన్య మానవులు అంత సులభంగా అర్ధంచేసుకోలేని అత్యున్నతమయిన ఘనమయిన శక్తి ఉందనే నమ్మకాన్ని, తనయందు విశ్వాసాన్ని కలిగించాడానికై బాబా వీటినన్నిటిని ప్రత్యక్షంగా వారికి దర్శింపచేసారు.
అప్పటినుండి
ప్రతిరోజు సాయంకాలం 6.30 కి ఆమె నుదిటిమీద విభూతి ఆనవాళ్ళు కనిపిస్తూ ఉండేవి. ఈ విధంగా 8 నెలలపాటు అనగా ఫిబ్రవరి, 1951 వరకు జరిగింది. ఈ అధ్భుతాన్ని ఎంతోమంది భక్తులు గమనించారు. ఆ తరువాత సాయిబాబా ప్రతి గురువారం పూజచేయమని ఆమెకు
చెప్పారు. ఆమె చేసే పూజ చాలా విశేషంగా ఉండేది. పూజ జరుగుతున్న సమయంలో ఆమె లో గొంతుకతో మాట్లాడుతూ
ఉండటం, మధ్యమధ్యలో ఉపన్యాసమివ్వడం, దీర్ఘంగా ఆలోచించడం చేస్తూ ఉండేది. ఆమె ఏమి మాట్లాడుతూ ఉందోనని ఆమె భర్త చాలా జాగ్రత్తగా
వినేవారు. ఆవిడ తాత్విక సత్యాలు, గీతా శ్లోకాలు,
వాటి అర్ధాలు, మాయ, ప్రకృతి వాటి వివరణల గురించి ఆవిడ ప్రసంగిస్తూ ఉండేది. పూజ సమయంలో కొన్ని అధ్భుత సంఘటనలు ఆమె ద్వారా జరుగుతూ ఉండేవి. ఆమె కూడా ప్రదర్శించడం ప్రారంభమయింది. పూజ
ప్రారంభమయే సమయంలో ఆమె తన ఎదురుగా ఒక ఖాళీ డబ్బాను ఉంచేది. పూజ పూర్తయిన తరువాత విచిత్రంగా ఆఖాళీ డబ్బా అంతా
విభూతితో నిండి ఉండేది. బాబాయే ఈ అద్భుతాన్ని
చేసేవారు. ఈ విభూతిని సాయి ప్రసాదంగా అందరికీ పంచేవారు. ఒకానొక సందర్భంలో బాబా మరొక ముఖ్యమయిన నిజాన్ని
వెల్లడించారు. “ఈమెకు మోక్షం సిధ్ధించాలంటి
ఇంకా ఎనిమిది జన్మలు ఎత్తవలసి ఉంటుంది. కాని
తనకు ఆమె మీద అనంతమయిన కరుణ ఉన్నందువల్ల రాబోయే ఎనిమిది జన్మలను అణచివేసి ఈ జన్మలోనే
మోక్షాన్ని కలుగజేస్తానని చెప్పారు. తాను ప్రారబ్ధాన్ని
తొలగించలేనని, కాని ప్రారబ్ధాన్ని కుదించివేస్తానని చెప్పారు. అందువల్ల రాబోయే 8 నెలలలో ప్రతినెల ఆమె మరణిస్తూ
తిరిగి జీవిస్తూ ఉండాలని చెప్పారు. నెలసరి
సమయంలో ఆమె చాలా జబ్బు పడుతూ ఉండేది. ఆసమయంలో
ఆమె ముఖం పాలిపోయి ప్రేతకళ కనిపిస్తూ ఉండేది.
యమ కింకరులు వస్తూ ఉండేవారు. గదిలో
వారి పాటలు, అరుపులు వినబడుతూ ఉండేవి. చావు
దగ్గరవుతోందనడానికి కొన్ని సూచనలు కూడా కనబడుతూ ఉండేవి. ఆమె పడుకునే మంచానికి రక్షణ రేఖలుగా ఉన్న విభూది
గీతలు కూడా మాయమవుతూ ఉండేవి. అటువంటి సమయాలలో
ఆమెతో సహా ఆమెకు సంబంధించినవారందరూ నామస్మరణ చేయమని బాబా ఆదేశించారు. జబ్బు పడిన సమయాలలో వైద్యం చేయడానికి వచ్చిన డాక్టర్
లు కూడా నామస్మరణలో పాల్గొంటు ఉండేవారు. అర్ధరాత్రి
12 గంటలవేళ ఆమె “నేను చనిపోతున్నాను” అంటూ అరిచేది. ఆవెంటనే శేషగిరిరావుగారు అక్కడ ఉన్నవారందరూ కూడా
‘బాబా, బాబా’ అని అరుస్తూ ఏడుస్తూ ఉండేవారు.
యదార్ధానికి ఆమెలోని ప్రాణం శరీరంనుంచి విడివడి, శరీరం నీలంగా మారి శవంగా మారేది. అపుడు సాయిబాబా మరలా ఆమెలోనికి ప్రాణాన్ని ప్రవేశపెట్టేవారు. ఒక సందర్భంలో ఆమె రక్తం కక్కుకుంది. పదహారు సార్లు ఆవిధంగా వాంతులయి ఇంకా అవుతూనే ఉన్నాయి. శేషగిరిరావుగారు అప్పుడే ఆఫీసునుండి వచ్చారు. వాంతులు తగ్గడానికి అన్ని మందులు ఇచ్చారుగాని ఏమీ
ఫలితం లేకపోయింది. ఆప్పుడాయన తన భార్యకు నయం
చేయనందుకు బాబాను నిందించసాగారు. అపుడు బాబా
ఆమె ద్వారా ఈవిధంగా సమాధానమిచ్చారు. “నేను
నీకు నయం చేయనందుకు నన్ను నిందిస్తున్నాడు.
ఇపుడు నీకు నయం చేస్తే నీ ప్రారబ్ధకర్మ ప్రకారం నీవు మరలా జన్మనెత్తవలసిఉంటుంది. అందువల్ల నువ్వు ఇప్పుడీ కష్టాన్ని భరించక తప్పదు”.
బాబా మరలా ఇలా అన్నారు. “నేను అభయం ఇచ్చినందువల్ల
ఆమె ప్రాణానికి ఎటువంటి ప్రమాదం లేదు. ఎందుకని
నామీద కోపగిస్తావు”. ఆవిధంగా పలికి ఎంతో అధ్భుతమయిన రీతిలో ఆమె రక్తపు వాంతులను అరికట్టారు. ఆమె క్రిందకు పడిపోతుండగా పైనుంచి ఒక వేరులాంటిది
ఆమె చేతిలో పడింది. దానివల్ల ఆమె రక్తపువాంతులు
ఆగిపోయాయి. ఆమె జబ్బు నయమవడానికి సాయిబాబా
ఏమాత్రం వ్యతిరేకి కాదు. కాని ఆమె ప్రారబ్ధకర్మను
అనుభవించి తీరాలి. ఆఖరికి ఆ యమధర్మరాజే స్వయంగా
ప్రవేశించాడు.
శేషగిరిరావుగారితో
సహా అందరూ ఆమె మంచం ప్రక్కనే ఉన్నారు. అకస్మాత్తుగా
గదిలో పరిమళం వ్యాపించింది. వారందరి గుండెల్లో
ఏదో తెలియని భయం ప్రవేశించింది. అది యమధర్మరాజు
ప్రవేశించాడనడానికి సంకేతం. అపుడు అదృశ్యంగా
ఉన్న సాయిబాబా, యమధర్మరాజుల మధ్య సంభాషణ సాగింది. యముడు తన ధర్మాన్ని తాను నిర్వర్తించాలని చెప్పాడు. బాబా, “సరే, చెయ్యి. నీ విధి నీవు నిర్వర్తించు”
అన్నారు. గదిలో ఉన్నవారికి శబ్దాలు మాత్రమే
వినిపిస్తున్నాయి. శేషగిరిరావుగారికి, ఇంకా
అక్కడున్నవారి ఆనందానికి అంతులేదు. ఆవిధంగా
ప్రారబ్ధ కర్మ ప్రకారం జన్మంచవలసిన ఆమె తరువాత
జన్మలన్నీ రద్దయిపోయాయి. త్వరలోనే ఆమె ఆరోగ్యవంతురాలయింది. బాబా అనుగ్రహంతో ఆమెకు క్లైర్ వాయింట్ (యోగదృష్టి)
శక్తి లభించింది. అనగా ఎపుడు ఎక్కడ ఏమి జరుగుతున్నాయో,
జరగబోతున్నాయో ఇటువంటి విషయాలు ముందుగానే తెలుస్తూ ఉండేవి. ఒకసారి ఆమె, ఆమె భర్త రామచంద్రపురంనుంచి నాగపూర్
కి ప్రయాణం పెట్టుకొన్నారు. సాయంకాలం 3 గంటలకి
ఆమె ఇప్పుడే బయలుదేరదామని చెప్పింది. కాని
రైల్వే టైం టేబుల్ ప్రకారం సాయంత్రం 3 గంటలకి రాజమండ్రి నుంచి బెజవాడకు రైళ్ళు ఏమీ
లేవు. రాజమండ్రి స్టేషన్ లో చాలా గంటలు వేచి
ఉండాలి. కాని భార్య బలవంతపెట్టడం వల్ల బయలుదేరారు. బస్సులో బయలుదేరి సాయంత్రం 6 గంటలకి రాజమండ్రి చేరుకొన్నారు. బుకింగ్ ఆఫీసు దగ్గరకు వెళ్ళి రైళ్ళ గురించి వివరాలు
అడిగారు. “ప్రొద్దున్న రావలసిన రైలు ఇప్పుడే
వచ్చింది. మీరు అందులో బెజవాడ వెళ్ళచ్చు” అని
బుకింగ్ క్లర్కు చెప్పాడు. బుకింగ్ క్లర్కు వారికి బెజవాడకి టిక్కెట్స్ ఇచ్చాడు. వారు
బెజవాడకి అర్ధరాత్రి ఒంటిగంటకు చేరుకొన్నారు.
అర్ధరాత్రి దాటి చేరుకున్నందువల్ల బస ఎక్కడ చేయాలో వారికి అర్ధం కాలేదు. బెజవాడలో శేషగిరిరావుగారి కజిన్ ఉన్నాడు. కాని శేషగిరిరావుగారికి అతని చిరునామా తెలీదు. అతని అడ్రస్ చెప్పడానికి ఎవరూ లేరు. అకస్మాత్తుగా 16 ఏండ్ల బాలుడు వచ్చి ‘మిమ్మల్ని
మున్సిపల్ కౌన్సిలర్ గారి ఇంటికి తీసుకొని వెడతాను ఆయన మీకు దారి చూపిస్తారు” అని వాళ్ళిద్దరినీ
మున్సిపల్ కౌన్సిలర్ ఇంటికి తీసుకుని వెళ్ళాడు.
ఆయన వాళ్ళకి శేషగిరిరావుగారి కజిన్ ఇల్లు చూపించాడు. ఆ బాలుడు ఎంత అకస్మాత్తుగా వచ్చాడో అంతే అకస్మాత్తుగా
మాయమయాడు. అపుడామె ఆ వచ్చిన బాలుడు బాబాయే
అయి ఉంటారు” అని చెప్పింది ఆవిడ.
మరలా
కొంత కాలం తరువాత కృష్ణాబాయిగారి తండ్రిగారయిన హనుమంతరావుగారికి షిరిడీనుంచి ఒక ఉత్తరం
వచ్చింది. ఆ ఉత్తరం క్రిందభాగంలో సాయిబాబా
సంతకం చేసారన్నట్లుగా సంతకం ఉంది. ఉత్తరం రహతాలో
పోస్టు చేసినట్లుగా రహతా పోస్టల్ ముద్ర ఉంది. ఆ ఉత్తరంలో
‘నాగపూర్ లో మీ అమ్మాయి నిర్వహించే పూజ చూడు” అని వ్రాయబడి ఉంది. అందులో భగవద్గీతలోని శ్లోకాలు కూడా ఉన్నాయి. ఆ ఉత్తరంలో, ఆమెని కేవలం నీకుమార్తెగా చూడవద్దు
అని హనుమంతరావుగారిని హెచ్చరిస్తూ కూడా వ్రాయబడి ఉంది. ఆమెను తన అనుచరురాలిగా భావించమనే సందేశం ఉంది. ఉత్తరంలో వ్రాయబడిన ప్రకారం ఆయన నాగపూర్ కి వచ్చి
తన కుమార్తె చేసే పూజ చూసారు. తన కుమార్తె
చేసిన పూజలో కనిపించిన అధ్భుతమయిన ఆధ్యాత్మికతకి ఆయనెంతో ముగ్ధుడయ్యారు.
కృష్ణాబాయి
ద్వారా తాను కొన్ని పనులను నిర్వహించవలసి ఉందని, బాబా చెప్పారు. బాబా తన సందేశాలను అరటి ఆకుల మీద రాస్తూ ఉండేవారు. ఆవిధంగా అరటిఆకుల మీద బాబా వ్రాసిన సందేశాలను ఆమె
తండ్రి గమనించిననవాటిల్లో ఒకటి. ఒక్కోసారి
ఎన్నో అరటి ఆకులమీద బాబా వ్రాసిన సందేశాలు కనిపిస్తూ ఉండేవి. ఒక్కోసారి ఒక్క ఆకుమీదనే రాసేవారు. ఒక్కొక్కప్పుడు చాలా చిన్న ఆకులమీద చాలా సూక్ష్మమయిన
అక్షరాలతో వ్రాసేవారు.
ఒకరోజు
సాయంత్రం శేషగిరిరావుగారు తన గదిలో కూర్చుని ధ్యానం చేసుకొంటున్నారు. అపుడు బాబా కృష్ణాబాయి ఉన్న గదిలో ఆమెకు దర్శనమిచ్చి,
“నీ భర్త తన గదిలో కూర్చుని నన్ను ధ్యానిస్తూ ఉన్నాడు. అతను ఇక్కడికే ఎందుకు రాకూడదు?” అన్నారు. ఆ తరువాత ఆమె భర్త ఆవిడ గదిలోకి వెళ్ళారు. అక్కడ ఆయనకి ఒక అధ్భుతమయిన దృశ్యం కనిపించింది. ఆమె దగ్గరనున్న బల్లనిండా విభూది చల్లబడి ఉంది. దానిమీద ఒక భారీ శరీరంతో ఉన్న వ్యక్తి కూర్చుని
ఉన్నాడు. ఆయనే బాబా. బల్లమీద ఆయన కూర్చున్న
శరీరం క్రింది భాగం (రెండు భాగాల వెడల్పు అనగా పృష్టభాగం) నాలుగు అడుగులకన్నా ఎక్కువగా ఉంది. ఇదే విధమయిన సంఘటన రామచంద్రపురంలో కూడా రెండుమూడు
సార్లు మరలా మరలా కనిపించింది. పూజా సమయంలో
ఒకతను “బాబా ఏవిధంగా ఆహారం స్వీకరిస్తారో గమనిద్దాము”
అన్నాడు. పూజ గదంతా బాబా చిత్రపటాలతో నిండిపోయి
ఉంది. ఒక ఫొటోవద్ద బాబా నోటి క్రిందుగా ఒక
చిన్న కోవా బిళ్ళని ఉంచారు. ఆ కోవా బిళ్లని
ఒక ఫొటోనించి మరొక ఫోటోకి బాబా నోటిదగ్గర ఉంచుకుంటూ వెళ్లారు. చివరి ఫొటో వద్దకు తీసుకుని వెళ్ళేటప్పటికి ఆ కోవాబిళ్ళ
మాయమయిపోయింది. అపుడు అక్కడ ఉన్నవారందరూ “బాబా
మీరు కోవా తినడం మాకెంతో ఆనందాన్నిచ్చింది” అన్నారు. మరొక సందర్భంలో ఒక రోజున కృష్ణాబాయి అమ్మమ్మగారు
వచ్చారు. ఆవిడ వచ్చి “బాబాయే స్వయంగా నానోటిలో
కోవా ప్రసాదాన్ని పెడితే నేను బాబాను నమ్ముతాను” అని చెప్పింది. ఆమె మాటలు విని అందరూ నవ్వారు. కాని, రాత్రి బాగా పొద్దుపోయిన తరువాత ఆమె హటాత్తుగా
లేచి ఏదో బల్లిలాంటిది తన నోటిలో పడిందని చెప్పింది. లైటు తెచ్చి చూశారు. ఆమె నోటిలో బల్లి కాదు పేడా కనిపించింది. అపుడామెకి బాబా అక్కడకూడా తనలీలలు చూపిస్తున్నారనే
నమ్మకం కలిగింది.
(ఇంకా ఉంది)
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)
(ఇంకా ఉంది)
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment