Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Friday, June 22, 2018

శ్రీ సాయిబాబా నేటికీ సజీవంగానే ఉండి సహాయం చేస్తున్నారా? 3 వ.భాగమ్

Posted by tyagaraju on 3:41 PM
         Image result for images of shirdi sai baba
                   Image result for images of rose hd

22.06.2018 శుక్రవారమ్
ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
ఈ రోజు మాతాజీ కృష్ణాబాయి గాఅరి మరికొన్ని అనుభవాలు చదవండి...

శ్రీ సాయిబాబా నేటికీ సజీవంగానే ఉండి సహాయం చేస్తున్నారా?  3 .భాగమ్

మద్రాసు ప్రభుత్వంలోని మాజీ మంత్రి  శ్రీ ఎమ్.బి.వెంకటరత్నంగారు కూడా ఆమె పూజలు చూడటానికి వచ్చారు.  ఒకసారి ఆమె ఒక విధంగా మగతలో ఉన్నట్లుగా ఆయనని ఈ విధంగా అడిగింది.  “ఫలానా తేదీ, ఫలానా రోజున నీయింటికి అన్నం పెట్టమని ఎవరో వస్తే అతనిని తరిమేయలేదా?  ఆశ్రయం కోరివస్తే అతనికి ఆశ్రయమివ్వకుండా పంపించావా లేదా? అని ప్రశ్నించి మరలా బాబా ఆమె ద్వారా “అతను అక్కడినుండి వెళ్ళిపోతూ నిన్ను రెండురూపాయలు అడగలేదా?” అని ప్రశ్నించారు. 


ఆప్రశ్నలన్నిటికి వెంకటరత్నంగారు అవుననే సమాధానమిచ్చారు.  బాబా మరలా వెంకటరత్నంగారిని “నువ్వు రామచంద్రపురానికి వచ్చేముందు రోజు దారిలో ఒక యాచకుడు రెండు అణాలు ధర్మం అడిగినా ఇవ్వలేదు అవునా?” అన్నారు.  వెంకటరత్నం గారు ఇవ్వలేదన్నట్లుగా ఒప్పుకున్నారు. “ఆ యాచకుడిని నేనే” అన్నారు బాబా.  అలాగే శ్రీ వి.విశ్వనాధం చెట్టి గారు జాయింట్  రెజిస్ట్రార్ ఆఫ్ కో ఆపరేటివ్ సొసైటీస్, కూడా ఆమె పూజలు చూడటానికి వచ్చారు.  అక్కడినుంచి లేచి వెళ్ళబోతూ తనకు చాలా ముఖ్యమయిన పనులు చాలా ఉన్నాయని మళ్ళీ తిరిగి రావడానికి చాలా రోజులు పడుతుందని చెప్పారు.  ఆయన వెళ్ళిపోయిన తరువాత కృష్ణాబాయిగారు “ఆయన మళ్ళీ తిరిగి వస్తారు మీరే చూడండి.  వచ్చిన తరువాత మూడురోజులు ఇక్కడ పూజకి వస్తారు” అని చెప్పింది.  కాని ఎన్నో వైవిధ్యమయిన కారణాల వల్ల ఆయన రామచంద్రపురంనుంచి మూడురోజులపాటు కదలలేకపోయారు.  ఆయన మూడు రోజులు పూజకి హాజరయ్యారు.  (పైన చెప్పిన సంఘటనలన్నీ శ్రీ కె. శేషగిరిరావుగారు ఫిబ్రవరి 1953 వ.సంవత్సరంలో మైలాపూర్ లోని ఆల్ ఇండియా సాయి సమాజ్ సాయి మందిరంలో ప్రసంగించిన ప్రసంగంలోని భాగాలు.  శ్రీమతి కృష్ణాబాయి గారి ద్వారా ప్రదర్శింపబడినవి, ఇంకా తనకు తెలుసున్న వాటినన్నిటినీ ప్రచురించమని బాబా ఆయనను ఆదేశించారు.)

బాబాపై అపరిమితమయిన నమ్మకం కలిగించేటటువంటి ఎన్నో అనుభవాలు శ్రీ జి.వి. చెట్టిగారికి అనుభవమయ్యాయి.  ఆయన బాబాకు ప్రగాఢమయిన భక్తునిగా మారిపోయారు.  ఇంతకు ముందు చెప్పిన సందర్భాలలో ఒకసారి ఆయనకు బాబాతో అనుబంధం ఏర్పడే సమయంలో బాబా ఇప్పటికీ జీవించే ఉన్నారనీ, భక్తులు పిలిచిన వెంటనే ఆయన మానవ స్వరంతో సమాధానాలు ఇచ్చి సహాయపడుతూ ఉంటారనేదానికి తగిన సాక్ష్యం లభించింది.

ఒకరోజు ఆయన కాకినాడనుంచి రామచంద్రపురం వెడుతూ ఎంతో భక్తితో పెద్ద సైజు గులాబీ దండను కొన్నారు.  దానిని తమిళంలో ‘నేల మలై’ అని అంటారు.  నేలమలై అనగా దండ మెడనుంచి నేలను తాకేటంత పెద్దదిగా ఉంటుంది.  ఆ దండనిండా గులాబీ పూలు దట్టంగా ఉన్నాయి.  అందులో ఉన్న గులాబీరేకలు లెక్కిస్తే దాదాపు నాలుగు అంకెల దాకా (వేలల్లో) ఉండచ్చని ఊహించుకోవచ్చు.  ఈ దండని బాబా చిత్రపటం చుట్టూ అలంకరించారు.  ఆయన ఇంకా పూలు, పండ్లు మొదలయినవన్నిటినీ తీసుకుని వచ్చారు.  పూజ పూర్తయిన తరువాత ఆయన ఎందుకనో ఆ గులాబీ దండను పరీక్షగా చూసినప్పుడు గులాబీపూవుయొక్క ప్రతి రేక మీదా ‘ఓమ్ సాయి’ అనే అక్షరాలు లిఖింపబడి ఉన్నాయి.  ఒకవేళ మనలో ఎరయినా ప్రతి గులాబీ రేక మీద ‘ఓమ్ సాయి’ అని రాస్తే ఇంకా ఆదండలో కొద్ది రేకలు మిగిలిపోతాయి.  అంతేకాదు గులాబీ రేకలన్నీ క్రిందకు రాలిపోతాయి.  పైగా వేలకొద్దీ ఉన్న ఆరేకల మీద రాయాలంటే చాలా గంటల సమయం పడుతుంది.  అటువంటిది అకస్మాత్తుగా కొద్ది నిమిషాలలోనే మొత్తం దండలో ఉన్న ప్రతి గులాబీ రేక మీద అక్షరాలు కనిపించాయి.  ఇంకా కొన్ని విషయాలలో కూడా శ్రీ చెట్టిగారికి బాబావారి అనుగ్రహం లభించింది.  ఆయన తీసుకువచ్చిన అరటి ఆకులమీద కూడా అక్షరాలు కనిపించాయి.  ఆయన ఒక ఆపిల్ పండుని బాబా ముందు పెట్టారు. పూజ పూర్తయిన తరువాత కృష్ణాబాయి గారు ఆపిల్ పండుని తీసుకోమని చెట్టిగారితో చెప్పింది.  ఆయన ఆశ్చర్యపడుతూ “ఈ పండుని బాబా స్వీకరించారనడానికి ఎటువంటి గుర్తులు లేవు.  మరి నేను ఈ పండుని తీసుకోనా?” అని మనసులోనే తనని తాను ప్రశ్నించుకున్నారు.  కాని పైకి మాత్రం తనకు వచ్చిన ఆలోచన గురించి చెప్పలేదు.  కాని బాబాకు ఆయన అంతరంగంలో మెదిలిన ప్రశ్న తెలుసు.  అపుడు బాబా కృష్ణాబాయిగారి ద్వారా ఈ విధంగా అన్నారు.  “ఏమిటి, బాబా తిన్నారు అనడానికి ఎటువంటి ఆనవాలు లేదని అంటున్నాడా?  ఆపిల్ ని పైకెత్తి చూడమను”.  అపుడాయన ఆపిల్ ని పైకెత్తి చూడగా క్రిందిభాగం చాకుతో కోసినట్లుగా ఉంది.  ఆపిల్ క్రింద భాగం లేదు.  అంటే బాబా ఆపిల్ పండుని తిన్నారనడానికి అదే ఋజువు.  పూజ గదిలో ఆయన ఇంకా ఇతరులు ఉన్న సమయంలోనే అదృశ్య హస్తాలు గులాబీ రేకులమీద లిఖించడం, ఆపిల్ పండు స్వీకరించారన్నదానికి ఆనవాలుగా క్రింద భాగాన్ని తీసివేయడం జరిగింది.  అది చూసిన తరువాత బాబాకు తను సమర్పించినవి ఆయన స్వీకరించారని ప్రగాఢమయిన నమ్మకం కలిగి ఎంతగానో సంతోషించారు.  ఇలాంటివే ఎన్నో సంఘటనలు జరిగాయి.  చెట్టిగారికి తన కొడుకు కూతురు గురించిన సమస్యల గురించి కూడా బాబానుంచి నిర్దిష్టమయిన సమాధానాలు లభించాయి.  పైన చెప్పినట్లుగా ఆయన ఒక్క క్షణం కూడ సంకోచించకుండా తాను నేటికీ సజీవంగానే ఉన్నానని ఎటువంటి సందేహానికి తావులేకుండా తనను నమ్మినవారికి సహాయపడతాననడాననడానికి తార్కాణం చూపించారు.  అంతే కాదు బాబా వారు యిచ్చే సమాధానాలు చాలా విశదంగాను స్పష్టంగాను ఉంటాయి.
_________________________________________________________________________________
(సందర్భం వచ్చింది కాబట్టి ఇక్కడ మీకు ఒక ముఖ్యమయిన నా అనుభవం గురించి చెప్పాలి.  నాకు విమాన ప్రయాణమంటే భయం.  హైదరాబాదునుంచి అమెరికాకు దాదాపు 22 గంటల ప్రయాణం.  18 గంటలపాటు విమానంలోనే ప్రయాణించాలి.  అమెరికాకు వచ్చేటప్పుడు కొద్ది రోజులముందు పూజ చేసుకునే సమయంలో బాబాని ఇలా అడిగాను. అప్పటికి సాయి సత్ చరిత్ర నిత్య పారాయణ పూర్తి చేసాను..  “నేను మిమ్మల్ని క్షేమంగా అమెరికాకు చేరుస్తాను.  తిరిగి అమెరికానుంచి క్షేమంగా హైదరాబాదు చేరుస్తాను.  నేను మీకూడా వస్తాను” అని నాతో చెప్పు.  నేను ఎటువంటి భయం లేకుండా అమెరికా వెడతాను.  నాకు ఆవిధంగా చెప్పు అంటు కళ్ళు మూసుకుని ప్రార్ధించాను.  నా ఉద్దేశ్యం బాబా స్వయంగా నాతో మాట్లాడాలని.  ఆ తరువాత శ్రీ సాయి సత్ చరిత్ర ను ముద్దు పెట్టుకుని బాబా విగ్రహానికి తాకించి బాబా ఈ రోజు నువ్వు ఇచ్చే సందేశం ఏమిటి అని కళ్ళు మూసుకుని ఒక పేజీ తీసి ఒకచోట వేలు పెట్టాను.  కళ్ళు తెఱచి చూశాను.  ఏమని సందేశం వచ్చిందో…ఆశ్చర్యం….అది 13 వ. అధ్యాయంలోని వాక్యాలు….”నిత్యం సాయి సాయి అని తలిస్తే సప్తసముద్రాలు దాటిస్తాను”  అని ఉంది.  ఎంతో ఆనందం వేసింది.  ఇక ఆయన ఆ విధంగా అన్నప్పుడు మాతో కూడా అమెరికాకు వస్తున్నారనే కదా అని ఎంతో సంతోషం కలిగింది.  ప్రయాణం మొదలయినప్పటినుంచే కాక అంతకు ముందునుంచి కూడా అమెరికాకు చేరుకునేటంత వరకు సాయినామ స్మరణ చేసుకుంటూనే ఉన్నాను.  ఎక్కడా ఎటువంటి ఇబ్బంది పడకుండా ఆయన మాతో కూడా వచ్చారు….. ఆయనను నమ్మికతో ప్రార్ధిస్తే చాలు.  నేను ఉన్నానని పలుకుతారు ....  త్యాగరాజు)
*********************************************************************************
అటువంటి సందర్బాలలో ఒకసారి బాబా చూపించె లీలలు ఒక విశేషమయిన రూపాన్ని సంతరించుకున్నాయి.  నాగపూర్ నుంచి పెద్ద వ్యాపారస్థుడయిన రామచంద్రరావు అనే ఆయన మరికొంతమందితో కలిసి రామచంద్రపురం వచ్చాడు.  వారంతా బాబాకి ఒక మందిరం నిర్మించాలనే ఆలోచనలో ఉన్నారు.  దానికి తగిన ఆదేశాలు బాబానుండే పొందాలనుకున్నారు.  వారు ఈ ప్రశ్నను ఆమెను అడిగారు.  ఆల్ ఇండియా సాయి సమాజ్ అధ్యక్షుడయిన శ్రీ బి.వి.ఎన్. స్వామిగారిని రామచంద్రపురానికి రావలసినదిగా సమాధానమొచ్చింది.  అపుడు స్వామిగారు ఎంతోమంది భక్తులతో కలిసి మద్రాసునుంచి బయలుదేరారు.  ఆభక్తులందరిలో ముఖ్యులు శ్రీ ఎస్.ఎన్. సి. శ్రీమాన్ నారాయణ చౌదరి గారు కూడా ఉన్నారు.  ఆయన గుంటూరులో పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా పని చేసి ఆతరువాత మానసిక అనారోగ్యం వల్ల తన వృత్తిని కొనసాగించలేకపోయారు.  వారందరూ తమతో మూడు ఆపిల్ పండ్లను, ఒక డబ్బా నిండుగా హల్వాతో బయలుదేరారు.  స్వామిగారు డబ్బానిండుగా హల్వా ఉందో లేదోనని పరిశీలనగా చూసారు. వీటన్నిటితోపాటు పండ్లు, పూలు తీసుకుని 18.03.1952 ఉదయం 11.30 కి రామచంద్రపురం  చేరుకొన్నారు.  వాటినన్నిటినీ  పూజ గదిలో ఉంచారు.  ఆగదిలో పూజ జరుగుతూ ఉంది.  గదంతా భక్తులతోను వారు తెచ్చిన నైవేద్యాలతోను నిండిపోయి ఉంది.  ఒక గోడమీద సాయిబాబా ఫోటోలు చాలా ఉన్నాయి.  కృష్ణాబాయిగారు ఎంతో ఏకాగ్రతతో సాయిబాబా పూజ చేస్తూ ఉన్నారు.  మధ్యాహ్నం 12.30 కు పూజ పూర్తయే సమయానికి ఆవిడ తండ్రి గారు భక్తులందరినీ ఉద్దేశించి, “మీరు తెచ్చిన నైవేద్యాలన్నిటినీ లెక్క పెట్టారా?” అని ప్రశ్నించారు.  భగవంతునికి సమర్పించేవాటిని లెక్కపెట్టడమేమిటని అంత అవసరం ఏమన్న ఉందా అని స్వామిగారు ఇంకా మరికొందరు నవ్వుకున్నారు.  ఎస్.ఎన్. చౌదరిగారు తాను నైవేద్యానికి మూడు ఆపిల్ పళ్ళను తెచ్చానని, కాని ఇపుడు రెండె పళ్ళున్నాయని అన్నారు.  ఆగదిలో భక్తులందరి మధ్యనుంచి ఎవరయినా వెళ్ళి ఒక ఆపిల్ పండుని తీయడం అసాధ్యం.  మరి అటువంటిది ఇపుడు ఒక ఆపిల్ పండు ఎలా మాయమయింది?  కృష్ణాబాయి గారు హల్వా ఉన్న డబ్బా మూత తీసి చూసారు.  ఆశ్చర్యకరమయిన దృశ్యం ….  హల్వాలో ఎవరో బాగా లోతుగా చేయిపెట్టి వేలితో ఎక్కువభాగం హల్వాను తీసుకున్నట్లుగా ఆనవాలు స్పష్టంగా కనిపించింది.  అందులోనుంచి తీసిన హల్వా ఏది? దానిని ఎవరు తీసారు?  ఆంతా మాయగా ఉంది.  దానికి తగిన సమాధానం బాబా హల్వాను కూడా స్వీకరించారు.

(ఇంకా ఉంది)
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)




Kindly Bookmark and Share it:

0 comments:

Post a Comment

 

Shirdi Sai Real Leelas

Bhjans Of Sai

Sai Prayer Club

My Blog List