Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Tuesday, April 20, 2021

మీ భారములను నాపై వేయండి….

0 comments Posted by tyagaraju on 8:44 AM

 




20.04.2021 మంగళవారమ్

ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ సాయి

సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

శ్రీరామనవమి శుభాకాంక్షలు

మీ భారములను నాపై వేయండి….

ఈ రోజు మరొక అధ్భుతమయిన బాబా చేసిన సహాయం గురించి తెలుసుకుందాము.  మీ భారములను నా పైనే వేయండి అని బాబా మనకు చెప్పారు.  ఆయన మీదనే భారమంతా వేసి మనం నిశ్చింతగా ఉంటే మన యోగక్షేమాల బాధ్యత ఆయనే వహిస్తారన్న దానికి ఉదాహరణే ఈ రోజు మీరు చదవబోయే ఈ అధ్బుతమయిన అనుభవమ్.

సమర్పణ్ ఈ మాగజైన్, నవంబరు, 2018 నుండి గ్రహింపబడినది.

తెలుగు అనువాదమ్  :  ఆత్రేయపురపు త్యాగరాజు

బాబాతో మనకు కలిగిన స్వీయ అనుభవాలను ఇతరులతో పంచుకుంటున్నపుడు ఎనలేని ఆనందం కలుగుతుంది.  నాకు కలిగిన ఈ అనుభవాన్ని సమర్పణ్ వారికి వ్రాస్తూ మీతో పంచుకునే సమయంలో నాకు ఎంతగానో చెప్పలేని ఆనందం కలుగుతూ ఉంది.  మొట్టమొదటగా సాయికి నా నమస్కారాలను సపర్పించుకుంటూ ఆయన చేసే అధ్భుతమయిన లీలలకు కృతజ్ఞతలను తెలుపుకుంటున్నాను.

Monday, April 19, 2021

సాయిబాబా కృప ఉంటే అన్నీ సాధ్యమే….

2 comments Posted by tyagaraju on 4:44 AM

 



19.04.2021  సోమవారమ్


ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ సాయి

సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

మనసా వాచా కర్మణా మన సద్గురువు బోధనలను మననం చేసుకుంటూ, శరీరం సహకరించకపోయినా ఆయన నామాన్నే జపిస్తూ ఉంటే ఆయన మనలని అన్ని కష్టాలనుండి కాపాడతారు అనేదానికి ఈ రోజు ప్రచురింపబోయే నామ జప మహిమే గొప్ప ఉదాహరణ.  మనం ఆరోగ్యంగా ఉన్నా సరే నిత్యం ఎల్లవేళలా ఆయన నామాన్ని ఉఛ్ఛరించుకుంటూనే ఉండాలి. 

శ్రీ సాయి లీల ద్వైమాసపత్రికి జనవరి – ఫిబ్రవరి, 2021 సం. లో ప్రచురింపబడిన ఈ అధ్భుతమయిన లీలను ఈ రోజు ప్రచురిస్తున్నాను.

హిందీ మూలమ్…శ్రీ గోవింద శివరామ్ కార్ఖానీస్

తెలుగు అనువాదమ్ : ఆత్రేయపురపు త్యాగరాజు

నిజాంపేట, హైదరాబాద్

సాయిబాబా కృప ఉంటే అన్నీ సాధ్యమే….

మేము ముగ్గురం అన్నదమ్ములం.  నేను పెద్దవాడిని.  నా తరువాతి తమ్ముడు (అంటే మా ముగ్గురిలో మధ్యవాడు) బాబా భక్తుడు.  నా తమ్ముడు ఎప్పుడు ఏపనిమీద బయటకు వెళ్ళినా ముందుగా సాయిబాబా పటానికి నమస్కరించుకుని నుదుట ఊదీ రాసుకుని వెడుతూ ఉంటాడు. 

 

Shirdi Sai Real Leelas

Bhjans Of Sai

Sai Prayer Club

My Blog List