20.04.2021 మంగళవారమ్
ఓమ్
సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి
బంధువులకు బాబావారి శుభాశీస్సులు
శ్రీరామనవమి శుభాకాంక్షలు
మీ
భారములను నాపై వేయండి….
ఈ
రోజు మరొక అధ్భుతమయిన బాబా చేసిన సహాయం గురించి తెలుసుకుందాము. మీ భారములను నా పైనే వేయండి అని బాబా మనకు చెప్పారు. ఆయన మీదనే భారమంతా వేసి మనం నిశ్చింతగా ఉంటే మన
యోగక్షేమాల బాధ్యత ఆయనే వహిస్తారన్న దానికి ఉదాహరణే ఈ రోజు మీరు చదవబోయే ఈ అధ్బుతమయిన అనుభవమ్.
సమర్పణ్
ఈ మాగజైన్, నవంబరు, 2018 నుండి గ్రహింపబడినది.
తెలుగు
అనువాదమ్ : ఆత్రేయపురపు త్యాగరాజు
బాబాతో
మనకు కలిగిన స్వీయ అనుభవాలను ఇతరులతో పంచుకుంటున్నపుడు ఎనలేని ఆనందం కలుగుతుంది. నాకు కలిగిన ఈ అనుభవాన్ని సమర్పణ్ వారికి వ్రాస్తూ
మీతో పంచుకునే సమయంలో నాకు ఎంతగానో చెప్పలేని ఆనందం కలుగుతూ ఉంది. మొట్టమొదటగా సాయికి నా నమస్కారాలను సపర్పించుకుంటూ
ఆయన చేసే అధ్భుతమయిన లీలలకు కృతజ్ఞతలను తెలుపుకుంటున్నాను.
మేము
బెంగళురులో ఉంటాము. మా అమ్మాయి బెల్గాంలో వైద్యవిద్య మొదటి సంవత్సరంలో చేరింది. మొదటి సంవత్సరం
కాబట్టి అసలు విశ్రాంతి అనేది లేకుండా బాగా కష్టపడి చదవాలి. దానివల్ల ఇంటిమీద బాగా బెంగపెట్టుకుంది. బెంగ తీరడానికి
ఒకసారి ఇంటికి రావాలి అనుకునేది. మా అమ్మాయి
అంత బెంగపెట్టుకోవడం వల్ల ఒక తల్లిగా నేనుకూడా ఇక ఉపేక్షించకుండా మా అమ్మాయికి తత్కాల్
లో వెంటనే టికెట్ బుక్ చేయమని నా భర్తకు చెప్పాను. కాని టిక్కెట్లు అన్నీ అయిపోవడం వల్ల రాత్రి బయలుదేరే
బస్సుకు టికెట్ బుక్ చేయాల్సి వచ్చింది.
మా
అమ్మాయి స్నేహితురాలు కూడా తన తల్లిదండ్రులను చూడటానికి బెంగళూరుకు వస్తానని చెప్పింది. అందుచేత బస్సులో మొదటి వరుసలో వచ్చేలాగా ఇద్దరికీ
బస్సు టికెట్లను బుక్ చేసాము. మొత్తం బస్సులో
వీరిద్దరే అమ్మాయిలని తరువాత తెలిసింది. నాకు
చాలా భయం వేసింది. రాత్రంతా బస్సులో ఇద్దరే
అమ్మాయిల ప్రయాణం ఏవిధంగా ఉంటుందోనని మనస్సు పరిపరివిధాలుగా ఆలోచనలతో నిండిపోయింది. బస్సు ప్రయాణం సురక్షితమయినా గాని నాకెందుకనో భయంగానే
ఉంది. ఆసమయంలో కర్నాటక, ముంబాయిలలో విపరీతమయిన
వర్షాలు కురుస్తూ ఉండటం వల్ల వరదలు కూడా వచ్చాయి.
నాలోని భయాందోళనలను ఎవ్వరికీ వెల్లడించకుండా బాబాని ఇలా ప్రార్ధించాను. ప్రార్ధించుకున్నాను అనేకంటే ఆయనని ఆదేశించానంటె
బాగుంటుంది. “బాబా రాత్రి అమ్మాయిలిద్దరూ రాత్రి
నిద్రపోయే సమయంలో నువ్వు వాళ్ళ ప్రక్కనే సటకా పట్టుకుని కూర్చుని ఇద్దరికీ రక్షణగా
ఉండు”. ఆవిధంగా ప్రార్ధించి నాలోని భయాలన్నిటినీ ఆయన మీద పెట్టి
ప్రార్ధించుకుని ఆయనతో చెప్పుకున్న తరువాత నా మనసుకు ఎంతో శాంతి లభించింది.
ఉదయాన్నే అమ్మాయిని
ఇంటికి తీసుకురావడానికి బస్ స్టాండుకు వెళ్ళాము.
బాబాను నేను ప్రార్ధించుకున్న విషయం మర్చిపోయాను. మా అమ్మాయి బస్సు దిగగానే ఆమెను కౌగలించుకున్నాను. మా అమ్మాయి మొట్టమొదటగా నాకు చెప్పిన విషయం నన్ను
ఆశ్చర్యానందాలలో ముంచెత్తింది. “అమ్మా నీకు
ఒక అధ్బుతమయిన విషయం చెబుతాను. కలలో నాకు బాబా
కనిపించారు. బాబా నాముందు నడుస్తూ ఉన్నారు.
చుట్టూరా ఎక్కడ చూసినా నీటి ప్రవాహం. బాబా
అలా ముందు నడుస్తూ ఉన్నపుడు మేము నడవడానికి ఎటువంటి కష్టం లేకుండా నీళ్ళు ప్రక్కలకు
వెళ్ళిపోతూ ఉన్నాయి.” అని చెప్పింది. నేను ఆనందంతో చిన్న చిరునవ్వు నవ్వి, సంతోషంతో మరలా
కౌగలించుకున్నాను.
నా సద్గురువుతో నాకు ఉన్న అనుబంధం వల్ల నేను ఎవరి సహాయం కోరనక్కరలేదు. ఆయన నా హృదయంలోనే నివసిస్తున్నారు. ఆయన నా కోరికలను విని వాటిని వెంటనే తీరుస్తారు. నా ప్రార్ధనలను ఆలకిస్తూ మా కుటుంబాన్ని రక్షిస్తూ
ఉన్నందుకు నీకు నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.
ఓమ్ సాయి.
రేణు కౌల్
(సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment