19.04.2021 సోమవారమ్
ఓమ్
సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి
బంధువులకు బాబావారి శుభాశీస్సులు
మనసా
వాచా కర్మణా మన సద్గురువు బోధనలను మననం చేసుకుంటూ, శరీరం సహకరించకపోయినా ఆయన నామాన్నే
జపిస్తూ ఉంటే ఆయన మనలని అన్ని కష్టాలనుండి కాపాడతారు అనేదానికి ఈ రోజు ప్రచురింపబోయే
నామ జప మహిమే గొప్ప ఉదాహరణ. మనం ఆరోగ్యంగా ఉన్నా సరే నిత్యం
ఎల్లవేళలా ఆయన నామాన్ని ఉఛ్ఛరించుకుంటూనే ఉండాలి.
శ్రీ
సాయి లీల ద్వైమాసపత్రికి జనవరి – ఫిబ్రవరి, 2021 సం. లో ప్రచురింపబడిన ఈ అధ్భుతమయిన లీలను
ఈ రోజు ప్రచురిస్తున్నాను.
హిందీ
మూలమ్…శ్రీ గోవింద శివరామ్ కార్ఖానీస్
తెలుగు
అనువాదమ్ : ఆత్రేయపురపు త్యాగరాజు
నిజాంపేట,
హైదరాబాద్
సాయిబాబా
కృప ఉంటే అన్నీ సాధ్యమే….
మేము ముగ్గురం అన్నదమ్ములం. నేను పెద్దవాడిని. నా తరువాతి తమ్ముడు (అంటే మా ముగ్గురిలో మధ్యవాడు) బాబా భక్తుడు. నా తమ్ముడు ఎప్పుడు ఏపనిమీద బయటకు వెళ్ళినా ముందుగా సాయిబాబా పటానికి నమస్కరించుకుని నుదుట ఊదీ రాసుకుని వెడుతూ ఉంటాడు.
ఈ విధంగా ఎన్నో సంవత్సరాలనించీ జరుగుతూ
ఉంది. మా ముగ్గురికీ కూడా షిరిడీ వెళ్ళి బాబా
సమాధిని దర్శించుకునే భాగ్యం కలగలేదు. శ్రీ
బాబావారి నామనవమి, వ్యాసపూర్ణిమ, అలాగే పుణ్యుతిది ఉత్సవాలు జరిగే రోజులలో షిరిడీ
వెళ్ళే మా స్నేహితునికి బాబా హుండీలో దక్షిణవేయమని డబ్బు ఇచ్చి, వచ్చేటప్పుడు బాబా ఊదీ, ప్రసాదం తీసుకురమ్మనమని చెప్పేవాళ్ళం. వారు తెచ్చే ఊదీ, ప్రసాదాల కోసం చకోర పక్షులలాగా
ఎదురు చూస్తూ ఉండేవాళ్ళం. అందులోనే ఆనందాన్ని
వెదుకుకుంటూ ఎన్నో సంవత్సరాలు గడిపేశాము.
నా
చిన్నతమ్ముడు కూడా నా మొదటి తమ్ముడినే అనుకరిస్తూ ఉండేవాడు. నాలుగు నెలలముందు నా మొదటి తమ్ముడికి మెడమీద అయిదు
మరియు ఆరవ ఎముకల మీద బాగా నొప్పి మొదలయింది.
దానివల్ల జబ్బు పడ్డాడు. రెండు కాళ్ళు,
రెండు చేతులలోను శక్తి క్షీణించింది. మా మేనమామ
అంధేరీలో వైద్యుడు. మా తమ్ముడికి వైద్యం ఏవిధంగా
చేయించాలో సలహా తీసుకోవడానికి ఆయనని పిలిపించాము.
మా మేనమామ పరీక్షించి జబ్బు చాలా తీవ్రంగా ఉందనీ, ఆస్పత్రిలో చేర్పించడం తప్ప
మరొక మార్గం లేదని చెప్పాడు. ఆస్పత్రిలోనయితే
మెరుగయిన వైద్యం జరుగుతుందని అన్నాడు. నా చిన్న
తమ్ముడు, డాక్టరు ఇద్దరూ జబ్బుతో ఉన్న నా తమ్ముడిని ఆస్పత్రిలో చేర్పించారు. ఆస్పత్రిలో వైద్యులు పరీక్షించి, అయిదవ, ఆరవ ఎముకలలో
నొప్పి ఉన్న కారణంగా జబ్బు అంత తొందరగా నయం అవదని చెప్పారు. కాని మా ప్రయత్నం మేము చేస్తాము అని అన్నారు. మెడమీద ప్లాస్టర్ వేసి రెండు నెలలు ఉంచారు. మా తమ్ముడికి భోజనం తినిపించడం, త్రాగించడం అన్నీ
నర్సులే చేసేవారు. నా తమ్ముడికి చేతులలోను,
కాళ్ళలోను శక్తి క్షీణించింది. కేవలం ఆలోచనా
శక్తి మాత్రమే ఉంది. మందులు వేసుకుంటూ,
బాబా జపం చేసుకుంటూ ఉండేవాడు. ఆసమయంలో మా తమ్ముడు
ఉండే ప్రక్క ఊరిలోని వైద్యుడు మా తమ్ముడికి కొన్ని రోజులపాటు వైద్యం చేయడానికి వచ్చాడు. ఆయన సాయిబాబా భక్తుడు. ఆయన ఎప్పుడూ మాతమ్ముడి దగ్గరకు వస్తూ, నువ్వు సాయిబాబా
భక్తుడివి, అందుచేత నువ్వు తప్పకుండా ఈ రోగంనుంచి కోలుకుంటావు అని ధైర్యం చెబుతూ ఉండేవాడు. నువ్వు సాయిబాబాను జపిస్తూనే ఉండు అని అన్నాడు. అదే సమయంలో కొంతమంది వైద్యులు మాతమ్ముడికి మెడమీద
ఆపరేషన్ చేయాల్సిందేననీ అంతకు మించి మరొక మార్గం లేదని తమ అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. కాని బాబా కృపవల్ల ఆపరేషన్ అవసరం లేకుండానే నయమయింది. 13 నెలల తరువాత కొద్దిసేపు కూర్చోవడానికి అనుమతించారు. రెండు నెలల తరువాత కాస్త నడవడం మొదలుపెట్టాడు. ఇక ఇంటికి వెళ్లడానికి అనుమతించారు. నా తమ్ముడు మొత్తం 18 నెలలు ఆస్పత్రిలో ఉన్నాడు. ప్రపంచంలో మనం డబ్బు ఖర్చుపెట్టకుండా దేనినీ కొనలేము. కాని బాబా దయ ఉంటే మనకు అన్నీ చాలా సులభంగానే లభ్యమవుతాయి. 18 నెలల క్రితం నడవలేని స్థితిలో ఉన్న ఏతమ్ముడినయితే
మేము ఆస్పత్రికి తీసుకువెళ్ళామో ఆ తమ్ముడే బాబా దయవల్ల స్వయంగా నడచుకుంటూ ఇంటికి తిరిగి
వచ్చాడు. ఇపుడు వాడి ఆరోగ్యం పూర్తిగా బాగుపడింది. ఖార్ నుండి బాంద్రా వరకు ఒక్కడే నడచుకుంటూ వెడుతున్నాడు. బాబా కృపవల్ల మనకు ప్రతి వస్తువూ లభ్యమవుతుంది. దానికి మనకు కావలసినది కేవలం శ్రధ్ధ మాత్రమే.
గోవింద
శివరామ్ కార్ఖానీస్
(సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు)
2 comments:
Om Sairam
sai andarini challaga kapadu thandri 🙏🙏🙏
Post a Comment