28.06.2017 బుధవారమ్
ఓమ్ సాయి శ్రీసాయి జయజయ
సాయి
సాయి బంధువులకు బాబావారి
శుభాశీస్సులు
ఈ రోజు శ్రీ రాధాకృష్ణ
స్వామీజీ గారి గురించి అద్భుతమైన విషయాలను ప్రచురిస్తున్నాను. ఈ విషయాలు సాయిలీలా.ఆర్గ్ లోని సాయిపదానంద్ ఏప్రిల్,
2017 త్రైమాసపత్రిక సంచికనుండి గ్రహింపబడినది.
సాయిలీలా.ఆర్గ్ వారికి ధన్యవాదాలను తెలుపుకొంటున్నాను.
శ్రీరాధాకృష్ణస్వామీజీ
– శ్రీ త్యాగరాజ
రచన : శ్రీహరి
1965 లేక 1966 లో అనుకుంటాను,
అప్పట్లో శ్రీరాధాకృష్ణ స్వామీజీ గారు ఎన్.ఆర్.కాలనీ భవనంలోని మొదటి అంతస్థులో చిన్న
గదిలో ఉండేవారు. ఒకరోజున మేము (ఆరుగురం లేక
ఏడు మందిమి) ఆయన గదిలో సమావేశామయ్యాము. అప్పుడు
స్వామీజీ మమ్మల్ని ఉద్దేశించి ప్రసంగిస్తూ, “ఈ రోజునుంచి మనం ఒక నియమం పెట్టుకుందాము. సరిగ్గా రాత్రి 9 గంటలకు మనమందరం ఖచ్చితంగా నిశ్శబ్దాన్ని
పాటిద్దాము. ఎవరయినా వెళ్ళిపోదామనుకుంటే మవునంగానే
తలవంచి నమస్కరించి మాట్లాడకుండా వెళ్ళిపోవచ్చు.
నేను ‘ఏకాంతం’లోకి వెడతాను. అనగా ఏకాంతంలో
ఉన్నపుడు నేను మాట్లాడను” అన్నారు. ఈ నియమాన్ని
మేమందరం చాలా ఖచ్చితంగా పాటించేవాళ్ళం. ఒకరోజు
ఉదయం (తారీకు నాకు గుర్తు లేదు) ఎప్పటిలాగానే స్వామీజీ గదికి వెళ్ళి ఆయనకు నమస్కారం
చేసుకుని క్రింద కూర్చున్నాను. స్వామీజీ నవ్వుతూ
“నిన్న రాత్రి ఒక విశేషం జరిగింది తెలుసా అని, మీరందరూ వెళ్ళిపోయిన తరువాత నేను ఏకాంత
ధ్యానంలోకి వెళ్ళాను. కొంతసేపటి తరువాత ఎవరివో
మాటలు వినిపించాయి. వారు నాగురించె మాట్లాడుతున్నారు. నేను యిక్కడే వుంటున్నానా లేదా అని ఎవరినో వాకబు
చేస్తున్నారు. వారు తమిళంలో మాట్లాడుతున్నారు. వారిని చూడడానికి నేను గదినుంచి బయటకు వచ్చాను. బాల్కనీలోనుంచి క్రిందకి చూశాను. అక్కడ వయసుమళ్ళిన యిద్దరు దంపతులు నాగురించి అడుగుతున్నారు. నేను వారిని పిలిచి పైకి రమ్మని చెప్పాను. వారు బెంగళూరు వాసులు కారని స్పష్టంగా తెలుస్తూనే
వుంది. వారు నాగదిలోకి వచ్చి కూర్చున్నారు. నేను వారితో “నేను యిపుడు ఏకాంతంలో వున్నాను. మీకేంకావాలి” అని అడిగాను.
“మేము మూడు రోజులు తిరువయ్యార్
లో ఉన్నాము. అక్కడ మేము శ్రీత్యాగరాజస్వామిని
దర్శించుకుని ఆయన ఆశీర్వాదాలు పొంది శ్రీరామ మంత్రోపదేశం తీసుకుందామనుకున్నాము.
అక్కడ మేము మూడురోజులపాటు ప్రార్ధిస్తూ గడిపాము. మూడవరోజు రాత్రి శ్రీత్యాగరాజస్వామి మాకు కలలో కనిపించి
“మీరు బెంగళూరు వెళ్ళండి. అక్కడ శ్రీరామకృష్ణస్వామీజీ
ఉన్నారు. ఆయననుంచి మీరు శ్రీరామ మంత్రోపదేశం
పొందండి. పూర్వజన్మలో మేమిద్దరం కలిసి ఆడుకునేవాళ్లం. మీరు అక్కడికి వెళ్ళేటప్పటికి ఆయన ఏకాంతంలో ఉంటారు”
అని చెప్పారు. ఆయన మీ చిరునామా కూడా యిచ్చారని
ఆదంపతులు చెప్పారు. మేము ఈ బెంగళూరుకి క్రొత్త
అని చెప్పారు. శ్రీస్వామీజీ నవ్వి, ఆశ్చర్యాన్ని ప్రకటిస్తూ, “నేను, శ్రీత్యాగరాజు
యిద్దరం కలిసి ఆడుకునేవారమని మీరు ఊహించగలరా?
వారి కధనం ప్రకారం ఏకాంత అనే పదానికి ప్రామాణికత లభించింది. ఆ దంపతులు దేనికోసమయితే ప్రార్ధించుకున్నారో అది
వారికి లభించింది. అది శ్రీరామ మత్రోపదేశం. వారెంతో అదృష్టవంతులు.
శ్రీరాధాకృష్ణ స్వామీజీ
– శ్రీరామ
రచన : ప్రొఫెసర్ బి.కె.రఘుప్రసాద్
మనస్వామీజీలో కనిపించే
ఎన్నోలక్షణాలను బట్టి ఆయనకు శ్రీరామునిపై ఎంతప్రేమ వుందో స్పష్టంగా తెలుస్తుంది. శ్రీహర్షద్ పటేల్ అనే భక్తుడు ఒక సీలింగ్ ఫ్యాన్
ని విరాళంగా యిచ్చాడు. పురాతన భవనంలోని హాలులో
ఆఫ్యాన్ ని బిగించారు. ప్రధాన ద్వారానికి దగ్గరగా
వెనుకనున్న గోడవద్ద ఉన్న బాబాకు ఎదురుగా స్వామీజీ కూర్చుంటూ వుండేవారు.
ఫ్యాను బేరింగ్స్ చాలా
పాతవయిపోవడం వల్ల అరిగిపోయాయి. ఫ్యాను వేసినప్పుడెల్లా
అది తిరగడం మొదలుపెట్టగానే లయబధ్ధంగా శబ్దం చేస్తూ ఉండేది. ఆశబ్దం అందరికీ చాలా చికాకును కలిగిస్తూ ఉండేది. అయినా కాని వేసవికాలంలో ఆఫ్యానునే ఉపయోగిస్తూ ఉండేవాళ్ళం. మాకందరికీ అది చేసే ద్వని చాలా అసౌకర్యంగా ఉన్నప్పటికీ
స్వామీజీ మాత్రం ఆశబ్దం అంటే మక్కువ చూపేవారు.
ఆయన యిష్టపడటానికి కారణం చాలా సామాన్యమయినది. ఆఫ్యాను చేసే లయబద్ధమయిన శబ్దానికి అనుగుణంగా స్వామీజీ
చిరునవ్వు నవ్వుతూ రామ్, రామ్ రామ్ అంటూ రామనామ స్మరణ చేసేవారు. ఒకసారి ఆయన ఆ విషయం గురించి తమిళంలో చెప్పినట్లు
గుర్తు. “చూడు, ఆఫాను చేసే శబ్దంతోపాటుగా ‘రామ్, రామ్’ అని స్మరిస్తూ ఉంటే ఎంత మనోహరంగా
ఉందో” అన్నారు.
ఒకసారి నేను గమనించిన
సంఘటనని వివరిస్తాను. ఒకసారి స్వామీజీ తన కుడి
అరచేతి వెనుకభాగాన్ని చూపించి దానిమీదనున్న నరాలను నన్ను గమనించమని చెప్పారు. వెనుకవైపున మూడు ముఖ్యమయిన నరాలు ఉబ్బెత్తుగా కనిపించాయి. మధ్యలో ఉన్న నరం పొడవుగా వుంది. దానికి కుడివయిపు ఉన్న నరం చిన్నదిగాను, ఎడమవైపున
ఉన్న నరం యింకా చిన్నదిగాను వున్నాయి. క్రింద
చివరగా యింకొక అతి చిన్న నరం ఉంది. ఆనరాలు నుంచునివున్న భంగిమలో ఉండి మధ్యలో చిన్న
మెలిక ఉంది. శ్రీరాములవారు కోదండరామునిలా కనిపించారు. స్వామీజీ ఆ మూడింటినీ శ్రీరామ, శ్రీలక్ష్మణ, సీతాదేవిలుగా
భావిస్తున్నట్లుగా చెప్పారు. ఇక నాలుగవది హనుమంతులవారనేది స్పష్టం. “చూడు శ్రీరాములవారు ఎల్లప్పుడూ నాతోనే వుంటారు”
అని తమిళంలో చెప్పారు.
మరొక విషయం ఏమిటంటే సీతాదేవియొక్క
చిటికెన వ్రేలు విరిగిపోయి ఉంది. దీనిగురించి
ఈ పత్రిక సంపాదకీయంలోనే ప్రస్తావించబడింది.
దానిగురించి యింకా మరికొంత సమాచారం.
ఒకసారి స్వామీజీకి స్వప్నంలో
సీతాదేవి దర్శనమిచ్చి తన చిటికెన వ్రేలుకు దెబ్బతగిలి విరిగిందని చూపించింది. మరునాడు ఉదయం స్వామీజీ తన అంకితభక్తుడు, సహాయకుడు
అయిన శ్రీ డి.వి. కృష్ణమూర్తిని పిలిచారు.
విగ్రహానికి హాని జరిగినట్లుగా ఏదయినా వార్త వచ్చిందేమో చూడమన్నారు. కాని ఆయనకు అటువంటి వార్త ఏదీ కనపడలేదు. కాని చాలా ప్రయత్నం చేసిన తరువాత మందిరంలో వున్న
సీతాదేవి (శ్రీరామ, లక్ష్మణ, విగ్రహాలతోపాటు) విగ్రహం చిటికెన వ్రేలు విరిగి ఉంది. భగవంతునియొక్క చర్యలు ఎంత అధ్భుతమయినవో. ఈ విగ్రహాలు స్వామీజీగారి ప్రక్కనే ఉండేవి.
ఈ విషయం శ్రీరామనవమి
సందర్భంగా ప్రచురించిన సంపాదకీయంలో స్వామీజిగారి వ్యాసాలతోపాటుగా ప్రచురించడం యాదృచ్చికం. ఇవన్నీ స్వామీజీకి శ్రీరామునితోను, శ్రీత్యాగరాజస్వామితోను
కల సన్నిహితత్వాన్ని తెలియచేస్తాయి.
( పాత ఫానులు
బేరింగులు పాడయినప్పుడు లయబధ్ధంగా చప్పుడు చేస్తూ తిరుగుతూ ఉంటాయి. మనలో చాలా మంది
గమనించి ఉండవచ్చు. అదేవిధంగా రైలులో వెడుతున్నపుడు దాని శబ్దం కూడా అలాగే లయబధ్ధంగా
మనకి వినపడుతూ ఉంటుంది. ఆ శబ్దానికనుగుణంగా
మనం సాయినామమ్ గాని యింకా యితర నామాలను గాని మనం ఊహించుకోవచ్చు. ఈ సారి ఆవిధంగా ప్రయత్నించి చూడండి. అంటే అవి చేసే శబ్దాలు ఒక విధమైన మాటలను గాని, నామాన్ని
గాని ఉఛ్ఛరిస్తున్నట్లుగా భావించి చూడండి. అప్పుడు ఆశబ్దాలు మనకు చికాకులు కలిగించవు…. త్యాగరాజు)
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment