30.06.2017 శుక్రవారమ్
ఓమ్ సాయి శ్రీసాయి జయజయ
సాయి
సాయి బంధువులకు బాబావారి
శుభాశీస్సులు
ఈ రోజు మరొక అధ్బుతమయిన
సాయి బాబా గురించిన సమాచారం మనమందరం పంచుకుందాము. దీనికి సంబంధించిన సమాచారమ్ సాయిలీలా.ఆర్గ్
నుండి సంగ్రహింపబడినది. ఈ వ్యాసం సాయిసుధ
1944 సంచికలో ప్రచురింపబడినదానికి తెలుగు అనువాదమ్.
ఫకీరుగా వచ్చిన సాయి
శ్రీసాయిబాబా తన భక్తులలో
కొందరికి వారి వారి గురువులుగాను, వారి యిష్టదైవాలుగాను దర్శనమిచ్చారు. అంతేకాదు ప్రాణులన్నిటిలోను తానే వున్నానని వాటికి
సమర్పించిన ఆహారం తనకు చేరుతుందని చెప్పారు.
ఇపుడు చెప్పబోయేది అటువంటి అద్భుతమయిన లీల. రచయిత తన పేరును ప్రకటించుకోలేదు. తనది ఏగ్రామమో మాత్రమే చెప్పాడు.
మాది గుంతకల్లువద్ద కొనకొండ
గ్రామం. నేను సాయి భక్తుడిని. 28.02.1944 వ.సంవత్సరంలో
శ్రీ బి.వి. నరసింహస్వామిగారు మా గ్రామానికి వచ్చారు.
ఆయనను మా గ్రామంలోని వీధులలో ఊరేగిస్తూ తీసుకుని వచ్చారు. ఆ సమయంలో శ్రీ నరసింహస్వామితో పాటుగా వృధ్ధుడయిన ఒక ముస్లిమ్ వ్యక్తి ఆయన ప్రక్కనే నడుస్తూ స్వామిగారితో “నేను నిన్ను త్వరలోనే వజ్రకరూర్ లో కలుస్తాను” అని చెప్పాడు.
ఆయనను మా గ్రామంలోని వీధులలో ఊరేగిస్తూ తీసుకుని వచ్చారు. ఆ సమయంలో శ్రీ నరసింహస్వామితో పాటుగా వృధ్ధుడయిన ఒక ముస్లిమ్ వ్యక్తి ఆయన ప్రక్కనే నడుస్తూ స్వామిగారితో “నేను నిన్ను త్వరలోనే వజ్రకరూర్ లో కలుస్తాను” అని చెప్పాడు.
అతను అపరిచితుడు. ఆ దృశ్యం ఒక పెద్దమనిషి కంటపడింది. ఆఖరికి ఊరేగింపు పూర్తయింది. ఆరాత్రి చాలామందికి భోజనాలు ఏర్పాటు చేశారు. అందరికీ భోజనాలను ఏర్పాటు చేసిన వ్యక్తియొక్క సోదరుడు
నరసింహస్వామిగారితో కూడా ఉన్న ముస్లిమ్ వ్యక్తిని చూశాడు. అతనికి ఆ ముస్లిమ్ వ్యక్తికి భోజనం పెట్టడం యిష్టంలేకపోయింది. అందుచేత ఆ ముస్లిమ్ వ్యక్తివైపు చిటికెలు వేసి చేతులు
వూపుతూ మవునంగానే పిలిచాడు. ఆ ముస్లిమ్ వ్యక్తి
తనవైపు చూడగానే అతనిని అక్కడినుంచి వెళ్ళిపొమ్మని ఆజ్ఞాపించాడు. అందువల్ల ఆముస్లిమ్ వ్యక్తి భోజనం చేయకుండానే అక్కడినుండి
వెళ్ళిపోయాడు. ఈ విషయం నాకు తెలీదు. నేను ఆయనకు పాదపూజ చేసి నాసోదరుని యింటిలో శ్రీబి.వి.నరసింహస్వామిగారికి
రాత్రి భోజనం ఏర్పాటు చేశాను. ఆ తరువాత నిద్రపోయాను. ఆరాత్రి కలలో ఒక ఆరు సంవత్సరాల బాలుడు కనిపించి
“నువ్వేదో బ్రహ్మాండంగా భోజనాలు పెట్టానని ప్రగల్భాలు పలుకుతున్నావు. నాకు నెయ్యి వడ్డించలేదు” అన్నాడు. ఈ కలకి అర్ధం ఏమిటో నాకు బోధపడలేదు. ఉదయాన్నే విచారిస్తే, ఒక ముస్లిమ్ వ్యక్తి రావడం
అతనికి భోజనం పెట్టకుండా పంపించేయడం గురించి తెలిసింది. రాత్రి భోజనాలు ఏర్పాటు చేసిన పెద్దమనిషి యింటిలో
గురువారమునాడు భజన కార్యక్రమం ఏర్పాటు చేశారు.
అక్కడికి వెళ్ళి నాకు వచ్చిన కల గురించి, జరిగిన విషయం అంతా చెప్పాను. సాయిబాబాయే ముస్లిమ్ వ్యక్తి రూపంలో వచ్చారని, ఆయనకు
భోజనం పెట్టకుండా తన యింటినుంచి పంపించేశారని అర్ధమయింది ఆయనకి. జరిగినదానికి ఆయన చాలా బాధపడి తన దురదృష్టానికి
తిట్టుకున్నాడు. మరలా అదేవ్యక్తి తన యింటికి
వచ్చేంత వరకు భోజనం చేయకుండా ఉపవాసం ఉంటానని ఒట్టుపెట్టుకున్నాడు. ఆవిధంగానే ఉపవాసం ఉన్నాడు. రెండురోజుల తరువాత అదే వ్యక్తి రావడంతో ఆయన మనసు
కుదుటపడింది. నాకు కూడా ఎంతో సంతోషం కలిగింది. ఆయనకు సాదరంగా భోజనం పెట్టాము. అపుడు మామనసులు కుదుటపడ్డాయి. మాగ్రామంలో అతనిని మేమెపుడూ చూడలేదు. మాగ్రామానికి చాలా దూరంలో ఒక ముస్లిమ్ సాధువు వున్నాడు. ఆయన మూడుమైళ్ల దూరంలో ఉన్న వజ్రకరూర్ కి వెడుతూ
ఉంటాడు. ఆయనకు అక్కడ హిందూ, ముస్లిమ్ శిష్యులు
వున్నారు. ఆయన ప్రతి పౌర్ణమి రోజున వారికి హిందూ మంత్రాలను, ముస్లిమ్ వ్యాఖ్యానాలను,
ఆధ్యాత్మిక ప్రసంగాలను యిస్తూ ఉంటారు. మాగ్రామానికి
వచ్చిన ముస్లిమ్ వ్యక్తి ఆ ముస్లిమ్ సాధువు మాత్రం కాదు. ఈ వచ్చిన వ్యక్తిని మేమింతకుముందు ఎప్పుడూ చూడలేదు.
సాయిసుధ 1944
శ్రీసాయి సత్ చరిత్రను పారాయణ చేస్తున్న మన సాయి భక్తులందరం బాబా చెప్పిన విషయాలను ఎల్లప్పుడూ గుర్తు పెట్తుకోవాలి. బాబా ఎప్పుడు మనలని పరీక్షించడానికి వస్తారో తెలియదు. ఆయన రాకపోయినా ఆకలితో ఉన్నవాడికి పిలిచి భోజనం పెట్టాలి. ఎవరికి సమర్పించినా తనకు చెందుతుందని బాబా అన్న మాటలను మనం గుర్తుంచుకోవాలి.
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment