Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Tuesday, October 2, 2018

బాబా ఊదీ – మహా ప్రసాదమ్

0 comments Posted by tyagaraju on 6:37 PM


Image result for images of shirdi saibaba

Image result for images of rose hd



02.10.2018  మంగళవారమ్
ఓమ్ సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

బాబా ఊదీ – మహా ప్రసాదమ్

ఈ రోజు బాబావారి ఊదీ యొక్క అధ్బుతమైన శక్తికి సంబంధించిన లీల తెలుసుకుందాము.  ఇది
సాయి లీల.ఆర్గ్ నుండి సంగ్రహింపబడింది.
 తెలుగు అనువాదమ్ ః  ఆత్రేయపురపు త్యాగరాజు
అట్లాంటా,  అమెరికా

                                                                                జనక్ రాజ్ లరోయియా...  నోయిడా

సూర్యోదయానికి ప్రారంభంనుండే చల్లని పిల్లగాలులు అంతటా వ్యాపించి మనసుకు ఆహ్లాదాన్ని కలిగించినట్లుగా, అనతి కాలంలోనే షిరిడీ సాయిబాబావారి మహిమలు, ఆయన గొప్పతనం దేశం నలుమూలలా వ్యాపించాయనటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.  షిరిడీ సాయి సంస్థాన్ వారి నియమాలకు అనుగుణంగా ఢిల్లీ మరియు చుట్టుప్రక్కల నిర్మింపబడిన సాయిమందిరాలలో ప్రతిష్టించబడిన బాబావారి విగ్రహాలు ఎంతోమంది భక్తులను ఆకర్షిస్తూ ఉన్నాయి.  రోజురోజుకి వచ్చే భక్తుల సంఖ్య కూడా ద్విగుణీకృతమవుతూ ఉంది.  కుల, మత, జాతి, లింగ వివక్షతలు లేకుండా అన్ని వయసుల వారు ప్రతి గురువారంజరిగే బాబా ఆరతిలో విధిగా పాల్గొంటూ ఉన్నారు. 
 

Shirdi Sai Real Leelas

Bhjans Of Sai

Sai Prayer Club

My Blog List