02.10.2018 మంగళవారమ్
ఓమ్ సాయి
శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు
బాబావారి శుభాశీస్సులు
బాబా ఊదీ
– మహా ప్రసాదమ్
ఈ రోజు బాబావారి
ఊదీ యొక్క అధ్బుతమైన శక్తికి సంబంధించిన లీల తెలుసుకుందాము. ఇది
సాయి లీల.ఆర్గ్
నుండి సంగ్రహింపబడింది.
జనక్ రాజ్ లరోయియా... నోయిడా
సూర్యోదయానికి
ప్రారంభంనుండే చల్లని పిల్లగాలులు అంతటా వ్యాపించి మనసుకు ఆహ్లాదాన్ని కలిగించినట్లుగా,
అనతి కాలంలోనే షిరిడీ సాయిబాబావారి మహిమలు, ఆయన గొప్పతనం దేశం నలుమూలలా వ్యాపించాయనటంలో
ఎటువంటి అతిశయోక్తి లేదు. షిరిడీ సాయి సంస్థాన్
వారి నియమాలకు అనుగుణంగా ఢిల్లీ మరియు చుట్టుప్రక్కల నిర్మింపబడిన సాయిమందిరాలలో ప్రతిష్టించబడిన
బాబావారి విగ్రహాలు ఎంతోమంది భక్తులను ఆకర్షిస్తూ ఉన్నాయి. రోజురోజుకి వచ్చే భక్తుల సంఖ్య కూడా ద్విగుణీకృతమవుతూ
ఉంది. కుల, మత, జాతి, లింగ వివక్షతలు లేకుండా
అన్ని వయసుల వారు ప్రతి గురువారంజరిగే బాబా ఆరతిలో విధిగా పాల్గొంటూ ఉన్నారు.
అంతే
కాదు, నోయిడాతో సహా పెద్ద పెద్ద పట్టణాలలో క్రమం తప్పకుండా భక్తుల ఇళ్ళల్లో జరుగుతున్న
సాయి భజనలు కూడా బాబా వారి ఖ్యాతిని మరింతగా పెంపొందడానికి ప్రముఖమయిన పాత్ర వహిస్తున్నాయి. సాయి భజనలలో ఎంతోమంది భక్తులు పాల్గొంటూ మానసిక
ప్రశాంతతని, ఆధ్యాత్మికానందాన్ని పొందుతున్నారు.
భజనలు, కీర్తనలు పూర్తవగానే అందులో పాల్గొన్న భక్తులందరికీ చివరిగా బాబా ఆశీర్వాదంగా
క్రమంతప్పకుండా ప్రసాదాలను కూడా పంచడం జరుగుతూ ఉంది. భక్తులందరికీ ప్రసాదంగా బజారులో కొనితెచ్చిన లడ్డూలు
కాని, బర్ఫీలు గాని, భక్తులు తమ తమ ఇళ్ళల్లో స్వయంగా తయారుచేసి తీసుకుని వచ్చిన హల్వా,
లేక పూరి-సబ్జీలు గాని పంచి పెడుతూ ఉంటారు.
భక్తులు తమ శక్తి కొలది ఇటువంటివన్నీ తెచ్చి బాబాకు సమర్పిస్తూ ఉంటారు. కాని అటువంటి సందర్భాలన్నిటిలోను ప్రముఖంగా ఇవ్వబడె
బాబా ప్రసాదం ‘ఊదీ’. ఆఖరికి ఏమీలేనివాడయినా
బాబా ఊదీని ప్రసాదంగా పంచగలడు. మరొక విధంగా
చెప్పాలంటే ‘ఊదీ’ బాబావారు మనలను అనుగ్రహించి ఇచ్చే పవిత్రమయిన దీవెన.
ఊదీని
బాబాయే స్వయంగా సృష్టించిన దివ్యమయిన ప్రసాదం. ఊదీ బాబా ధునిలో వేసిన కట్టెలవల్ల వచ్చిన బూడిద అని
భావించడం ఎంతమాత్రం సరికాదు.
అది బాబా వెలిగించిన
పవిత్రమయిన ధునిలోనుంచి వచ్చిన మహిమగల ఊదీ. అప్పుడు బాబా వెలిగించిన ధుని నేటికీ నిరంతరం
వెలుగుతూనే ఉంది.
ఆ ధునిలోని ఊదీనే బాబా భక్తులందరికీ పంచుతూ ఉండేవారు. ఆ పవిత్రమయిన ఊదీ భక్తులందరి శారీరక బాధలనే కాకా
మానసిక బాధలను కూడా నివారిస్తూ ఉండేది. ఇప్పటికీ
అది దివ్యమయిన ఔషధంగా కూడా పని చేస్తూ ఉండటం బాబా భక్తులందరికీ అనుభవమే. ఊదీ ద్వారా ‘ఫకీర్’ ప్రపంచమానవాళికి ఆధ్యాత్మిక
విషయాలను తెలియచేసారు.
విభూతి ధర్మమేమిటి? మశీదులో ఆరకుండా నిర్విరామంగా
ధుని ఎందుకని వెలుగుతూ ఉంటుంది. విభూతి దానంలో
బాబా మనోగతమేమిటీ, దీని ద్వారా వారు సూచించినదేమిటి? అంటే విశ్వాంతర్గతంలోని ఈ దృశ్యజాలమంతా బూడిద అని
మనసులో నిశ్చయంగా తెలుసుకోవాలి. మన ఈ శరీరం
పంచభూతాల కాష్టం. భోగభాగ్యాలన్ని అనుభవించిన
తర్వాత ఇది నిశ్చేష్టగా పడిపోయి, బూడిదగా మారిపోతుంది. మనందరిది ఇదే స్థితి అని అహర్నిశలూ గుర్తుండేలా,
బాబా విభూతినిచ్చేవారు. (అధ్యాయం. 33).
ముఖ్యంగా
శ్రీసాయి సత్ చరిత్ర 33, 34 అధ్యాయాలలో ఊదీ యొక్క గొప్పతనం, గురించి, మహిమల గురించి
వర్ణించబడి ఉంది. అవన్నీగుర్తుకు తెచ్చుకుంటే
ఏఒక్క విషయాన్ని మరచిపోవడం సాధ్యం కాదు. ఇప్పటికీ శ్రీసాయిబాబా సశరీరంతో మన మధ్య లేకపోయినా,
షిరిడీలో నిరంతరం రోజుల తరబడి వెలుగుతూ ఉన్న ధునిలోనుంచి వచ్చే ఊదీ ప్రభావం భక్తులందరిమీదా
చూపిస్తూనే ఉంది. సాయి భక్తులందరూ తమ దగ్గర
పూజామందిరంలో బాబా ఊదీని భద్రపరచుకుని, తమకు వచ్చే శారీరక, బాధలనుంచి ఊదీ ప్రభావంతో బయటపడుతూ ఉన్నారు. ఆవిధంగా ఊదీ వల్ల బాబా ఆశీర్వాదం లభిస్తూ ఉంది.
ఒకవేళ
బాబా ఊదీ లభించని సందర్భాలలో మరొకవిధంగా లభించిన భస్మాన్నే బాబా ఊదీగా భావించుకొని
ఉపయోగించినా అది కూడా బాబా ఊదీ ఇచ్చే ఫలితాన్నే ఇస్తుంది. దీనికి సంబంధించిన ప్రత్యక్ష ఉదాహరణ మనం శ్రీ సాయి
సత్ చరిత్రలో గమనించవచ్చు.
“ఒకసారి
ఒక భక్తుడు, తన కూతురు ఎక్కడో గ్రామంలో ప్లేగు గడ్డలతో బాధపడుతూ ఉందన్న వార్త వినగానే
చించితంచసాగాడు. అతను బాంద్రానగరంలో ఉంటాడు. అమ్మాయి పర గ్రామంలో ఉంటుంది. అతని వద్ద, విభూతి లేదు. వెంటనే నానా చందోర్కరుకు ఒక వ్యక్తితో కబురు పంపాడు. బాబాను ప్రార్ధించి నాకు విభూతి పంపించి నన్నీదుఖఃనుండి
కాపాడండని. ఆసమయంలో నానా కుటుంబంతో సహా కళ్యాణ్
కు వెడుతూ మార్గంలో ఠాణా పట్టణంలో స్టేషన్ వద్ద కలిసాడు. అక్కడ అప్పుడతని వద్ద విభూతి లేదు. రోడ్డుమీద మన్ను తీసి, అక్కడే నిలబడి, సాయిసమర్ధుని
ప్రార్ధించి, వెనుకకు తిరిగి తన భార్య నుదుట దిద్దాడు. ఇక్కడ భక్తుడు తన కూతురు యొక్క ఊరికి వెళ్ళి అక్కడ
జరిగిన వృత్తాంతాన్ని విని చాలా సంతోషించాడు.
ఆమెకు మూడు రోజులు అత్యంత తీవ్రంగా జ్వరం వచ్చి, చాలా బాధ కలిగి క్రితంరోజే
తగ్గిందని తెలిసింది. చివరకు తేలిందేమిటంటె
నానా, మట్టిని తీసుకుని బాబాను ప్రార్ధించినప్పటినుండి
ఇక్కడ ఆమెకు జ్వరం తగ్గింది.
ఒకసారి
నన్ను భూటాన్ ఇంజనీరింగ్ సర్వీసులో పని చేయడానికి ఉద్యోగరీత్యా చుఖా గ్రామానికి పంపించారు. ఇది చుఖా నది ఒడ్డున నిర్మానుష్య ప్రాంతంలో ఉంది. ఇక్కడికి చేరుకోవడం కూడా చాలా కష్టమే. బహుశ నాకొక అనుభవం కలిగించడానికే మా ఛీఫ్ ఇంజనీరుగారు
నన్నిక్కడికి పంపించారేమో.
చుఖా నది మధ్యలో
ఉన్న బండరాళ్ళ మీద కూర్చుని ఏకాగ్రచిత్తంతో నేను గంటలతరబడి ధ్యానం చేసుకోగలుగుతున్నానంటే
అది బాబా నాకు అదృశ్యంగా ఉండి ఇచ్చిన ఆశీర్వాదమనే నేను భావించాను.
కొంతమంది
ఆఫీసు సిబ్బంది ఇక్కడ గుడారాలలో నివాసం ఉంటున్నారు. వీరంతా షిప్ట్ పద్ధతిలో తమ విధులను నిర్వహిస్తూ
ఉంటారు. వీరు తప్ప చుట్టుప్రక్కల మరో మానవ
మాత్రుడు ఎవడూ కన్పించడు. అందుచేత ప్రతివాళ్ళు
ఇటువంటి నిర్మానుష్య ప్రదేశాన్నించి ఏదోవిధంగ బయటపడి వెళ్ళిపోవడానికి ఎదురు చూస్తూ
ఉంటారు. నన్నిక్కడికి పంపించిన తరువాత మాఛీఫ్
ఇంజనీరుగారు ఇక్కడ అప్పటికే పనిచేస్తున్నవాళ్ళని మరొక మంచి ప్రదేశాలకి బదిలీ చేసి పంపించేయడం
మొదలుపెట్టారు. అలా పంపించబడ్డ ఉద్యోగులు చేయవలసిన పనుల బాధ్యతలను కూడా నామీదే పెట్టారు. వాళ్ళందరి పని
కూడా నేనే చేయవలసి వచ్చింది.
ఈ
విధంగా అక్కడ ఉన్న కాంపౌండర్ కమ్ డాక్టర్ ని కూడా బదిలీ చేసి డాక్టర్ చేసే పనులని కూడా
నామీదే పెట్టారు. ఏమయినా గాని, వైద్యం కోసం
నాదగ్గరకి వచ్చేవారు ఎవరయినా సరే వాళ్ళకి బాబా ఊదీనే మందుగా ఉపయోగించసాగాను. నిజం చెప్పాలంటే లభిస్తున్న మందులు తీసుకోవడానికి
బదులుగా వాళ్ళుకూడా నాదగ్గరకి ఊదీ కోసమే వచ్చేవారు.
ఒకరోజు
నేను నది ఒడ్డునుంచి తిరిగివస్తూ ఉన్నాను.
అప్పటికే సాయంత్రం బాగా ఆలశ్యమయింది. నాతో కూడా ఉన్న మా హెడ్ క్లర్క్ 10 అడుగుల గోతిలో
పడిపోయాడు. బాగా దెబ్బలు తగిలి గాయాలయ్యాయి. గాయాలు అంత ప్రమాదకరమయినవి కాకపోయినా లేచి నిలబడలేనంతగా
బాధ పెడుతూ ఉన్నాయి తగిలిన దెబ్బలు. కాని ఆసమయంలో
నాదగ్గర ఊదీ లేదు. సామాన్యంగా ఊదీ నాదగ్గరే
ఉంచుకుంటూ ఉంటాను. శ్రీసాయి సత్ చరిత్రలోని
ఘట్టాలను గుర్తు చేసుకుంటూ క్రిందకి వంగి చేతితో కొంత మట్టిని తీసాను. బాబాని స్మరిస్తూ మట్టినే ఊదీగా భావిస్తూ అతని నుదుటి మీద, గాయాల మీదా రాసాను. వెంటనే మా హెడ్ క్లర్క్,
లేచి నిలబడగలిగాడు. కుంటుతూ గుడారానికి వచ్చాడు. అక్కడ తనికి మిగతా చేయవలసిన వైద్యం చేసాను.
ఊదీ
మహిమ గలది, బాబా మహాపురుషుడు కాబట్టే ఆయన ఊదీకంత మహత్యం.
(సర్వం
శ్రీసాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment