22.02.2013 శుక్రవారము
ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
శ్రీవిష్ణుసహస్ర నామ స్తోత్రం 39వ.శ్లోకం, తాత్పర్యం
శ్లోకం : అతులశ్శరభో భీమస్సమయజ్ఞో హవిర్హరిః |
సర్వలక్షణ లక్షణ్యో లక్ష్మీవాన్ సమితింజయః ||
పరమాత్మను అసమానునిగా, వీరభద్రావతారముగా, శివునివలె భయకంపితుని చేయువానిగా, సంప్రదాయము తెలిసినవానిగా, యజ్ఞములో సమర్పింపబడు సమిధగా, ధర్మము నిలబెట్టుటకు దిగివచ్చువానిగా, సృష్టియందలి కళ్యాణగుణములన్నియూ కలిగి యున్నవానిగా, లక్ష్మీదేవి భర్తగా తోటివారిని మించువానిగా ధ్యానము చేయుము.
పుణ్యభూమి శిరిడీలో దొరికిన రత్నమణి సాయి - 2
రెండవ అధ్యాయము హైదరాబాద్
07.01.1992
ప్రియమైన చక్రపాణి,
శ్రీసాయిబాబా జీవిత చరిత్ర రెండవ అధ్యాయములో శ్రీ హేమాద్రిపంతు తన గురించి, తను రచించబోయే గ్రంధము గురించి తన అసలు పేరు తనకు హేమాద్ పంతు అనే బిరుదు ఎలాగ వచ్చినది, గురువుయొక్క ఆవశ్యకత గురించి వ్రాసినారు.



