18.03.2018 ఆదివారమ్
ఓమ్ సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
సాయి బంధువులందరికీ శ్రీ విలంబి నామ సంవత్సర శుభాకాంక్షలు
సాయి బంధువులందరికీ ఆయురారోగ్య ఐశ్వర్యములను ప్రసాదించి నిరంతరం మనలనందరినీ కంటికి రెప్పలా కాపాడమని సాయిబాబాని ప్రార్ధిస్తున్నాను.
ఈ రోజు నూతన తెలుగు సంవత్సర సందర్భముగా సాయి బంధువులందరికీ స్వామీజీ గారి అనుగ్రహ భాషణములో కొంతయినా ఇద్దామని ప్రయత్నం చేసాను. సమయా భావం వల్ల ఎక్కువగా ఇవ్వలేకపోయాను. తరువాతి ప్రచురణలో మరికాస్త ఎక్కువగా ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. --- సాయిరామ్
శ్రీ సాయి పదానంద రాధాకృష్ణస్వామీజీ
గారు భక్తులనుద్దేశించి
చేసిన ప్రసంగాలలోని విషయాలను “Swamiji talks to Devotees” పుస్తకంలోని విషయాలను తెలుగులో అనువదించి అందిస్తున్నాను. SrI sai
Spiritual Centre, T.Nagar, Bangalore వారు ముద్రించారు. ఈ రోజు ఆ ఈ పుస్తకానికి సంపాదకులు, ప్రొఫెసర్ పి.ఎస్.నారాయణ రావు, శ్రీ బి.కె. రఘు ప్రసాద్ గార్లు. సాయిలీల.ఆర్గ్ నుండి గ్రహింపబడినది.
తెలుగు అనువాదమ్ : ఆత్రేయపురపు త్యాగరాజు
శ్రీస్వామీజీ భక్తులతో జరిపిన అనుగ్రహ భాషణమ్ - 12 వ.భాగమ్
09.11.1971 ఆత్మజ్ఞానం పొందిన వ్యక్తికి సర్వతోముఖమయిన దృక్పధం ఏవిధంగా ఉంటుందో స్వామీజీ వివరించారు. ఆత్మజ్ఞానికి ద్వైతము, అద్వైతము, విశిష్టద్వైతము మొదలయిన తారతమ్యాలు ఏమీ ఉండవు. ఆవిధంగా బాబా కూడా వాటి తారతమ్యాల గురించి ఏనాడూ పట్టించుకోలేదు. ఆయన అన్ని సాంప్రదాయాలను, మతాలను ఒక్కటిగానే భావించారు.



