Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com
Showing posts with label శ్రీసాయితో మధురక్షణాలు - 34. Show all posts
Showing posts with label శ్రీసాయితో మధురక్షణాలు - 34. Show all posts

Sunday, January 26, 2014

శ్రీసాయితో మధురక్షణాలు - 34

0 comments Posted by tyagaraju on 11:13 PM
                  
                           

27.01.2013 సోమవారం
ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

శ్రీసాయితో మధురక్షణాలు - 34

బాబా మీద మనకు అచంచలమైన భక్తి, విశ్వాసం, నమ్మకం ఉండాలేగాని, అసాధ్యమనుకున్నవాటిని కూడా బాబా సాధ్యం చేసి చూపిస్తారు.  బాబా మన చెంతనే ఉన్నప్పుడు మనం ఎటువంటి ఆందోళన చెందనక్కరలేదు.  అటువంటిదే ఇప్పుడు మీరు చదవబోయే అధ్బుతమైన బాబా లీల.    


సాయినాధుడు రైలును ఆపుట

ఒక చిన్న పిల్లవాడు ఒంటరిగా నడుస్తున్నప్పుడు, తనకి ఏవైపునుంచయినా ప్రమాదం కలుగుతుందేమోననే భయంతో చుట్టు జాగ్రత్తగా గమనిస్తూ నడుస్తాడు.  కాని తండ్రితో గాని,తల్లి గాని కూడా ఉన్నప్పుడు ఆడుతూ పాడుతూ తనని గురించి కూడా ఏమాత్రం పట్టిచుకోకుండా నడుస్తాడు. ఎటువంటి భయం ఉండదు.  అలాగే మనతో కూడా మనం సాయినాధుని విగ్రహాన్ని తీసుకొస్తూ ఉన్నప్పుడు, మన క్షేమం గురించి గాని, యిక ఏయితర సమస్యల గురించి గాని ఎటువంటి ఆందోళన చెందనక్కరలేదు. దారిలో ఎదురయ్యే విఘ్నాలు చిన్నవైనా గాని, పెద్దవైన గాని వాటివల్ల ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా సాయినాధులవారు మనలని కంటికి రెప్పలా కాపాడుతూ ఉంటారు.

Thursday, January 2, 2014

శ్రీసాయితో మధురక్షణాలు - 34

0 comments Posted by tyagaraju on 5:09 AM
              
                                
02.01.2014 గురువారం
ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబా వారి శుభాశీస్సులు

శ్రీసాయితో మధురక్షణాలు - 34

శ్రీసాయితో మధురక్షణాలలో మరొక మధురాతి మధురమైన క్షణం ఈ రోజు తెలుసుకొందాము.  ముందుగా శ్రీ విష్ణుసహస్రనామ స్తోత్రం 105, 106,107,108 శ్లోకాలను కూడా ఇచ్చి ఈ రోజుతో పూర్తి చేస్తున్నాను. 
                        
శ్రీవిష్ణుసహస్రనామం

105 వ. శ్లోకం: యజ్ఞభృద్యజ్ఞకృద్యజ్ఞీ  యజ్ఞభుగ్యజ్ఞసాధనః    |

        యజ్ఞాంగ కృద్యజ్ఞ గుహ్యమన్నమన్నాద ఏవచ            ||   

తాత్పర్యం:  నారాయణుని యజ్ఞము భరించువానిగా, కర్తగా, యజమానిగా మరియు అనుభవించువానిగా, ధ్యానము చేయుము.  ఆయన సృష్టికి లయకారకుడుగా నున్నాడు.  ఆహారము తినువారియందు, తినబడు ఆహారము నందునూ, తానే యజ్ఞ స్వరూపుడై దాగియున్నాడు.

106వ.శ్లోకం:  ఆత్మయోనిః స్వయంజాతో వైఖానస్సామగాయనః           |

               దేవకీ నందనః స్రష్టా క్షితీశః పాపనాశనః   ||

తాత్పర్యం:  నారాయణుని తనయందే తాను పుట్టుక గలవానిగా, మరియూ తనకు తానే పుట్టువానిగా, తనను తాను తనలోనుండి త్రవ్వుకొనువానిగా, తన గానముగా తనకు సృష్టించుకొనుచున్న వానిగా ధ్యానము చేయుము.  ఆయన ఈ లోకములన్నిటికి సృష్టికర్త, అధిపతి, రక్షించువాడు, మరియు నశింపచేయువాడు, ఆయన పాపములను నశింపచేయు దేవకీదేవి కుమారుడు.   

107వ.శ్లోకం:  శంఖభృన్నందకీ చక్రీ శార్ఞ్గధన్వా  గదాధరః   | 

               రధాంగపాణి రక్షోభ్యః సర్వప్రహరణాయుధః        || 

తాత్పర్యం:   పరమాత్మను,  శంఖమును, ఖడ్గమును, చక్రమును, ధనుస్సును, గదను ధరించినవానిగా ధ్యానము చేయుము.  ఆయన రధచక్రమును చేత ధరించుటచే క్షోభింప చేయుటకు అలవికానివానిగా యున్నాడు.  ఆయన తన ఆయుధములతో చక్కగా కొట్టగలిగినవాడై యున్నాడు.    

108వ.శ్లోకం: వనమాలీ గదీశారీ శంఖీ చక్రీ చ నందకీ         |

              శ్రీమన్నారాయణో విష్ణుర్వాసుదేవో భిరక్షతు            || 

తాత్పర్యం:  నారాయణుని వన పుష్పములతో కూడిన మాలను ధరించినవానిగా, గదను, విల్లును, శంఖమును, చక్రమును, ఖడ్గమును, ధరించి తన వైభవమును లేక మహిమలను వెదజల్లువానిగా, జీవశక్తి యను జలములకు అధిపతియైన వానిగా, వ్యాపించుట అను శక్తికధిపతిగా, మనయందు వాసుదేవుడను పేర నివసించువానిగా ధ్యానము చేసినచో అతడు అన్ని వైపులనుండి మనలను రక్షించును.  

                                        సంపూర్ణం 
     
 

Shirdi Sai Real Leelas

Bhjans Of Sai

Sai Prayer Club

My Blog List

  • - 22.06.2026 సోమవారమ్ ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ సాయి సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు శ్రీ సాయి లీల ద్వైమాస పత్రిక మార్చ్, ఏప్రిల్, 2026, సంచికలో ప్ర...
    3 months ago