27.01.2013 సోమవారం
ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
శ్రీసాయితో మధురక్షణాలు - 34
బాబా మీద మనకు అచంచలమైన భక్తి, విశ్వాసం, నమ్మకం ఉండాలేగాని, అసాధ్యమనుకున్నవాటిని కూడా బాబా సాధ్యం చేసి చూపిస్తారు. బాబా మన చెంతనే ఉన్నప్పుడు మనం ఎటువంటి ఆందోళన చెందనక్కరలేదు. అటువంటిదే ఇప్పుడు మీరు చదవబోయే అధ్బుతమైన బాబా లీల.
సాయినాధుడు రైలును ఆపుట
ఒక చిన్న పిల్లవాడు ఒంటరిగా నడుస్తున్నప్పుడు, తనకి ఏవైపునుంచయినా ప్రమాదం కలుగుతుందేమోననే భయంతో చుట్టు జాగ్రత్తగా గమనిస్తూ నడుస్తాడు. కాని తండ్రితో గాని,తల్లి గాని కూడా ఉన్నప్పుడు ఆడుతూ పాడుతూ తనని గురించి కూడా ఏమాత్రం పట్టిచుకోకుండా నడుస్తాడు. ఎటువంటి భయం ఉండదు. అలాగే మనతో కూడా మనం సాయినాధుని విగ్రహాన్ని తీసుకొస్తూ ఉన్నప్పుడు, మన క్షేమం గురించి గాని, యిక ఏయితర సమస్యల గురించి గాని ఎటువంటి ఆందోళన చెందనక్కరలేదు. దారిలో ఎదురయ్యే విఘ్నాలు చిన్నవైనా గాని, పెద్దవైన గాని వాటివల్ల ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా సాయినాధులవారు మనలని కంటికి రెప్పలా కాపాడుతూ ఉంటారు.
బరోడాలోని ఖందేరావ్ మార్కెట్ కు ఎదురుగా ఒక కుటుంబం నివసిస్తోంది. వారు బాబా విగ్రహాన్ని 1980వ.సంవత్సరం ఫిబ్రవరి 14వ.తేదీ గురువారం మహాశివరాత్రినాడు తమ యింటిలో ప్రాణప్రతిష్ట చేయిద్దామనుకొన్నారు. బొంబాయిలో రెండు అడుగుల బాబా విగ్రహాన్ని కొన్నారు.
బరోడాకు వెళ్ళేముందు ఆ పవిత్ర విగ్రహాన్ని షిరిడీలో బాబా సమాధి వద్దకు తీసుకొని వెడదామనుకొని ట్రాన్స్ పోర్ట్ వారితో మాటలాడి ఒక వెహికిల్ ని ఏర్పాటు చేసుకొన్నారు. కాని తరువాత ట్రాన్స్ పోర్ట్ వాళ్ళు బుకింగ్ కాన్సిల్ చేశామని చెప్పడంతో వారికి పెద్ద సమస్య ఎదురయింది. ఆఖరికి ఫిబ్రవరి 11వ.తేదీ 1980వ.సంవత్సరం సోమవారం మధ్యాహ్న్నం ఒంటిగంటకు ఒక మెటాడోర్ వాను ఏర్పాటు చేసుకొన్నారు. గుర్గావ్ నించి ముగ్గురు కుటుంబసభ్యుల బృదం షిరిడీకి బయలుదేరారు. సాయంకాలానికి నాసిక్ చేరుకొన్నారు. త్రయంబకేశ్వరుని దర్శించుకొని రాత్రికి ముక్తిధాంలో బస చేశారు (నాసిక్ రోడ్).
మరుసటిరోజు 12వ.తేదీ ఉదయం వారు షిరిడీ చేసుకొన్నారు. పూజారులు, భక్తుల సహాయంతో వారు విగ్రహాన్ని సమాధి మందిరంలోకి తీసుకొని వెళ్ళి తమ కోరికను తీర్చుకొన్నారు. సాకోరీ వెళ్ళి నాసిక్ కి సాయంకాలం 5.30 కి తిరిగి వచ్చారు. 12వ.తారీకున వారు బరోడా ఎక్స్ ప్రెస్ లో బొంబాయికి బయలుదేరాలి. అందరూ తొందర తొందరగా బయలుదేరారు. రైలు బొంబాయి సెంట్రల్ లో రాత్రి, 10.30 కి బయలుదేరి భొరివలి కి వచ్చి అక్కడినుంచి 11.21 కి బయలుదేరుతుంది. థానా లో ట్రాఫిక్ జాం వల్ల వాళ్ళు చేరుకోవడానికి కనీసం 50నిమిషాలు ఆలస్యమవుతుంది. ఇక బొంబాయి సెంట్రల్ కి గాని, బోరివలీ కి గాని రైలు బయలుదేరే సమయానికి చేరుకోవడం చాలా కష్టం. రైలు బోరివాలి నించి 11.21 కి బయలుదేరుతుంది. కాని వాళ్ళు 11.20 కి ఇంకా పోవాయి లోనే ఉన్నారు. మరుసటి రోజు ఉదయానికి బరోడా ఎటువంటి పరిస్థితులలోనూ తప్పకుండా చేరి తీరాలి. మీరంతా ఒప్పుకుంటే ఆరే కాలనీ నుండి దగ్గరదారిలో తీసుకెడతానన్నాడు వాన్ డ్రైవరు. (ఆరయ్ చెక్ పోస్ట్ వాళ్ళు రాత్రి 9 తరవాత ప్రైవేట్ వాహనాలని అనుమతించరు) ఏదోవిధంగా చెక్ పోస్ట్ వాళ్ళకి నచ్చచెప్పి ఒప్పించి ఆరే కాలనీ నించి దగ్గర దారిలో రాత్రి 11.30 కి గోరేగావ్ హైవే కి చేరుకొన్నారు. ఏదో విధంగా సాయినాధులవారు అసాధారణమైన పరిస్థితులలో రైలును ఆపుచేస్తారనే గట్టినమ్మకంతో ఉన్నారు. హైవే మీద చాలా వేగంగా బోరివలి రైల్వే క్రాసింగ్ కి రాత్రి 11.42 కి చేరుకొన్నారు (రైలు బయలుదేరే సమయం రాత్రి 11.21) బరోడా ఎక్స్ ప్రెస్ ఇంకా మూడవ నంబరు ప్లాట్ ఫారం మీదే ఉండటంతో చాలా ఆశ్చర్యపోయారు.
వారిలో ఒకరు వెంటనే ఇంజిన్ డ్రైవరు దగ్గరకు వెళ్ళి రైలుని 3,4 నిమిషాలపాటు ఆపమని కోరారు. డ్రైవరు దానికి ఒప్పుకొన్నాడు. అందరూ బాబా విగ్రహాన్ని మోసుకొంటూ హడావిడిగా ప్రవేశ ద్వారం నించి యింజన్ దగ్గరే ఉన్న మొదటి బోగీ జనరల్ కంపార్ట్ మెంట్ లోకి ఎక్కేశారు. తరువాత రైలు బయలుదేరింది. సాయినాధులవారు వారికోసం రైలుని 24,25 నిమిషాలపాటు ఆపుచేయించారు. ఏ కారణంలేకుండా రైలు ఆగిపోవడం డ్రైవరుకి కూడా చాలా ఆశ్చర్యం అనిపించింది. డ్రైవరు (కాంతిలాల్ మేఘా) వసాడ్ స్టేషన్ లో బాగా రద్దీగా ఉన్న వీరి బోగీ దగ్గరకి వచ్చి శ్రీసాయినాధుల వారి దర్శనం చేసుకొన్నాడు.
వారితో పాటుగా మెటాడోర్ వానులో ఉన్న షీల్ భాటియా, డా.మహేష్ దోషి రెండు కుటుంబాలవారు కూడా నమ్మశక్యంగాని ఈ అద్భుత లీలను ప్రత్యక్షంగా చూసి ఆశ్చర్యపోయారు. వారు షిరిడీ వెళ్ళడం కూడా అదే మొదటిసారి.
పవిత్రమైన మహాశివరాత్రినాడు వారు తమ ఇంటిలో శ్రీసాయినాధులవారి విగ్రహ ప్రతిష్ట ఎంతో ఘనంగా జరుపుకొన్నారు.
శ్రీసాయిలీల
జూన్ 1980 డా.షిరిష్ కె.స్వాడియా
ముంబాయి
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment