12.11.2017 ఆదివారమ్
ఓమ్ సాయి శ్రీసాయి జయజయ
సాయి
సాయి బంధువులకు బాబావారి
శుభాశీస్సులు
ఈ రోజు శ్రీసాయిపదానందరాధాకృష్ణస్వామిజీ
బ్లాగులో ప్రచురింపబడ్డ బాబా చూపిన లీలను ప్రచురిస్తున్నాను.
ఒక సాయిభక్తురాలి ఈ అనుభవం
ఆంగ్ల బ్లాగులో గురువారమ్, ఆగస్టు, 27, 2015 లో ప్రచురింపబడింది.
ఈ బ్లాగులో ప్రచురింపబడ్డ
లీలలను అనువాదమ్ చేసి ప్రచురిస్తూ ఉంటాను.
తెలుగు అనువాదం : ఆత్రేయపురపు త్యాగరాజు
ప్రసవానికి ముందు సాయిబాబా
దర్శనమ్
నాకు ప్రసవం అవడానికి
యింకా నెల రోజులు ఉందనగా, ఒక గురువారము నాడు, తెలుగు ఛానల్ లో సాయిబాబా సినిమా చూస్తున్నాను. ఆ సినిమా హిందీ భాషలో బాగా ప్రజాదరణ పొందినప్పటికీ,
నాకు తెలుగులో వచ్చిన సినిమా అంటేనే బాగా యిష్టం.



