20.08.2020 గురువారమ్
ఓమ్
సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి
బంధువులకు బాబావారి శుభాశీస్సులు
బాబానే
ఆశ్రయించాలి
ఈ
రోజు బాబా భక్తుడొకరు వివరించిన అనుభవాన్ని, అతని అభిప్రాయాలను ప్రచురిస్తున్నాను. ఇది శ్రీసాయి లీల త్రైమాసపత్రిక జనవరి, ఫిబ్రవరి,
మార్చ్, 1952వ.సంవత్సరంలో ప్రచురితమయింది.
ఇందులో ఆ భక్తుడు వివరించినదాని ప్రకారం ఆరోజులలోనే తామే బాబా శిష్యులమని తిరిగేవారు
ఉన్నారని వారు తమ మాటల గారడీతో ప్రజలను ఆకర్షించేవారని మనకి తెలుస్తుంది. బాబా తాను ఉన్న రోజులలోనే ఎవరినీ తన శిష్యులుగాను,
ఫలానావారు తమ శిష్యుడని గాని ఎప్పుడూ ప్రకటించలేదు. ఏ సందేహమున్నా నేరుగా తననే అడగమని బాబా చెప్పారన్న
విషయం శ్రీ సాయి సత్ చరిత్ర చదివినవారందరికి తెలుసు. మరి అటువంటప్పుడు తామే గురువులమని, బాబా బోధనలను
వినిపిస్తూ ప్రజలను ఆకర్షించి తమ శిష్యులుగాచేసుకొనే వారి వద్దకు వెళ్ళినట్లయితే ఎటువంటి
ఫలితం ఉంటుందో ఈ భక్తుడు వివరంగా తెలియ చేస్తున్నాడు. ఇక చదవండి.
తెలుగు అనువాదమ్ ః ఆత్రేయపురపు త్యాగరాజు
నిజాంపేట, హైదరాబాద్
ఫోన్. 9440375411 & 8143626744
శ్రీ
షిరిడీ సాయిబాబా వారి అనురాగానికి, ఆయన శక్తికి, చేసే అధ్భుతాలకి సంబంధించి నేను పంపుతున్న
నా అనుభవాన్ని మీ శ్రీసాయిలీల త్రైమాసపత్రికలో ప్రచురించినట్లయితే అది నా భాగ్యంగా
భావిస్తాను. అంతే కాదు నేను మీకెంతో ఋణపడిఉంటాను.
దీనిని దయచేసి మీ పత్రికలో ప్రచురించవలసినదిగా
కోరుతున్నాను.
నాకు
సాయిబాబా మీద పరిపూర్ణమయిన నమ్మకం ఉన్నప్పటికి నేను మొట్టమొదటిసారిగా 1951వ.సంవత్సరంలో
షిరిడీ వెళ్ళాను. నా చిన్నతనంనుంచి 15 సంవత్సరాలకు
పైగా నేనాయన గురించి విన్నాను. అసాధారణమయిన
రీతిలో కనిపించే బాబా వారి ఫొటో సాధారణంగా మనం ఎక్కడా చూడము, కొందామన్నా ఎక్కడా దొరకదు. అటువంటి ఫోటోని నా మేనమామ నాకు కానుకగా ఇచ్చాడు.