21.08.2020 శుక్రవారమ్
ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
వినాయకచవితి శుభాకాంక్షలు
గౌరి - గణపతి
సాయిభక్తులందరికీ, బాబా, మరియు గణపతి తమ తమ ఆశీర్వాదాలను అందించి అందరూ సుఖశాంతులతో వర్ధిల్లాలని మనసారా కోరుకొంటున్నాను.
ఈ రోజు మరొక అధ్భుతమయిన బాబా లీల విభూతి మహిమ గురించి శ్రీమతి మాధవిగారు భువనేశ్వర్ నుండి పంపించారు.
శ్రీసాయిలీల
పత్రికలో ప్రచురింపబడిన ఈ లీలను విభూతియొక్క మహిమను చదివిన తరువాత, బాబావారి ఊదీకి ఉన్న శక్తి ఎటువంటిదో మనం గ్రహించుకోవచ్చు.
గౌరి – గణపతి అనగా గణేష్ చతుర్ధి రావడానికి కొన్ని రోజులే ఉంది. మా మహారాష్ట్రలో మేము దానిని ఒక పెద్ద ఉత్సవంలా జరుపుకొంటాము. మేమందరం పండగ సందడిలో ఉన్నాము.
ఒకరోజు రాత్రి ఉన్నట్టుండి నావీపుమీద బాగా దురద, నొప్పి కలిగింది. ఏమయిఉంటుందా అని చూస్తే చిన్న కురుపు లేచింది. ఏదో చిన్నదే కదా అదే తగ్గిపోతుంది అనుకున్నాను. ఆ చిన్న కురుపే రాత్రికల్లా పెద్ద పుండుగా మారింది. నిమ్మకాయంత రూపం దాల్చి చెప్పలేనంత నొప్పి కలగసాగింది. జ్వరం కూడా వచ్చింది. నాకు ఆ సమయంలో సాయినాధుడు గుర్తుకు వచ్చాడు. నా వయసు ఇపుడు 81 సంవత్సరాలు. నా చిన్నప్పుడు ఈవిధంగా నావంటిమీద ఎప్పుడన్నా కురుపులు వచ్చాయేమో నాకు గుర్తులేదు. రెండు మూడు రోజులు గడిచేటప్పటికి కురుపు ఇంకా పెద్దదయి పడుకోవడం కూడా చాలా కష్టమయింది. నా కుడిచేతివైపు వచ్చినందువల్ల చెయ్యిని పైకి కూడా ఎత్తలేకపోయేదానిని. ప్రతిరోజూ చేసుకునే పూజ కూడా మానేశాను. సమయానికి మా కుటుంబవైద్యుడు కూడా ఊరిలో లేడు. మా అబ్బాయి నావీపుమీద ఉన్న కురుపుని చూసి ఆపరేషన్ చేస్తే తప్ప నయంకాదని చెప్పాడు.
ఇప్పటికే నావయస్సు అయిపోయింది.
నాకు
ఆపరేషన్ అంటే చాలా భయం.
అపుడు
బాబాను వేడుకొన్నాను, “బాబా! గౌరి, గణపతి రూపంలో నాయింటికి వచ్చే నువ్వు, ఈ సంవత్సరం కూడా రావా?
ఈ
నొప్పిని భరించలేకుండా ఉన్నాను.
నీకు
పూజకూడా చేసే స్థితిలో లేను.
నువ్వే
ఏదో ఒకటి చేయాలి”
ఈ
విధంగా ప్రార్ధించుకుంటూ ఉండగా, ఇంతలో తపాలా బంట్రోతు వచ్చి, ‘సాయిలీల’ పత్రిక ఇచ్చి వెళ్ళాడు.
ఆపుస్తకం
చదువుతున్నపుడు
అందులో విభూతి మహిమ గురించి రాసి ఉంది.
ప్రతిక్షణం
కూర్చున్నా లేచినా బాబా, బాబా అని అంటూ ఉండే నేను బాబా ఊదీని ఎలా మర్చిపోయాను?
ఇన్ని
రోజులూ నా ఇంట్లోనే దివ్యమయిన ఔషధాన్ని పెట్టుకొని ఎక్కడో వెతుకుతున్నాను.
ఇపుడు
వచ్చిన సాయిలీల పత్రిక ద్వారా బాబా నాకు గుర్తుచేసారు.
వెంటనే
లేచి, బాబా ఊదీని కాస్త నావీపుమీద లేచిన కురుపు మీద రాయమని మాకోడలితో చెప్పాను.
నేను
కొంచెం నీళ్ళలో కలుపుకొని త్రాగాను.
అపుడు
బాబాను ఇలా ప్రార్ధించుకొన్నాను. “బాబా ఈ కురుపు దానంతటదే పగిలేలా చేయి, ఈ వయసులో నేను ఆపరేషన్ తట్టుకోలేను.
నాకు
చాలా భయంగా ఉంది.
నువ్వే
రక్షించాలి”.
ఆ తరువాత రోజు మా కుటుంబ వైద్యుడు వచ్చారు.
ఆయనతో
నాకురుపు గురించి చెప్పాను.
ఆయన
నా వీపును పరీక్షగా చూసి, “ఏదీ కురుపు?
ఏమీలేదు
పిన్నిగారూ.. అంతా మామూలుగానే ఉందిగా” అన్నారు.
అదేమిటి?
అంత పెద్ద కురుపు నా వీపుమీద ఉంటే ఈ వైద్యుడికి కనపడలేదా?
ఏమీ
లేదంటాడేమిటీ? అనుకుని “నిన్నటివరకు వీపు మీద పెద్ద కురుపు ఉంది.
అది
చాలా నొప్పిని కలుగచేస్తూ ఉంది.
మరి
మీకు ఏమీ కనపడకపోవటం ఏమిటి? అన్నాను.
“లేదు పిన్నిగారు, అది మచ్చ పడిపోయింది.
అది
మాయం అయిపోయింది.
ఆపరేషన్
కూడా ఏమి వసరం లేదు” అన్నాడు వైద్యుడు.
ఆశ్చర్యంతో నాకు మాటలు రాలేదు.
నా
ఆనందాన్ని వర్ణించలేను.
నా
‘గౌరి – గణపతి’ పూజను నిర్విఘ్నంగా పరిసమాప్తి కావాలని బాబాను వేడుకున్నాను.
బాబా
నాకు ఎటువంటి కష్టం కలగకుండా ఆరోగ్యాన్ని ప్రసాదించారు.
మనం
ఏదయినా దైవకార్యం ప్రారంభించదలచుకున్నపుడు సదా సర్వదా ఆసాయినాధుని అండదండలు కృపాదృష్టి మనమీద తప్పకుండా ఉంటాయి.
ఓ! సాయిదేవా
నీకృపాదృష్టి
సదా సర్వదా అందరిమీద ఇలాగే ఉండనీ…
మాలతి,
ధానే,
మహారాష్ట్ర
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)
1 comments:
Nice articel, This article help me very well. Thank you. Also please check my article on my site What is HTML?.
Post a Comment