Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Friday, May 28, 2021

శ్రీ రామ రక్షా స్తోత్రమ్…

0 comments Posted by tyagaraju on 7:36 AM

 



28.05.2021 శుక్రవారమ్

ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ సాయి

సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

ఈ రోజు మరొక అధ్భుతమయిన లీలను ప్రచురిస్తున్నాను.  శ్రీ సాయిలీల ద్వైమాసపత్రిక సెప్టెంబర్ – అక్టోబర్, 2014 వ.సంవత్సరంలో ప్రచురింపబడింది.

బాబాకు తన భక్తుల మదిలోని కోరికలు, ఆశయాలు, అన్ని తెలుసు.  దానికనుగుణంగానే ఎవరికి ఎప్పుడు ఏది ఇవ్వాలో వారికేది శ్రేయస్కరమో బాబాకు బాగా తెలుసు.  అటువంటి అద్భుతాన్ని సంధ్యా చౌదరిగారు వివరిస్తున్నారు.

శ్రీ రామ రక్షా స్తోత్రమ్…

హిందీ మూలమ్ :  సంధ్యా చౌదరి

తెలుగు అనువాదం : ఆత్రేయపురపు త్యాగరాజు,

నిజాంపేట, హైదరాబాద్

ఎన్నో రోజులుగా నాకు రామరక్షా స్త్రోత్రాన్ని చదవాలనే కోరిక.  పూజాసామగ్రి, పుస్తకాలు అమ్మే దుకాణాలలో నాకు ఆపుస్తకం ఎంత ప్రయత్నించినా దొరకలేదు.

Thursday, May 27, 2021

ఎరుపు రంగు చున్నీ…

0 comments Posted by tyagaraju on 8:11 AM

 



27.05.2021  గురువారమ్

ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ సాయి

సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

హిందీ మూలమ్ – సంధ్యా చౌదరి

తెలుగు అనువాదమ్ : ఆత్రేయపురపు త్యాగరాజు,

నిజాంపేట, హైదరాబాద్

శ్రీ సాయి లీల ద్వైమాస పత్రిక సెప్టెంబర్ – అక్టోబర్, 2014 వ.సంవత్సరంలో ప్రచురింపబడిన మరొక అధ్భుతమయిన లీలను ఈ రోజు మీకందిస్తున్నాను.  బాబా లీలలు మనం ఊహించని విధంగా ఉంటాయనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.  ఈ అధ్భుతమయిన లీలను గ్రహించుకోవడానికి మన శక్తి చాలదేమో అన్నంతగా బాబా చూపించారు.

ఎరుపు రంగు చున్నీ…

సాయిబాబావారి మహిమను వర్ణించగలిగే యోగ్యత నాలో లేదు.  నాకటువంటి యోగ్యత ఏమీ లేకపోయినా బాబా నాకు కలిగించిన ప్రత్యక్షానుభవానికి సంబంధించిన క్షణం గురించి ఆ సమయంలో నేననుభవించిన ఆనందం గురించి వివరిస్తాను.

 

Shirdi Sai Real Leelas

Bhjans Of Sai

Sai Prayer Club

My Blog List